Baby Corn Manchurian & Apple Crunch Pudding

 

 

 

 బేబీ కార్న్ మంచూరియన్

 

 

 

తయారు చేసే విధానం :

ఒక కప్పు కార్న్ ఫ్లోర్ లో 2 స్పూన్స్ మైదా, కారం , ఉప్పు , మిరియాల పౌడర్, నీరు వేసి దోస పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి . ఆ తరవాత బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. కాగిన తరవాత బేబీ కార్న్ ని కార్న్ ఫ్లోర్ లో ముంచి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని నూనె పోసి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు , పచ్చిమిర్చి తరుగు, ఉల్లి కాడలు , 2 స్పూన్స్ సోయా సాస్, రెడ్ చిల్లి సాస్, టమాట సాస్, కొద్దిగా నీరు , ఉప్పు కలిపి ఫ్రై చేసుకుని, అంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కాన్, ఉల్లిపాయ తరుగును వేసి కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత దించేసి, క్యారట్, ఉల్లి తరుగు , ఉల్లికాడలు తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. 

 

ఆపిల్ పుడ్డింగ్

 

 

తయారు చేసే విధానం : 

ఆపిల్ పుడ్డింగ్ తయారుచేయడానికి ముందుగా జెల్లీని తయారు చేసుకోవాలి.

జెల్లీ తయారుచేసునే విధానం : ఒక గిన్నెలో జెల్లీ పౌడర్ తీసుకుని వేడి నీళ్ళు కలిపి 45 ఇమిశాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చల్లారిన జెల్లీ నీటిని ఫ్రిజ్ లో ఉంచితే జెల్లీ తయారవుతుంది.
యాపిల్ పుడ్డింగ్ తయారు చేసే విధానం : ముందుగా జీడిపప్పు, పిస్తాను నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత వెనీలా ఐస్ క్రీం తీసుకుని అందులో చిన్నగా తరిగిన యాపిల్ ముక్కలు, గ్రీన్ యాపిల్ ముక్కలు, పైనాపిల్, గ్రేప్స్, కార్న్ ఫ్లేక్స్, కాజు, పిస్తా, జెల్లీ, ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ వేసుకుని చివరిగా కివీ ఫ్రూట్, చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే సరి . యాపిల్ పుడ్డింగ్ రెడీ.