Chilli Paneer Recipe
చిల్లీ పనీర్ రెసిపి
కావలసిన పదార్ధాలు.
కాప్సికమ్ : 200 గ్రాములు.
పనీర్ : 250 గ్రాములు.
ఉల్లిపాయలు: 200 గ్రాములు.
పచ్చి మిర్చి : 5
టొమాటోలు: 3
ఉల్లిపాయ పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
టొమాటో ప్యూరీ : 2 టేబుల్ స్పూన్లు
నూనె : 2 కప్పులు
ఉప్పు : తగినంత
సోయా సాస్ : 2 టేబుల్ స్పూన్లు
చిల్లీ సాస్ : 1 టీస్పూన్
మిరియాల పొడి: 1/2 టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్లు
తయారు చేసే విధానం :
కాప్సికమ్‌ను,ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి . టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.పచ్చి మిరపకాయలను మద్యలోకి కట్ చెయ్యాలి.
స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు, కాప్సికమ్, పనీర్,కొంచం సాల్ట్ వేసి అన్ని వేగాక ఒక ప్లేటులో పెట్టుకోవాలి.
మళ్ళీ గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేసి దానిలో ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు అందులోమిరి యాల పొడి, కారం వేసి వేగనివ్వా లి. అందులోనే సోయా సాస్,చిల్లీ సాస్ వేసి కొంచం సేపు వేయించాలి.
ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్, పనీ ర్, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.