Kaju Chicken Fry

 

కాజు చికెన్ ఫ్రై

కావాల్సిన పదార్ధాలు:

చికెన్ - ఒక కేజీ

పసుపు - అర టీస్పూన్

ఉప్పు - సరిపడా

అల్లం వెల్లులి పేస్ట్ - అర టేబుల్ స్పూన్

నీరు - ముప్పావు కప్పు

మసాలా పొడి కోసం:

ధనియాలు - రెండు టేబుల్ స్పూన్స్

జీలకర్ర - ఒక టీస్పూన్

మిరియాలు - ఒక టీస్పూన్

యాలకులు - నాలుగు

లవంగాలు - ఏడు

కొబ్బరి పొడి - పావు కప్పు

గసగసాలు - ఒక టేబుల్ స్పూన్

దాల్చిన చెక్క - రెండు

చికెన్ వేపుడుకి:

నూనె - అర కప్పు

కరివేపాకు - నాలుగు రెబ్బలు

అల్లం వెల్లులి పేస్ట్ - అర టేబుల్ స్పూన్

జీడిపప్పు - పావు కప్పు

కారం - 1 1/4 టేబుల్ స్పూన్

ఉప్పు - తగినంత

తయారీ విధానం:

చికెన్ లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేవరకు వేపుకుంటూ... ఆఖరున కొబ్బరి పొడి, గసగసాలు కూడా వేసి వేపుకోవాలి. అవి చల్లారాక మెత్తని పొడి చేసుకోవాలి. చికెన్ లో నీరు పోసి కుక్కర్ మూతపెట్టి, హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి ఆవిరిని పోనివ్వాలి. నూనె వేడి చేసి, జీడిపప్పుని ఎర్రగా వేపి పక్కన పెట్టుకొని, మిగిలిన నూనెలో కరివేపాకు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి. తర్వాత ఉడికిన చికెన్ని నీరుతో సహా పోసి మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. సుమారుగా 20 నిమిషాలకి చికెన్ ముక్క రంగు మారుతుంది. అప్పుడు ఉప్పు, కారం, వేపుకున్న మసాలా పొడితో పాటు వేపుకున్న జీడిపప్పు వేసి కలిపి ఇంకో రెండు నిమిషాలు వేపి దింపేసుకోవాలి.