మల్లిక్ స్పెషల్: రాష్ట్ర విభజన పాటలు

      సోనియా గాంధీ : '' తలచినదే జరిగినదా...దైవం ఎందులకూ....''   దిగ్విజయ్ సింగ్:  '' ఆగదు ఏ నిమిషం నీ కోసమూ...ఆగితే సాగదు ఈ లోకమూ...''      కిరణ్ కుమార్ రెడ్డి: '' జయమ్ము నిశ్చయమ్మురా...భయమ్ము లేదురా...." కేసీఆర్ : '' దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది'' జగన్:  '' నడిపించు నా నావా...నడి సంద్రమున దేవా...." చంద్రబాబు : " బోల్తా పడ్డావూ బుజ్జినయానా ..చెమ్కీ తిన్నావూ చిన్ని నాయనా..." చిరంజీవి : " జన్నమెత్తితిరా...అనుభవించితిరా " పురందేశ్వరి: '' చిన్ని చిన్ని ఆశ!..చిన్నదాని ఆశ " ప్రణబ్ ముఖర్జీ : '' జీవము నీవే కదా..బ్రోచే భారము నీదే కదా..." సీమాంధ్ర నాయకులు : '' అమ్మా అని అరచినా ఆలకింప వేమమ్మా ...ఆవేదనా తీరు రోజు ఈ జన్మకు లేదా? ''                       ప్రజలు :  " ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?..."