Carrot Sorakaya Sweet and Godhuma Rava Halwa
క్యారట్ , సొరకాయ స్వీట్
గోధుమ రవ్వ హల్వా
క్యారట్ , సొరకాయ స్వీట్
క్యారట్ , సొరకాయ స్వీట్ : బాదం పప్పు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, క్యారట్ తురుము, సొరకాయ తురుము, డాల్డా, చక్కర, పాలు.
ముందుగా గిన్నెలో డాల్డా వేసి అది వేడయ్యాక జీడిపప్పు, బాదం పప్పు, ఎండుద్రాక్ష వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో మిగిలిన ఉన్న డాల్డాలో సొరకాయ తురుము, క్యారట్ తురుము వేసి సొరకాయలో ఉన్న నీరు ఇంకేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తరవాత అందులో పాలు పోసి ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అది కాస్త దగ్గరకు వచ్చాక దించేసి, అంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి.
గోధుమ రవ్వ హల్వా
గోధుమ రవ్వ హల్వా : ఎండుద్రాక్ష, బాదంపప్పు, జీడిపప్పు,చక్కర, గోదుమ రవ్వ, డాల్డా, పాలు.
ముందుగా గిన్నెలో డాల్డా వేసి అది వేడయ్యాక ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి, గిన్నెలో మిగిలి ఉన్న డాల్డా లో గోధుమరవ్వ వేసి అది బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఆ ఆతరవాత అందులో పాలు పోసి దగ్గరకు వచ్చేంతవరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత దించేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి.