Aloo Kurma Recipe

 

 

 

ఆలూ కుర్మా రెసిపి

 

 

 

 

కావలసిన వస్తువులు :

బంగాళాదుంప - పావు కేజీ

క్యారెట్ - 100 గ్రాములు

ఉల్లిపాయ - ఒకటి పెద్దది.

టమోటా - 1.

పెరుగు - 1 కప్పు.

నూనె - 200 గ్రాములు

ధనియాలు - 4 టీ స్పూనులు.

గసగసాలు - 1 టీస్పూను.

పచ్చికొబ్బరి - అర కప్పు

లవంగాలు - 8

అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూనులు

 

తయారు చేసే విధానం:

ముందుగా మసాల దినుసులన్నీ గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. బంగాళాదుంప, క్యారెట్ విడిగా ఉడకబెట్టాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి టమాటా ,ఉల్లిపాయలు వేయించాలి.

ఇవి వేగాక మసాల, ఉప్పు, కారం, పసుపు, కొంచెం నీళ్ళు పోసి 15 నిముషాలు ఉడికించాలి.

తర్వాత ఉడుకుతున్న మిశ్రమంలో బంగాళదుంప, క్యారెట్ వేసి గ్రేవిలో కలిసేవరకు వుంచి చివరిలో పెరుగు కలపుకోవాలి.