How To Make Junnu

 

 

జున్ను తయారీ విధానము

 

 

కావాల్సిన పదార్థాలు:

జున్నుపాలు - 1 గ్లాసు
పచ్చి పాలు - 1 గ్లాసు
బెల్లం తురుము - 1 గ్లాసు
మిరియాలపొడి - చిటికెడు
యాలుకలపొడి - చిటికెడు

 

తయారీ విధానము:

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో జున్నుపాలు మరియు పచ్చి పాలు కూడా  పోయండి.

 

ఈ మిశ్రమంలో బెల్లం తురుము కలపండి.

 

తరువాత యాలుకలపొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి గిన్నెలో వడపోసుకోవాలి.

 

స్టౌవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెపెట్టి దాంట్లో ఒక గ్లాస్ నీళ్లుపోసి అందులో మనం తయారు చేసుకున్న జున్ను పాల మిశ్రమాన్ని పెట్టి 10-15 నిమిషాల పాటు ఉడికించాలి.

 

అంతే వేడి వేడి జున్ను రెడీ..

 

Tip: బెల్లం అందుబాటులో లేకపోతే చెక్కరతో కూడా చేసుకోవచ్చు.

https://www.youtube.com/watch?v=sdgwGFIjOjk