Kajjikyalu
కజ్జికాయలు
కావలసిన వస్తువులు
మైదా-: అర కేజీ
నెయ్యి:100 గ్రాములు
ఉప్పు:కొద్దిగా
చక్కెర: 400 గ్రాములు
కొబ్బరికాయలు:2
గసగసాలు:100 గ్రాములు
పుట్నాల పప్పు:150గ్రాములు
యాలకులు : 5గ్రాములు
ఆయిల్-తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా మైదావిండిలో నెయ్యి,సాల్ట్ నీళ్ళ వేసి పూరీల పిండిలా కలుపుకోవాలి.
స్టవ్ వెలిగించిఒక గిన్నెలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయించిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చివరిలో యాలకుల పొడి కలిపి ఉంచాలి.
ఇప్పుడు మైదాను చిన్న, చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూ రీల్లా వత్తి, దాని మధ్యలో తయారు చేసుకున్న కొబ్బరి తురుము, పుట్నాల పప్పు పిండి మిశ్ర మాన్ని రెండు స్పూనులు వేసి పూరీని అర్ధ చంద్రాకారంలో మడవాలి .
తర్వా త వాటి చివరలను తడి చేసి మడత మీద మడత ఓక డిజైన్ లా వేళ్లతో గట్టిగా అదమండి.
ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ కాగనిచ్చి తయారయిన కజ్జికాయ లను నూనెలో ఎర్రగా వేయించాలి.