Gujarati Avakaya
గుజరాతీ ఆవకాయ
కావలసిన పదార్థాలు:
పచ్చి మామిడికాయలు - ఒక కిలో
మెంతులు - ముప్పావు కప్పు
ఆవాలు - అరకప్పు
కారం - అరకప్పు
రాతి ఉప్పు - అరకప్పు
నువ్వుల నూనె - మూడున్నర కప్పులు
పసుపు - రెండు చెంచాలు
ఇంగువ - అరచెంచా
తయారీ విధానం:
మెంతుల్ని మిక్సీలో వేసి పౌడర్ లా కాకుండా రవ్వలాగా చేసి పెట్టుకోవాలి. మామిడికాయల్ని బాగా కడిగి, తుడిచి, ముక్కలుగా కోసుకోవాలి. ఓ బౌల్ లో మామిడి ముక్కలు వేసి, దంచిన మెంతుల్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఇంగువ, ఉప్పు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జాడీలో గానీ కంటెయినర్ లో కానీ వేసి ఆపైన నూనె పోయాలి.
ముక్కలు పూర్తిగా మునగకపోతే ఇంకాస్త నూనె పోయాలి. తర్వాత మూత గట్టిగా పెట్టి పక్కన పెట్టేయాలి. రెండు మూడు రోజులకోసారి తీసి, కలిపి మళ్లీ మూత బిగించెయ్యాలి. పది పన్నెండు రోజులకల్లా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత తీసి వడ్డించవచ్చు.
- Sameera