Cauliflower aloo curry Recipe
కాలిఫ్లవర్ బంగాళదుంప కర్రీ రెసిపి
కావలసిన పదార్ధాలు :
బంగాళదుంపలు పావ్ కేజి
కాలిఫ్లవర్ ఒకటి
ఉల్లిపాయలు రెండు
టొమాటోలు 100 gm
అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్
పచ్చిమిర్చి రెండు
పసుపు 1/4 టీ స్పూన్
కారం పొడి 1 టీ స్పూన్
గరం మసాలా 1/2 టీ స్పూన్
కరివేపాకు 1 టీ స్పూన్
కొత్తిమీర 2 టీ స్పూన్
నూనె 3 టేబుల్ స్పూన్
ఉప్పు తగినంత
తయారి విధానం :
ఉల్లిపాయలు బంగాళదుంపలను ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.
కాలిఫ్లవర్ చిన్నముక్కలు కట్ చేసి ఉప్పు వేసిన గోరు వెచ్చటి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి కరివేపాకు, పసుపు,కారం,పచ్చి మిర్చ్చి, అల్లం వెల్లుల్లి వేసి కొద్ది సేపయ్యాక కాలిఫ్లవర్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
తర్వాత బంగాళ దుంపలు, టొమాటో ముక్కలు వేసిన తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. బాగా ఫ్రై అయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
ముక్కలన్ని ఉడికాక గరం మసాలా,కొత్తిమిర చల్లి స్టౌవ్ ఆఫ్ చేయ్యాలి. టేస్టీ కర్రీ రెడీ...