Bendakaya Pulusu
బెండకాయ పులుసు
కావాల్సిన పదార్ధాలు:
బెండకాయ ముక్కలు - 300 గ్రాములు
నూనె - 3 స్పూన్స్
ఆవాలు - 1 స్పూన్
మెంతులు - 1/2 స్పూన్
జీలకర్ర -1 స్పూన్
పచ్చి సెనగపప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
కరివేపాకు రెబ్బలు - 2 రెబ్బలు
ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి చీలికలు - 4
ఎండుమిర్చి -2
పసుపు - 1/4 స్పూన్
దంచిన వెల్లులి - 5 రెబ్బలు
చింతపండు పులుసు - 400 ml
సెనగపిండి నీళ్లు (పిండిలో 100ml కలిపినా నీరు) - 1 టెబుల్ స్పూన్
బెల్లం - 3 టెబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తమారీ విధానం:
నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు సెనగపప్పు జీలకర్ర మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, దంచిన వెల్లులి, కరివేపాకు వేసి మెంతులు ఎర్రబడే దాకా వేపుకోవాలి. వేగిన తాలింపులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ వేగేదాక వేయించాలి. వేగిన ఉల్లిపాయలో పసుపు బెండకాయ ముక్కలు వేసి కలిపి 5 నిమిషాలు పైన కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. వేగిన బెండకాయ ముక్కల్లో చింతపండు పులుసు ఉప్పు బెల్లం వేసి బెండకాయలు ఉడికే దాకా మూతబెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. బెండకాయ ముక్కలు మెత్తబడ్డాక గడ్డలు లేకుండా కలుపుకున్న సెనగపిండి నీళ్లు పోసి కలిపి మరో 3-4 నిమిషాలు ఉడికించి దింపుకోవాలి. (పులుసు చిక్కగా అనిపిస్తే కాసిని నీళ్లు పోసి పలుచన చేసుకోండి).