Aloo Gobi Fry Recipe
ఆలూ గోబీ ఫ్రై రెసిపి
కావలసిన పదార్ధాలు:
కాలీఫ్లవర్ 1
ఆలూ 2
అల్లం చిన్న ముక్క
వెల్లుల్లి 5 రెబ్బలు
కొత్తిమీర ఒక కట్ట
గరంమసాలా పొడి అర టీస్పూన్
ఉప్ప తగినంత
కారం సరిపడా
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
కరివేపాకు సరిపడా
పసుపు - అర స్పూన్
నూనె - మూడు స్పూన్లు
ఆవాలు,జీలకర్ర,ఎండుమిరపకాయలు,
శనగపప్పు,మినపప్పు - అన్ని ఒకొక స్పూన్
తయారు చేసేవిధానం:
కాలీఫ్లవర్ ఇంకా బంగాళా దుంపలను కట్ చేసి కొంచం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అల్లం,మిర్చి,వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ వేసి వేయించాలి.
తరువాత స్టవ్ వెలిగించుకుని నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేసుకుని వేసి వేగాకా కరివేపాకు,కట్ చేసిన ఉల్లిముక్కలు వేసి వాయించాలి.
ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేగుతున్న ఉల్లిపాయముక్కలో వేసి వేయించుకోవాలి. తరువాత ఉడికించిన ఆలూ,గోబీ వేసి వేయించాలి.
తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాక వేయించి గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.