Aloo masala Recipe
ఆలూ మసాలా రెసిపి
కావలసినవి:
బంగాళా దుంపలు - అర కేజీ
ఉల్లిపాయలు - పావ్ కేజీ
ఉప్పు -సరిపడ
ఫుడ్ కలర్ - చిటికెడు
నూనె - తగినంత
కారం - 1 స్పూన్
పెరుగు - అర కప్పు
పచ్చిమిర్చి -5
అజీనామోటో - కొద్దిగా
బేకింగ్ పౌడర్ - 1 స్పూన్
చాట్ మసాల - ఒక స్పూన్
శెనగపిండి - 4 స్పూన్స్
తయారు చేసే విధానం:
ముందుగా బంగాళా దుంపలను ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత వాటిలో శెనగపిండి,బేకింగ్ పౌడర్, ఫుడ్ కలర్ వేసి ముక్కలు కలుపుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి ఆయిల్ వేసి కాగాకకలిపి పెట్టుకున్న ముక్కలు వేసి ఎర్రగా వేగాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లను పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి ,పెరుగును తీసుకోని బాగా బ్లెండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలుఆయిల్ లో వేసి బాగా ఎర్రగా వేగాక, అందులో పెరుగు, అజీనామోటో కూడా వేసి బాగా కలుపుకుని అందులో చాట్ మసాల, ఉప్పు, కారం వేసి నూనె పైకి వచ్చే వరకు వుంచి ఆలూ కూడా వేసి ఒక ఐదు నిముషాలు వేయించుకోవాలి.