Kobbari Bobattlu
కొబ్బరి బొబ్బట్లు
కావలసినవి :
కొబ్బరికాయ : ఒకటి
మైదా: అరకేజీ
పంచదార: అరకేజీ
ఇలాచి : స్పూన్
నెయ్యి: ఒక కప్పు
గసగసాలు: కప్పు
తయారీ :
ముందుగా కొబ్బరిని తురుముకోవాలి తరువాత ఒక గిన్నెలో పంచదార, కొబ్బరి వేసి ఉడికించాలి.
పాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా కలిపి ఇలాచి పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. ఇప్పుడు ఉడికించుకున్న కొబ్బరి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.తరువాత మైదా పిండిలో నీళ్లు పోసి చపాతీ పిండి మాదిరిగా కలిపి 2 గంటలపాటు నాననివ్వాలి. మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో దాన్నీ చిన్న పూరీలా ఒత్తి అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో వత్తాలి. వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి.