Boondi perugu pacchadi
బూందీ పెరుగు మిక్స్
కావలసినవి:
బూందీ - ఒక కప్పు
పెరుగు - రెండు కప్పులు
జీలకర్ర - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారుచేసే విధానం:
* ముందుగా పెరుగును ఒక గిన్నెలో పోసి, బాగా చిలికి తగినంత ఉప్పు కలిపి విడిగా పక్కన పెట్టుకోవాలి.
* తరువాత బూందీని నీటిలో వేసి, కొంచెం నానిన వెంటనే తీసి, చిలికిన పెరుగులో కలపాలి.
* ఇప్పుడు ఈ పెరుగును, బూందీ మిశ్రమాన్ని ఒక డిష్ లో వెయ్యాలి.
* తరువాత దానిలో జీలకర్ర కారం వేసి కలపాలి. చివరికి కొత్తిమీర జల్లుకోవాలి. అంతే బూందీ పెరుగు మిక్స్ సిద్దం.
* ఈ రుచికరమైన బూందీ పెరుగు మిక్స్‌ని సాయంత్రం పూట పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు.