Coconut Kalakand

 

 

 

కొబ్బరి కలాకండ్ 

 

 

పిల్లలు ఇష్టంగా తినే స్వీట్.. అలాగే త్వరగా చేయగలిగే స్వీట్ ఇది. ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళతో కబుర్లు చెబుతూనే వేడివేడిగా చేసిపెట్టేయచ్చు. 

 

కావలసిన పదార్థాలు:
కొబ్బరి తురుము - ఒక కప్పు 
పాలు - రెండు కప్పులు 
పంచదార  పొడి - ఒక కప్పు 
కండెన్స్డ్ మిల్క్ - చిన్న కప్పు 
నెయ్యి - రెండు చెంచాలు

 

 

తయారుచేసే విధానం:
ముందుగా పాలని మందపాటి గిన్నెలో పోసి, కొంచం చిక్కబడేవరకు సన్నని మంట మీద ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును నేతిలో కొంచం రంగు మారే దాకా వేయించి మరుగుతున్న పాలలో వేయాలి. ఇప్పుడు అడుగు అంటకుండా కలుపుతూ వుండాలి. ఆ మిశ్రమం చిక్కబడుతుండగా  పంచదార పొడి వేసి బాగా కలియబెట్టాలి.  ఇప్పుడు మిశ్రమం మళ్ళీ కొంచం పలచబడుతుంది. అది తిరిగి గట్టిపడేవరకు కలిపి... దించే ముందు కండెన్స్డ్ మిల్క్ వేసి, ఓ పది నిముషాలు సన్నని మంటమీద వుంచి దించాలి. మరీ గట్టిగా కాకుండా కలాకండ్‌లా కొంచం మెత్తగా వుంటుంది ఇది. నోట్లో వేసుకోగానే మీకు తెలియకుండానే గొంతులోకి జారిపోయేంత టేస్ట్‌గా వుంటుంది.

 

 

 

-రమ