బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని,నాడు శంకరముఖర్జీ,వాజిపేయి ల నాటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ కాదు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది పరోక్షంగా నరేంద్ర మోడీ ని గురించిన వ్యాఖ్యానమనే అనుకోవచ్చా?
ఇదెక్కడి (అ)న్యాయం?
నిన్న మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి ఒక గజదొంగ అని, ఆయన పార్టీని ఒక దొంగల ముటా అని మీడియా ముందు తిట్టిపోసిన దాడి వీరభద్రరావుకి, అలనాడు భోది వృక్షం క్రింద బుద్దుడికి జ్ఞానోదయం అయినట్లు, నేడు చంచల్ గూడా జైల్లో జ్ఞానోదయం అయింది.
ప్రధాని మన్మోహన్ కుర్చినీ కదపలేరు!