Carrot Finger Chips

 

క్యారట్ ఫింగర్ చిప్స్


కావలసినవి:

క్యారట్ – 4
సోయాసాస్ – 2 టీ స్పూన్లు
టొమాటో సాస్ – 2 టీ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్
ఉప్పు – తగినంత
కారం – తగినంత
కార్న్‌ఫ్లోర్ – 3  స్పూన్లు
శనగపిండి – టీ స్పూన్
చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు


తయారి:

ముందుగా క్యారెట్ ను శుభ్రంగా కడిగి  వాటిని పొడవుగా అన్నింటిని సమానంగా కట్ చేసుకోవాలి తరువాత గిన్నెలో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్,  కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం,  టొమాటో సాస్, చిల్లీ సాస్,సోయాసాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి, కాగాక కలిపి ఉంచుకున్న పిండిలో క్యారట్ ముక్కలను ముంచి, కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చెయ్యాలి...