Apple Lassi Recipe
యాపిల్ లస్సి
కావలసినవి:
యాపిల్స్ - 2
పెరుగు -2
నిమ్మరసం -అర టీస్పూన్
పంచదార - 3
తయారీ:
ముందుగా యాపిల్స్ ను కడిగి పొట్టు తీసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పెరుగు, పంచదార, కూలింగ్ వాటర్ అన్ని కలిపి జ్యూసర్ జార్ లోకి తీసుకుని బ్లెండ్ చెయ్యాలి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న మిశ్రమంలో నిమ్మరసం, యాపిల్ తురుము కలిపి మళ్లీ బ్లెండ్ చెయాలి. తరువాత సర్వింగ్ గ్లాసుల్లో యాపిల్ లస్సిని తీసుకుని క్రషింగ్ ఐస్ వేసి సర్వ్ చేసుకోవాలి...