Gongura Pachiroyyalu Curry Recipe
గోంగూర రొయ్యలు కర్రీ రెసిపి
కావలిసినవి:
రొయ్యలు : అర కిలో
గోంగూర : అర కిలో
నూనె : 50 గ్రాములు
పచ్చిమిర్చి : 10
కారం : రెండు స్పూనులు
వెల్లులి : 10 రెబ్బలు
కరివేపాకు : సరిపడా
ఎండుమిర్చి : 5
ఉల్లిపాయలు : రెండు
ఉప్పు : సరిపడా
ఆవాలు : ఒక స్పూన్
జీలకర్ర : ఒక స్పూన్
తయారుచేయు విధానం :
* ముందుగా రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకోవాలి.
* గోంగూర ఆకులు కట్ చేసుకుని కడిగిఅందులో పచ్చిరొయ్యలు,ఉల్లిపాయలు, కారం , ఉప్పు,పచ్చిమిర్చి ముక్కలు వేసి నీళ్ళు పోసి ఉడికించాలి.
* గోంగూర మెత్తగా మగ్గాక దించి నీళ్ళు వార్చేయ్యాలి.
* తరువాత గిన్నెపెట్టి ఆయిల్ వేసి కాగాకా వెల్లులి,ఎండుమిర్చి,తాలింపు దినుసులు కరివేపాకు వేసి ఉడికించుకున్న గోంగూర పచ్చిరొయ్యలు తాలింపువేసుకోవాలి.