ఒకే సందర్భం.. పలు పేర్లు.. ఇంతకీ సెప్టెంబర్ 17న ఏంజరిగింది?

భార‌త్ లో ఒక స్వాతంత్ర దినం, మ‌రో రిప‌బ్లిక్ దినోత్స‌వం.. ఇలాంటి జాతీయ‌ పండ‌గ‌ల‌ను భారత జాతి మొత్తం ఒకే దృక్ప‌థంలో, ఒకే కోణంలో జ‌రుపుకుంటూ రావ‌డం ఆన‌వాయితీ. అయితే..  తెలంగాణ‌లో మాత్రం ఒక దినోత్సవాన్ని  మూడు పార్టీలు మూడు ర‌కాలుగా జ‌రుపుకుంటారు. అదే తెలంగాణ విమోచ‌న దినం. దీనిని బీజేపీ హైద‌రాబాద్ విమోచ‌న దినోత్స‌వంగా, కాంగ్రెస్ తెలంగాణ ప్ర‌జా పాల‌నా దినోత్స‌వంగా, బీఆర్ఎస్ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంగా పిలుస్తూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. చ‌రిత్ర‌లో ఒక ముఖ్య ఘట్టం జ‌రిగిన రోజుకు.. భిన్న పార్శ్వాలు క‌లిగి ఉండే సందర్భం  బ‌హుశా ఇదేనేమో.  అంత‌గా ఈ దినోత్స‌వం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంత‌కీ    సెప్టెంబర్ 17కి ఉన్న చారిత్ర‌క దినం ప్రాముఖ్య‌త ఏంటంటే.. 1948 సెప్టెంబర్ 17న  నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో విలీనమైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏడా సెప్టెంబర్ 17ను  ప్రతి పార్టీ తమ సొంత దృక్పథంతో  ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి.   తెలంగాణ అంటేనే ఉద్య‌మాల ఖిల్లా. భార‌త్ మొత్తం స్వాతంత్ర పోరాటం చేస్తే ఇక్క‌డ మాత్రం నిజాం పాల‌కుల‌తో స‌మాంత‌రంగా సాయుధ పోరాటం చేయాల్సి వ‌చ్చింది. అందుకే భార‌త్ మొత్తం 1947 ఆగ‌స్ట్ 15న స్వాతంత్రం పొందినా.. హైద‌రాబాద్ సంస్థానం మాత్రం నిజామ్ ఉస్మాన్ అలీ ఖాన్ పాల‌న‌లో మ‌రో 13 నెల‌ల పాటు బానిస‌త్వంలో మ‌గ్గింది.  దీనంత‌టికీ కార‌ణం ర‌జాకార్లు.. అంటే మిల‌ట‌రీ వింగ్ ఆఫ్ మ‌జ్లిస్- ఏ- ఇత్తిహాద్ అనే పేరిట వీరు ఆనాడు హైద‌రాబాద్ రాష్ట్ర ప్ర‌జ‌లపై అనేక అత్యాచారాలు, హింస వంటి దారుణ‌మైన ప‌ద్ధ‌తుల్లో పాలిస్తూ.. స్వ‌తంత్ర రాజ్యం కోసం పోరాడారు. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ నాయ‌క‌త్వంలోని భార‌త ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ పోలో పేరిట పోలీస్ యాక్ష‌న్ ప్ర‌క‌టించింది.  1948 సెప్టెంబర్ 13న, భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నాలుగు రోజుల్లోనే నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న, అధికారికంగా లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది. ఈ పోరాటంలో వేల మంది తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగం చేశారు. రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, చండ్రరాజేశ్వరరావు, షోయాబుల్లా ఖాన్ వంటి నాయకులు ఈ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి ఈ చారిత్ర‌క రోజును ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల్లో ర‌క‌రకాలుగా జ‌రుపుకోవ‌డం మొద‌లైంది. అయితే జనానికి మాత్రం ఇది రెండో స్వాతంత్ర పోరాట విజ‌యం. ర‌జాకార్ల పై సాధించిన ఘ‌న విజ‌యం. బ్రిటిష‌ర్లతో ఎలాంటి పోరాటం చేశారో తెలీదు కానీ.. ఆనాటి ర‌జాకార్ల దాష్టీకాల‌కు హింసాకాండ‌కు బ‌లైన అమ‌రుల‌ను త‌లుచుకుంటూ నివాళి అర్పించే సంద‌ర్భం.

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ వేడి... పార్టీల ఫోకస్

  రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేడి మొదలైంది. జూబ్లీ బైపోల్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు. బీసీ నినాదానంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.   నియోజకవర్గంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పోస్టర్లు వెలిశాయి. ‘కావాలి అంజన్న.. రావాలి అంజన్న.. ఇది నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష’ అంటూ జూబ్లీహిల్స్‌లో అంజన్‌కుమార్ బ్యానర్లు అంచించారు. మరోవైపు.. తాను టికెట్ ఆశిస్తున్నట్టు ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అలాగే మినిస్టర్ పదవి కూడా కావాలని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌  మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె కుటుంబంతో సహా ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.   జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కమలం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. ఈ సీటునూ సొంతం చేసుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నా.. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో  అధిష్ఠానం నిమగ్నమైనట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ స్థానం ఉంది. దీంతో తమకే గెలిచే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది

ఏపీ మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు అక్షింతలు!?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో పదే పదే వాయిదాలు కోరుతున్న మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలంటే ఖర్చుల కింద పదివేల రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది.  ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణ  మండలి చైర్మన్ మెషేన్ రాజు న్యాయవాది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విషయమేంటంటే.. జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదనే కారణంతో 2024 నవంబర్‌లో ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కె. మోషేన్ రాజుకు స్వయంగా అందజేశారు. నెలలు గడుస్తున్నా, తన రాజీనామాను చైర్మన్ ఆమోదించకపోవడంతో  జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామా ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఇప్పటికే చైర్మన్ న్యాయవాది కోరిక మేరకు పలుమార్లు వాయిదా వేసినా  కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  బుధవారం సాయంత్రం 5 గంటలలోపు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.10 వేలు చెల్లించాలని ఛైర్మన్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. 

ప్రభుత్వ శాఖల సేవలకు రేటింగ్స్.. ఏపీ సీఎం నారా చంద్రబాబు

ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు మంగళవారం (సెప్టెంబర్ 16) క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 తదితర అంశాలపై సమీక్షించిన చంద్రబాబు.. పాలనలో టెక్నాలజీ వినియోగంపై   దిశానిర్దేశం చేశారు.  కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సి అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగు పడినప్పటికీ,  రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత మెరుగుపడాలన్నారు.   రెవెన్యూ శాఖ   సంతృప్తికర స్థాయిలో  సేవలు అందించడం లేదని చంద్రబాబు అన్నారు. అందుకే ప్రభుత్వ సేవలకూ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై తమ తమ శాఖలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సమాచారం కోసం పదే పదే కలెక్టర్లను నివేదికలు అడిగే పరిస్థితి రాకూదని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అవసరమైన మేరకు నివేదికలు తీసుకుని అందుకు అనుగుణంగా  పని చేయించాలన్నారు.  అన్ని ఫైళ్లూ వంద శాతం ఆన్ లైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం రెండు నెలలు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ వ్యవస్థను ఏర్పాటు చేశామనీ,  దీని ద్వారా 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందుతోంది.  వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఏయే జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైమ్ లో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.  కలెక్టర్ల కాన్ఫరెన్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు. ఆ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు. భవిష్యత్తులో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 80 వేలమంది పని చేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

పేర్నినానిపై మరో కేసు?.. ముందస్తు బెయిలొచ్చే వరకూ అజ్ణాతమేనా బాసూ!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తాజాగా మరో భూ కబ్జా ఆరోపణ బలంగా వినిపిస్తోంది. బందరులోని రంగనాయకులు ఆలయ భూమికి సంబంధించి పేర్ని నానిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  బైపాస్ రోడ్డు సమీపంలోని దేవుని చెరువు వద్ద భూమికి ఎండోమెంట్ అధికారులు గతంలో నిర్వహించిన వేలం ద్వారా చాలా చాలా తక్కువ ధరకు భూములు అమ్ముడుపోయాయి. ఇందుకు పేర్ని నాని చేసిన ప్రచారమే కారణమని అంటున్నారు. అప్పట్లో అంటే వేలం సమయంలో పేర్ని నాని ఆ భూములు తిరిగి విక్రయించడానికి పనికిరావని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ భూముల గుండా హైనెన్షన్ వైరు వెడుతుండటమే ఇందుకు కారణమని నాని అప్పట్లో చేసిన ప్రచారం కారణంగా ఎవరూ కొనుగోలుకు ముందుకు రాలేదు. ఈ భూమిని పేర్ని నాని అప్పట్లో గజం 12వందల నుంచి 13 వందల రూపాయలకు అతి చౌకగా సొంతం చేసుకున్నారు.  ఈ రకంగా పేర్నినాని, అతడి అనుచరులు దాదాపు 5.33 ఎకరాల భూమిని వేలం ద్వారా కారు చౌకగా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే భూమిని చదరపు గజం 40 నుంచి 50 వేల రూపాయల వరకూ విక్రయించాలని చూస్తున్నారు.   అతి చౌకగా అనుచరుల పేరు మీద కొనుగోలు చేసిన భూమి చాలా భాగాన్ని పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉండగానే అంటే.. 2022 మరియు 2023 మధ్య తన, తన కుటుంబ సభ్యుల పేర్ల మీద బదలాయించేకుకున్నారు. మిగిలిన భూమిని కూడా తన కుటుంబ సభ్యుల పేర బదలాయించు కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆ భూముల గుండా వెడుతున్న హైటెన్షన్ వైర్ ను కూడా తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూముల వ్యవహారంలో పేర్ని నానిపై కేసు నమోదయ్యేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. కేసు నమోదైతే.. ఈ కేసులో కూడా ముందస్తు బెయిలు వచ్చే వరకూ పేర్ని నాని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతారా? చూడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. గతంలో తనపై కేసు నమోదైన ప్రతి సారీ పేర్ని నాని కోర్టు బెయిలు మంజూరు చేసే వరకూ అజ్ణాతంలో గడిపిన సంగతిని ఈ సందంర్భంగా గుర్తు చేస్తున్నారు.  

అప్పుడు చెప్పాం.. ఇప్పుడు చేసి చూపించాం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 15 నెలలు అయ్యింది. గతంలో మూడు సార్లు సీఎంగా ఉన్న సమ యంలో ఎన్నడూ ఎదుర్కోని క్లిష్టపరిస్థితులు ఈ సారి ఆయనకు స్వాగతం పలికాయి. జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, విధ్వంస పాలన కారణంగా గత ఏడాది చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటమే కాకుండా పది లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తిన పడింది.   ఇదే విషయాన్ని చంద్రబాబు సోమవారం (సెప్టెంబర్ 15) కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ చెప్పారు.  అటువంటి పరిస్థితుల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచీ రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు తాను చేపట్టిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ సదస్సులో వివరించారు. అదే సమయంలో నగదు బదలీ పథకాలు అంటే సంక్షేమ పథకాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రాకుండా ముందుకు సాగుతున్నానని చెప్పారు.   దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నాన్నా. అదే పెన్షన్ల పథకం అని చెప్పిన ఆయన ఈ పథకం ద్వారా 64 లక్షల మందికి ప్రతి నెలా మొదటి తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికీ ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు.  మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, దీపం 2 పథకాల గురించి వివరించారు. అన్నదాతా సుఖీభవ, ఆటో డ్రైవర్లకు రూ.15వేలు పథకాల గురించి కూడా చెప్పారు. గత ఏడాది ఎన్నికలకు ముందు చెప్పాము.. ఇప్పుడు చేసి చూపిస్తున్నాము అన్న చంద్రబాబు.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలని, అందులో కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.  

పీకే.. బీహార్ లో కింగ్ మేకరేనా?

ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారునుకోండి అది వేరే సంగతి.  అయితే ఆయన ఇప్పుడు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన సొంత పార్టీ జనసురాజ్ కు తాను తన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల చివరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.  అక్కడ పోరు హోరా హోరీ అన్న అంచనాలు ఉన్నాయి. ఎంత హోరాహోరీగా ఉన్నా ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కు ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి.  ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఆర్డేజీ, ఎల్జీపీ, ఆప్ స‌హా వామ‌ప‌క్షాలు, బీజేపీ నేతృ త్వంలోని ఎన్డీయే కూటమి   తలపడుతున్నాయి. కానీ ఎన్నికల వ్యూహకర్త, జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మాత్రం తాను ఎవరి పక్షమూ కాదని చెబుతున్నారు. తాను ప్రజాపక్షమనీ, ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతున్నాననీ చెబుతున్నారు.  అదే ఇప్పుడు ఈ ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మహాఘట్ బంధన్, ఎన్డీయే శిబిరాల్లో ఆందోళనకు కారణమౌతోంది. పీకేకి, ఆయన పార్టీకి యువత, విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆయన ఒంటరిగా బరిలోకి దిగితే విజయం మాట ఎలా ఉన్నా.. మహాఘట్ బంధన్, ఎన్డీయేల ఓట్లను భారీగా చీల్చే అవకాశాలున్నాయని తాజాగా ఓ సర్వే పేర్కొంది. బీహార్ ఎన్నికలలో పీకే నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ తక్కువలో తక్కువ 8.3 శాతం ఓట్లు సాధిస్తుందన్నది ఆ సర్వే సారాంశం. అంటే బీహార్ లో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా పీకే ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. సపోజ్ ఫర్ సపోజ్ బీహార్ ఎన్నికలలో ఏ పార్టీ అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే.. పీకే  కింగ్ మేకర్ అవుతారన్న మాట. కొంచం ఇంచుమించుగా తాజా సర్వే ఆ విషయాన్నే చెప్పింది.  ఇక సర్వేను పక్కన పెట్టి బీహార్ ఎన్నికల విషయానికి వస్తే.. ఈ సారి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా చాలా గట్టిగా పని చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా ఆ ప్రజా వ్యతిరేకతపైనే గంపెడాశలు పెట్టుకుంది. అయితే పీకే ఒంటరి పోరు పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశలు మెండుగా ఉన్నాయంటున్నారు.  చూడాలి మరి పీకే ఒంటరి పోరు ఏ కూటమి కొంప ముంచుతుందో? 

బండి సంజయ్‌పై కేటీఆర్‌ రూ.10 కోట్ల పరువు నష్టం కేసు

  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బండి సంజయ్ ఎటువంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారని, దీనివల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.  తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ కేటీఆర్ తరఫు న్యాయవాదులు ఆగస్టు 11న బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపారు. అయితే, ఆ నోటీసులకు బండి సంజయ్ స్పందించకపోవడంతో పాటు, క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే ఆయన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దావాలో కేటీఆర్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలకు గాను బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తన పరువుకు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు, ప్రచురణలు చేయకుండా బండి సంజయ్‌ను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, ఇప్పటికే ఆన్‌లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర వార్తా మాధ్యమాలలో ఉన్న పరువు నష్టపరిచే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు  

వక్ఫ్ పై సుప్రీం తీర్పు హర్షణీయం : సీపీఐ నారాయణ

  వక్ఫ్​ సవరణచట్టంలోని అనేక కీలక నిబంధనలను నిలిపివేస్తూ  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్వాగతించారు. న్యూఢిల్లీలోని ఎ. పి భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంఖ్య బలంతో చేసిన చట్టంపై సుప్రీం కోర్టు స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. సిపిఐ ముందు నుంచి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరినీ ఖండిస్తూనే ఉందని గుర్తు చేశారు. బిల్లు చట్ట రూపం పొందక మునుపే జాయిన్ట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరినట్టు గుర్తు చేశారు.అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రకారం ఒక శాతం ఉన్న ప్రజలకు కూడా మతపరమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కేంద్రం ప్రభుత్వ ఏక పక్ష వైఖరికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఇక మోదీ చేపట్టిన అస్సాం, మణిపూర్ పర్యటనలో నిజాయతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ మూడేళ్లుగా మండుతున్నా పట్టించుకోని ప్రధాని అటువైపు చూడలేదని పేర్కొన్నారు. అక్కడి సమాజం రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రమైన ఘర్షనలు జరిగినా పట్టించుకొని మోదీ ఇప్పుడు అక్కడకి వెళ్లి ఏమి సాధించలేదని పేర్కొన్నారు. అయన పర్యటన పుంగనూరు జవాను పోయాడు వచ్చాడు అనే సామెత తరహాలో ఉందని ఎద్దేవా చేసారు. అప్పటికే నిర్మాణమై, ఉపయోగంలో ఉన్న పాత భవనాలను మళ్ళీ ప్రారంభించిన రావడం పై మండిపడ్డారు. మొత్తం మోదీ మణిపూర్ పర్యటన మోస పూర్తితంగా ఉందని ఆరొపించారు. తెలంగాణ సాయుద పోరాటం వారోత్సవాల నేపథ్యంలో  తెలంగాణ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ను విముక్తి చేసిన ఉద్యమంపై గవర్నర్ అలా మాట్లాడడం ఆర్ ఎస్ ఎస్ అజండాను మోయడమే అవుతుందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన  పటేల్ పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు. నిజాంకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. 4 వేల మంది కమ్యూనిస్టుల త్యాగాలు, పది లక్షల ఎకరాల భూమి పంపకం తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవన్నీ మరచి గవర్నర్ ఆర్ఎస్ఎస్ సంస్థకు చెప్రాశిలాగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ కేరళ, తమిళనాడు సహా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల గవర్నర్ లందరూ ఆర్ఎస్ఎస్ మూలాలకు చెందిన వారిని పేర్కొన్నారు. వారంతా కేంద్రానికి తోత్తులుగా మారి రాష్ట్రాల్లో సమాంతర పాలన చేస్తూన్నారని పేర్కొన్నారు. బీజేపీ ఆర్ ఎస్ ఎస్ నేతలకు తెలంగాణ సాయుధ పోరాటం పై మాట్లాడే అర్హత లేదని వ్యాఖనించారు. ఇటు స్వాతంత్ర పోరాటంలోనూ వారికి ఇసుమంత పాత్ర లేదని గుర్తు చేశారు. బిజెపిల నుండి ఒక్కరైనా జైలుకు వెళ్లారా ఒక లాటి దెబ్బ తిన్నారా ఒక తూటాని ఎదుర్కొన్నారు అంటూ ఘాటుగా ప్రశ్నించారు.దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో తమవారు లేకపోవడం తో తమకు సంబంధం లేని వారి త్యాగాలను వాడుకుంటున్నరని, శవాలను కూడా అద్దెకు తీసుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని నారాయణ  చురకలు అంటించారు.

రాజకీయాల్లో మహిళలకు ఎన్టీఆర్ ప్రోత్సాహం : అయ్యన్న పాత్రుడు

  మహిళలు లేకుండా వికసిత్‌ భారత్‌ సాధించలేమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. చాల చోట్ల మహిళలు స్కూళ్లకు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో రెండో రోజు ఆయన మాట్లాడారు. ప్రతి స్త్రీకి భద్రత, ఆత్మ నిర్భరత అందించాలి. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఎకనామిక్‌ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు.  మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తే.. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి, ఆర్థికంగా స్వతంత్రులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కమిటీలు ప్రణాళికలు రూపొందించాలి. దేశంలోని ఆఖరి మహిళకు కూడా ఫలితాలు అందేలా ప్రణాళికలు ఉండాలి. పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి లోక్ సభ వరకు ప్రతి ఒక్కరూ మహిళల వృద్ధి కోసం కృషి చేయాలని సభాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసన కమిటీల మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు  రావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యా రంగంలోను, సమాజ సేవలోను భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేసిన  పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కమిటీల సభ్యులకు నమస్కారాలు తెలిపారు. రెండు రోజులపాటు విన్న ప్రసంగాలు, జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని, ఈ మంచి చర్చలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని  అయ్యన్న పాత్రుడు  పేర్కొన్నారు. నందమూరి తారకరామారావు  అప్పట్లోనే మహిళలకు పెద్దపీట వేశారని, పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని  స్పీకర్  గుర్తుచేశారు.  రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 1983లో తాను తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు లేరని, మహిళా పంచాయతీ అధ్యక్షులు లేరని అయ్యన్న పాత్రుడు  పేర్కొన్నారు. కానీ నందమూరి తారకరామారావు  స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, అదే విధంగా అన్ని రాష్ట్రాల్లోను జరగాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 22 మంది మహిళా శాసనసభ్యులు ఉన్నారని, శాసన మండలిలో కూడా మహిళా సభ్యులు ఉన్నారని  అయ్యన్న  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, లోక్‌సభ స్పీకర్  ఓం బిర్లా  రాజ్యసభ ఉప సభాపతి  హరివంశ్, ఏపీ ఉప సభాపతి  రఘురామ కృష్ణమరాజు పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి దేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీల అధ్యక్షులు, సభ్యులు,పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : జగదీశ్ రెడ్డి

  బీఆర్‌ఎస్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి  విజ్ఞప్తి చేసినట్లు సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి  జగదీశ్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆధారాలు సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో జగదీష్‌రెడ్డి, వివేక్‌ గౌడ్‌, చింతా ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి  అసెంబ్లీ మీడియా  పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.  బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ నాయకులతో ప్రచారాల్లో ఎందుకు తిరుగుతున్నారు, వాళ్లతో దిగిన ఫోటోలను పోస్టర్లుగా ఎందుకు వేసుకుంటున్నారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హస్తం పార్టీ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉంటే కేసీఆర్‌తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుండగా, ఆ  ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు.  తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు.   

జూబ్లీ హిల్స్ బరిలో తెలంగాణ జాగృతి అభ్యర్థి?

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనడానికి రెడీ అయిపోరాయా? ఇప్పటి వరకూ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైన కల్వకుంట్ల కవిత.. ఇక నేరుగా కదన రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. త్వరలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని రంగంలోని దించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ఈ విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ విషయంలో ఆమె కీలక నేతలతో చర్చించారని అంటున్నారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సోమవారం (సెప్టెంబర్ 15) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ జాగృతి తరఫున కల్వకుంట్ల కవిత విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా రంగంలోకి దింపనున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి.  కవితతో భేటీ తరువాత విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తెలంగాణ జాగృతి అధినేత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు చెప్పారు. ఈ భేటీలో తాను కవితను పెద్దమ్మ గుడిలో దసరా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించినట్లుచెప్పారు. తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరగ లేదని పేర్కొన్నారు.  ఇలా ఉండగా త్వరలో జరగనున్న బతుకమ్మ పండుగ సందర్భంగా కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత తెలంగాణ జాగృతిలో అంతర్గత విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఆర్ఎస్ కు గట్టి ఝలక్ ఇవ్వాలన్నపట్టుదలతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.  

వైసీపీలో సజ్జల సినిమా అయిపోయినట్లేనా?

సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాయిస్ సజ్జల రామకృష్షారెడ్డే. వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల డిఫాక్టో సీఎంగా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా పేరు గడించారు. ఏ శాఖకు సంబంధించైనా సరే ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, కనీస సమాచారం కూడా లేకుండా సజ్జల నిర్ణయాలు తీసుకునే వారు. మీడియా సమావేశాలు నిర్వహించే వారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంత కాలం సజ్జల మౌనం వహించినా.. ఆ తరువాత షరా మామూలే. జగన్ కుడి భుజంగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. పార్టీలో జగన్ తరువాత స్థానం సజ్జలదే అని పార్టీ శ్రేణులు కూడా చెబుతాయి. అయితే తాజాగా జగన్ దగ్గర సజ్జల సీన్ అయిపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఇంత హఠాత్తుగా సజ్జలకు అంతటి మర్యాద? ఎందుకయ్యా అంటే.. పార్టీ వర్గాలు చెబుతున్నదానిని పట్టి.. ఇటీవల అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జమన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అంటున్నారు పరిశీలకులు, ఐను ఇటీవల జస్జల చేసిన ప్రకటన,వ్యాఖ్యలు వైసీపీకి తీరని డ్యామేజీ చేశాయని అంటున్నారు.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే..మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా  ఇక మూడు రాజధానుల మాటే ఎత్తదు? అమరావతే రాజధాని, విశాఖ కానే కాదు. జగన్ తాడేపల్లిలోనే ఉంటారు. గుంటూరు, విజయవాడల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి అభివృద్ధి చేస్తారు. అని ఆయన మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు.  జగన్ అమరావతి రాజధానిక సానుకూలంగా ఉన్నారనీ, విశాఖ ఊసే ఎత్తరు అని చెప్పడం ద్వారా జగన్ హయాంలో మూడు రాజధానుల విధానం తప్పు అని ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి ప్రణాళికా, వ్యూహం లేకుండా కేవలం చంద్రబాబుపై కక్షతోనే ఇప్పుడు జగన్ అమరావతికి జై కొడుతున్నారన్న ప్రచారం ప్రజలలో బలంగా వెళ్లిపోయింది. అంతే కాకుండా అధికారంలో ఉన్నంత కాలం మూడు రాజధానులంటూ జగన్ కాలక్షేపం చేయడం కక్ష సాధింపుతోనే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోపం కాదని సజ్జల తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీంతో జగన్ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది.  ఈ కారణంగానే జగన్ సజ్జలను పూర్తిగా పక్కన పెట్టేశారని అంటున్నారు. అంతే కాదు సొంత మీడియాలో కానీ, పార్టీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా సజ్జల పేరు, ఫొటో కనిపించడానికి వీల్లేదన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్ల చెబుతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా జగన సొంత మీడియాతో పాటు సామాజిక మాధ్యమంలో కూడా సజ్జల నిపించడం లేదు. వినిపించడం లేదు.  

కమలం గూటికి పోతుల సునీత

మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కమలం గూటికి చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  దాదాపు ఏడాది కిందట ఆమె వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో పోతుల సునీత తెలుగుదేశంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జనసేన గూటికైనా చేరుదామని ప్రయత్నించారు. అయితే ఆ పార్టీ కూడా ఆమెకు తలుపులు మూసేసింది. దీంతో గత ఏడాది కాలంలో పోతులసునీత ఏ పార్టీలోనూ లేరు.  వాస్తవానికి పోతుల సునీత తన రాజకీయ ప్రస్తానాన్ని తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభించారు. 2017లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడమే కాకుండా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలయ్యాయి.  ఆ తరువాత ఆమె వైసీపీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె బీజేపీలో చేరారు. తన భర్త పోతుల సురేష్ తో కలిసి కమలం కండువా కప్పుకున్నారు.   అయితే బీజేపీ వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీలు రాష్ట్రస్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ కూడా పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే వైసీపీలో ఉన్న సమయంలో పోతుల సునీత చంద్రబా బునాయుడు, లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులపై చేసిన విమర్శల కారణంగా ఆమెకు తెలుగుదేశం తలుపులు మూసేసింది. దీంతో ఆమె జనసేనలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే తెలుగుదేశంతో ఉన్న పొత్తు ధర్మాన్ని పాటించిన జనసేన ఆమె చేరికకు అంగీకరించలేదు. దీంతో ఇంత కాలం ఏ పార్టీలోనూ లేకుండా రాజకీయాలకు ఒకింత దూరంగా మెలిగిన పోతుల సునీత ఇప్పుడు కమలం కండువా కప్పుకుంది. రాష్ట్రంలో పొత్తులో ఉన్న రెండు పార్టీలూ కాదన్న వ్యక్తిని బీజేపీ ఎలా చేర్చుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

ఆక్వారైతుల రుణాలపై మారటోరియం.. కేంద్రానికి చంద్రబాబు లేఖ

  అమెరికా టారిఫ్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వారైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సహా వాణ్యజ్య, మత్స్య శాఖ మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అమెరికా టారిఫ్ ల కారణంగా ఆక్వారంగానికి పాతిక వేల కోట్ల రూపాయమల నష్టం వాటిల్లిందన్నారు. దాదాపు 50 శాతం ఎగుమతుల ఆర్డర్లు నిలిచిపోయాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని చంద్రబాబు  ఆ లేఖలలో కోరారు. ఆక్వారైతులు నష్టపోకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన విధానాన్ని అవలంబించాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలని కోరారు. అలాగే ఆక్వారైతుల రుణాలపై మారటోరియం విధించాలని చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు.  

షర్మిలతో బొత్స మాటా మంతీ.. మతలబేంటి?

విశాఖ స్టీల్ ప్లాంట్ పై విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణల భేటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకు ప్రధాన కారణంగా ఈ ఇరువురూ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పక్కపక్కనే కూర్చోవడమే కాకుండా.. స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.   అన్నిటి కంటే అందరి దృష్టినీ ఆకర్షించిన విషయమేంటంటే.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ముందుగా బొత్స సత్యనారాయణ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి షర్మిల వచ్చారు. సమావేశం హాల్ లోకి షర్మిల ప్రవేశించడం గమనించగానే బొత్స సత్యనారాయణ తన స్థానం నుంచి లేచి నిలబడి ఆమెను పలకరించి.. తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని కోరారు.  దీంతో షర్మిల బొత్స పక్కనే ఉన్న స్థానంలో   కూర్చున్నారు. బొత్సతో మాట్లాడిన తరువాత.. ఆ పక్కనే ఉన్న సీపీఐ నేత రామకృష్ణను పలకరించారు.  సమావేశం ముగిసిన తర్వాత, షర్మిల బొత్సకు అన్నా వెళ్లొస్తా అని చెప్పి మరీ వెళ్లారు. ఇరువురి మధ్యా  సంభాషణ కొద్ది సేపే జరిగి ఉండొచ్చు కానీ.. ఆ కొద్ది సేపు జరిగిన భేటీయే వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో పలు ఊహాగాన సభలు జరగడానికి కారణమైంది. అందుకు కారణం లేకపోలేదు. వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీలు ఉండవు. శత్రు పార్టీలు మాత్రమే ఉంటాయి. అందులోనూ షర్మిల వైసీపీ అధినేత, స్వయానా తన సోదరుడు అయిన జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తుండటమే కాకుండా..  వైఎస్ జగన్  వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు ఎంత మాత్రం కాదని విస్ఫష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ షర్మిలతో మాటా మంతీ కలపడం కచ్చితంగా జగన్ కు నచ్చదు. ఆ సంగతి తెలిసీ బొత్స సత్యనారాయణ షర్మిలను లేచి నిలబడి మరీ పలకరించడమే కాకుండా.. స్వయంగా తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని ఆహ్వానించి మరీ మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరిం చుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.    

వైసీపీ ఐదేళ్ల అవినీతి పాలనకు చరమగీతం : జేపీ నడ్డా

  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. వైసీపీ అవినీతి పాలనకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చరమగీతం పాడారని జేపీ నడ్డా అన్నారు. విశాఖపట్నంలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన 'సారథ్యం' యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు దేశంలో వారసత్వ, అవినీతి రాజకీయాలు రాజ్యమేలాయి. అదే తరహాలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైంది. రాష్ట్ర ప్రజలను గత పాలకులు దారుణంగా మోసం చేశారని విమర్శించారు.  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు" అని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీ మళ్లీ పునరుజ్జీవనం పొందుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అనే నినాదంతో దేశం ముందుకు సాగుతోందని నడ్డా గుర్తుచేశారు. దశాబ్దాల నాటి అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ వంటి చారిత్రక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు.  ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నడ్డా, రాష్ట్రానికి కేటాయించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రస్తావించారు. సాగర్ మాల పథకం కింద 14 పోర్టుల నిర్మాణం, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, జాతీయ రహదారుల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయానికి రూ.625 కోట్ల నిధులు విడుదల చేశామని, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, అమృత్ భారత్, వందే భారత్ వంటి ఆధునిక రైల్వే సేవలతో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలతో కలిసికట్టుగా పనిచేస్తామని నడ్డ తెలిపారు.

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

  మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏడాది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు బీజేపీతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. ఏడాది క్రితం వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో పోతుల సునీత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017లో టీడీపీ తరఫున ఆమె తొలిసారిగా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ టికెట్  ప్రయత్నించినా  దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2020 నవంబరులో ఆమె టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై సేవలందించారు.పోతుల సునీత రాజకీయ ప్రస్థానంలో ఇది మూడో మలుపు.