Jackfruit Masala Curry

 

 

పనసకాయ మసాలా కుర్మా  కూర

 

 

కావలసిన పదార్థాలు:

పనసకాయ ముక్కలు - 3 కప్పులు 

చింతపండు -పెద్ద నిమ్మకాయంత

అల్లం&వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్

ఉల్లిముద్ద - 1 కప్పు 

తరిగిన ఉల్లిపాయల ముక్కలు - 1కప్పు 

గరం మసాలా పొడి - 2 స్పూన్స్

పొడి కారం - 2స్పూన్స్

ఉప్పు - రుచికి సరిపడినంత

పసుపు - చిటికెడు

జీడిపప్పు - 50గ్రాములు

కొత్తిమీర - కొంచంగా

పోపు దినుసులు - తగినన్ని 

నూనె - 150గ్రాములు

 

తయారుచేసే విధానం:

ముందుగా పనసకాయ ముక్కల్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుని ఉంచుకోవాలి.  స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పనసకాయ ముక్కల్ని చింతపండు రసం,ఉప్పు,పసుపు వేసి 20 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి పోపు దినుసులు వేసుకుని అవి వేగాకా జీడిపప్పు,ఉల్లిముక్కలు వేసి అవి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు & ఉల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించాలి. ఇప్పుడు అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న పనస ముక్కల్ని వేసి గరం మసాల పొడి,కారం వేసి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.ఎంతవరకు అంటే నీరు అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు.అంతే ఇప్పుడు తయారైన కూరని ఒక డిష్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే.

-కళ్యాణి