Beetroot Vadalu
బీట్‌రూట్ వడలు
కావలసినవి:
బీట్‌రూట్ - 1
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
జీలకర్ర - ఒక స్పూను
శనగపప్పు - రెండు కప్పులు
కొత్తిమీర - 1 కట్ట
కరివేపాకు - కొద్దిగా
నూనె - సరిపడా
పచ్చిమిరపకాయలు - 5
ఉప్పు - తగినంత
అల్లం తురుము - రెండు టీ స్పూన్లు
తయారి విధానం :
శనగపప్పు ముందురోజు నానబెట్టుకోవాలి. తరువాత రోజు ఉదయం పప్పుని శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు వేసి కొంచం పలుకు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర తురుము, బీట్‌రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపిపక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉన్న పాత్ర పెట్టి నునే పోసి బాగా కాగాక కలిపి ఉంచుకున్న మిశ్రమంతో వడలుగా చేసుకుని నూనెలో రెండువైపుల వేగేలా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి...