Milk Fruit Salad
మిల్క్ ఫ్రూట్స్ సలాడ్
కావలసినవి:
పైనాపిల్ ముక్కలు - పది
పాలు - ఒక కప్పు
తేనె - పావ్ కప్పు
నల్ల ద్రాక్ష పండ్లు - కొన్ని
అరటిపండ్ల ముక్కలు - అర కప్పు
గ్రీన్ యాపిల్ ముక్కలు -పది
యాపిల్ ముక్కలు - పది
పంచదార - అర కప్పు
ఐస్ క్రీము - అర కప్పు.
తయారీ:
ముందుగా స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న గిన్నె లో పాలను పోసి చిక్కగా అయ్యేంత వరకు మరిగించి తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లారిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. తర్వాత పండ్ల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. దీనిలో ఐస్‌క్రీము వేసి కలిపి ఫ్రిజ్‌లో ఒక గంటసేపు పెట్టుకోవాలి. గంట తర్వాత ఫ్రిజ్ లోనుంచి ముక్కలు తీసి తేనే వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి....