Jangri (Diwali Special)

 

 

 

జాంగ్రీ (దీపావళి)

 

 

కావలసిన పదార్థాలు:-

 

మినపప్పు - 1/2 కిలో

నెయ్యి - 1/2 కిలో 

చెక్కర - 1 కిలో

బియ్యం - కొద్దిగా

 

తయారు చేసే విధానం:-

బియ్యం, మినపప్పు 5, 6 గంటలు నానబెట్టాలి. మినపప్పు, బియ్యం మెత్తగా రుబ్బాలి. బాణలిలో  నెయ్యి వేసి బాగా కాగనివ్వాలి. ఈలోగా ఒక లాంగ్ క్లాత్ తీసుకొని, సన్నటి చిల్లు చేసి, పిండి అందులో పోయాలి.  నెయ్యి బాగా కగిన తర్వాత జంతికలు, జిలేబీ చేసిన్నట్టే పిండిని నెయ్యి లో  చుట్టలు చుడుతూ వేసి వేగనివ్వాలి. మరోవైపు పంచదార తీగపాకం సిద్ధం చేసుకొని  పాకంలో కొద్దిగా మిఠాయి రంగు వేసి, వేగిన జాంగ్రీలను పాకంలో నానబెట్టాలి. మార్కెట్ లో దొరుకుతున్న జాంగ్రీ, జిలేబీ మిక్స్ తో కూడా జాంగ్రీ, జిలేబీ తాయారు చేసుకోవచ్చు.