Idli Manchuria

 

 

మంచూరియా ఇడ్లీ

 

 

 

కావలసినవి:

ఇడ్లీలు - 5

ఉప్పు - సరిపడినంత

ఆయిల్‌ -  తగినంత

అల్లం - కొద్దిగా

కొత్తిమీర - రెండు కట్టలు

సోయాసాస్‌ - మూడు టీ స్పూన్లు

అజినోమోట్‌ - చిటికెడు

పచ్చిమిర్చి - 10

వెల్లుల్లి - 10

ఉల్లికాడలు - మూడు

 

తయారీ:
ముందుగా ఇడ్లీలను ముక్కలుగా కట్‌చేసి నూనెలో దోరగా వేయించుకోవాలి. తరువాత పాన్ పెట్టి కొంచెం నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకుని అదే పాన్ లో అల్లంముక్కలు, సోయా సాస్‌, చిల్లీసాస్‌ కలిపి అర గ్లాసు నీళ్లు పోసి బాగా మరుగుతుండగా వేయించిన ఇడ్లీ ముక్కలు వేసి ముక్కలు విరిగి పోకుండా జాగ్రత్తగా కలపాలి. తరువాత ఉప్పు, అజినోమోట్‌ వేసి కొత్తిమీర తురుము వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.