How to Make Palli Chutney
పల్లి చట్నీ , కాస్త కొత్తగా
పల్లీలు తక్కువుగా వున్నప్పుడు , ఇడ్లి , దోస లలోకి చట్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ చట్నీ ట్రై చేయండి . టేస్ట్ డిఫరెంట్ గా వుంటుంది.
కావలసిన పదార్ధాలు:-
పల్లీలు - 5 చెమ్చాలు
మినపప్పు - 1 చెమ్చ
శనగ పప్పు - 1 చెమ్చ
ఆవాలు - అర చెమ్చ
జీలకర్ర - పావు చెమ్చ
ఎండు మిర్చి - 6
పచ్చి మిర్చి - 4
ఉల్లిపాయలు చిన్నవి - 2
టమాటో చిన్నది - 1
వెల్లుల్లి రెబ్బలు - 3
నూనె - పోపుకి సరిపోయేటంత
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికడు
తయారీ విధానం:-
ముందుగా బాణలిలో నూనె వేసి , పోపు సామానంత వేయాలి . వాటితో పాటు పల్లీలు ఎండు మిర్చి, పచ్చి మిర్చి కూడా వేసి వేయించాలి. అవి కొంచం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఒక 5 నిముషాలు వేయించి , ఆ తర్వాత టమాటో చేర్చాలి. ఇంకో 5 నిముషాలు వేయించి దించే ముందు వెల్లులి వేయాలి. ఉల్లిపాయ , టమాటో పచ్చి వాసన పోతే చాలు. బాగా మగ్గక్కర లెద్దు. చల్లారాక ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరానికి తగ్గ నీరు పోసి రుబ్బితే చట్నీసిద్దం అయిపోతుంది.
టిప్ : * టమాటో అందుబాటులో లేక పోతే చట్నీ తయారయ్యాక కొంచం నిమ్మరసం కలిపి చూడండి .
* అలాగే ఉల్లిపాయ లేక పోతే టమాటో తో పాటు పుట్నాలు పప్పు కొంచం వేసి రుబ్బుకుంటే బావుంటుంది .
* అలాగే కాబేజీ తరుగు వేసి వేయించి చేసినా కూడా చట్నీ టేస్టీ గా వుంటుంది .
- రమ