Bisi Bele Bath

 

 

బిసి బెలె బాత్

 

 

 

కావలసినవి:

అన్నం - 2 కప్పులు

ధనియాలు - 1 స్పూన్

మిరియాలు - 4 

కందిపప్పు - ఒక కప్పు

సెనగపప్పు - 2 స్పూన్స్

ఆవాలు,జీలకర్ర - 1 స్పూన్

జీడిపప్పు - కొద్దిగా

కరివేపాకు - సరిపడా

క్యారెట్ - ఒకటి

ఇంగువ - చిటికెడు

ఎండుమిర్చి - రెండు

కొత్తిమీర తరుగు -  రెండు స్పూన్లు

మెంతులు - 1/2 స్పూన్

కొబ్బరి తురుము - ఒక స్పూన్

చింతపండు - కొద్దిగా

బెల్లం - చిన్న ముక్క

అనపకాయముక్కలు - కొన్ని

ఉల్లిపాయ  - ఒకటి

ములక్కాడ - ఒకటి

 

తయారీ :

ముందుగా కందిపప్పు,కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు  కుక్కర్లో ఉడికించుకోవాలి . తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సెనగపప్పు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి ధనియాలు వేయించుకొని కొబ్బరి కలిపి చల్లారక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తరువాత చింతపండు రసంలో గ్రైండ్ చేసిన ముద్దా కలిపి ,ఉడికించిన పప్పు,కూర ముక్కలు, ఉప్పు, బెల్లం కలిపి సాంబార్ కాచుకోవాలి సాంబార్ లో ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు. జీలకర్ర వేసి వేగేకా జీడిపప్పు,ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిటికెడు ఇంగువ వేసి వేగాక  సాంబార్ అన్నం వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు కలపాలి.