Read more!

Banana Dry fruit Burfi

 

 

 

బనానా డ్రైఫ్రూట్ బర్ఫి

 

 

 

కావలసినవి:
బాదం పప్పు - అరకప్పు
బనానా - రెండు
మైదాపిండి - కప్పు
కిస్‌మిస్‌లు - అరకప్పు
యాలకులు - 5
నెయ్యి - ఒకటిన్నర కప్పు
వెన్న - రెండు స్పూన్లు
పంచదార - పావు కిలో
జీడిపప్పు - అరకప్పు

 

తయారీ :

ముందుగా అరటిపండును తొక్కతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ పాత్రలో మైదా, అరటిపండు గుజ్జు వేసి అందులో వెన్న వేసి ముద్దలా కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి  బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పును వేయించి తీసేయాలి. ముద్దగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని అందులో వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడీ ముద్దలో కిస్‌మిస్, జీడిపప్పు, యాలకులు పొడి వేసి మెత్తగా పూరీల పిండిలా కలుపుకుని చిన్న చిన్న తీసుకుని మీకు నచ్చిన  ఆకారంలో  కొంచం మందంగా చేసుకుని బాణలిలో నెయ్యి వేసి కరిగిన తరువాత వీటిని వేసి  వేయించి  సర్వింగ్ ప్లేటులోకి తీసి పెట్టుకుని పైన పంచదార వేసుకుని సర్వ్ చేసుకోవాలి...