Holi Special Lauki Halwa
లౌకి హల్వా
రంగుల పండుగ రోజున ఒకరికి ఒకరు తీపి ఇచ్చి పుచ్చుకుంటారు. అలా ఈ హోలీకి అత్మీయులకి ఇవ్వటానికి ఈ స్వీట్ చేసి చూడండి.
కావాల్సిన పదార్థాలు:
ఆనపకాయ కోరు - 4 కప్పులు
కోవా - ఒక కప్పు
పంచదార - రెండు కప్పులు
నెయ్యి - ఒక ఆరు చెమ్చాలు
యాలకుల పొడి - తగినంత
జీడిపప్పు, పిస్తా, బాదం - తగినంత
తయారీ విధానం:
ముందుగా ఆనపకాయని చెక్కుతీసి సన్నగా తురుము కోవాలి. బాణలిలో నెయ్యి వేసి ఆనపకాయ తురుముని వేసి సన్న మంట మీద వేయించాలి. కమ్మటి వాసన వచ్చాక, ముందుగా మరిగించి పెట్టుకున్న పాలు పోసి కలపాలి. పాలల్లో ఆనపకాయ తురుము ఉడుకుతుంది. అలా వుడుకుతూ ఆ మిశ్రమం దగ్గరకి అవుతూ వుండగా కోవా, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుతూ వుండాలి. కాసేపటికి ఆ మిశ్రమం ఓ మోస్తరుగా గట్టిపడుతుంది . అప్పుడు స్టవ్ ఆపి ఓ కప్పులోకి తీసుకుని నేతిలో వేయించిన జీడిపప్పు, పిస్తా, బాదం పైన వేసి కలపాలి. లౌకి హల్వా చాలా రుచిగా వుంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.
టిప్: ఈ హల్వా త్వరగా చేయాలి అనుకున్నప్పుడు పాలకు బదులు, కండెన్స్‌డ్ మిల్క్ వాడచ్చు. అయితే అది వేసినప్పుడు పంచదార వేయక్కర్లేదు.
-రమ