Aloo menthi curry

 

 

 

ఆలూ మెంతి కర్రీ

 

 

 

కావలసినవి :
ఆలూ -  రెండు
నిమ్మ రసం - 2 స్పూన్
ఆయిల్ - సరిపడా
కారం - 1/2 స్పూన్
పసుపు - అర స్పూన్
మెంతి  కూర  1 కట్ట
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - తగినంత
గరం మసాలా - ఒకటిన్నర స్పూన్
జీలకర్ర - 1 స్పూన్

 

తయారీ :
ముందుగా అలూను ఉడికించి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మెంతి కూర ను కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి  పాన్ పెట్టి అందులో నూనె వేసి  జీలకర్ర  వేసి వేగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు  వేసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించాలి. ఇప్పుడు మెంతి ఆకులు వేసి మగ్గిన తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి ఐదు నిముషాలు మగ్గనిచ్చి ఉడికించిన ఆలూ ముక్కలు వేసి మూత పెట్టి మరో ఐదు నిముషాలు తక్కువ ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి గరం మసాల, వేసి కలిపి నిమ్మరసం  వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి....