Aloo Paratha
ఆలూ పరోటా
కావలసిన పదార్థాలు :
ఆలు (బంగాళాదుంపలు) : 3
ఉల్లిపాయి ముక్కలు : 1/4 కప్పు
పచ్చిమిర్చి : 1
వాము : 10 గింజలు
ఉప్పు : 1/2 చెంచా
కొత్తిమీర సన్నగా తరిగినది : కొద్దిగా
నూనె లేక బటర్ : 1/4 కప్పు
చపాతి పిండి : 1 కప్పు
తయారుచేసే విధానము:
* ముందుగా కుక్కర్‌లో సగానికి కోసిన ఆలుగడ్డలు ఉడికించి పొట్టుతీసి ప్రక్కనపెట్టుకోవాలి.
* చపాతీ పిండిలో చిటికెడు ఉప్పు, చెంచా నూనె వేసి పరోటాల కొరకు మెత్తగా పిండి కలుపుకోవాలి.
* ఉల్లిముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వాము, ఉప్పు, కారం కొత్తిమీరతరుగు అన్నీ కలుపుకుని బాగా అదిమిన ఆలుగడ్డల ముద్దలో కలుపుకోవాలి... ఆలుగడ్డలు మరీ మెత్తగా కాకుండా ఉడికించుకున్నట్లైతే చేతితో లేక గ్రీటర్‌తో మెత్తగా అదమవచ్చును.
* ఈ ముద్దని చిన్న పూరీ సైజులో ఒత్తుకున్న పరోటా మధ్యలో పెట్టి ముట్టు మూసివేసి ఆ ముద్దను చేతితో బిళ్ళలా అదిమి అప్పడాల కర్రతో మెల్ల మెల్లగా బత్తుకుని పెనంపై చిన్నమంటతో దోరగా కాలేలా నూనె (లేక) బటర్ రాస్తూ కాల్చుకోవాలి.
* ఈ ఆలూ పరోటాలు వేడిగా తింటే రుచిగా ఉంటాయి. వీటికి కూర అవసరంలేదు. కమ్మని పెరుగు కొద్ది పచ్చడి (లేక) సాస్‌తో తింటే ఎంతో బావుంటాయి.
- భారతి