Herbal Green Tea
హెర్బల్ గ్రీన్ టీ
కావలసిన పదార్ధాలు:
* పుదీనా ఆకులు - 10
* తులసి ఆకులు - 8
* గ్రీన్ టీ పొడి - 1/2 స్పూన్
* నిమ్మరసం - 10 చుక్కలు
* తేనె - 1 చెంచా
తయారీ విధానం:
ముందుగా టీ పాట్ లో రెండు గ్లాసుల నీళ్లు మరిగించడానికి పెట్టి అందులో తులసి, పుదీనా ఆకులు వెయ్యాలి. అవి మరుగుతుండగా గ్రీన్ టీ బ్యాగ్ లేదా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 నిమిషం తరువాత వడపోసి అందులో నిమ్మరసం తేనె కలుపుకుని త్రాగాలి. రుచిని బట్టి.. తులసి, పుదీనాతో ఓసారి.. అల్లం ముక్కలు దంచి.. ఓ మారు మిరియపు పొడి కలిపి ఇలా టీని రకరకాల రుచులు జోడించి తేనె, నిమ్మరసం కలుపుకొని.. రోజుకు 2,3 సార్లు పైగా త్రాగినా ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.
--భారతి