Never Test Knowledge of Subramanian Swamy

                    Subramanian Swamy is the most trusted BJP Leader and he is like one man army , It is known that he will not even spare his own party leaders if something goes wrong , we have seen it manytimes now you can think about opposition parties , He already made Sonia Gandhi and Rahul Gandhi to run in national herald case following them he kept P Chidambaram and his son in hardtime and recently Sashi Tharoor joins the club . Many people tried to outsmart him but their efforts went in vain from Arnab Goswami to Owaisi recently actor prakashraj was completly ripped by swamy in a debate during that show a girl from audience well from media precisly she tried to outsmart Mr Swami based on what he told durng debate about 2 articles in constitution ie Article 37 and Article 48 . Lady from the audience questioned his knowledge on constitution saying  "Sir, according to Directive principles of state, it should not be enforceable" (she tried to correct swami saying that beef ban is not enforceable by the State).  Subramanian Swamy took it in a lighter vein and said dont be a semi literate and asked her to read it completly then she continued  and said, "but the principles are fundamental in governance and it’s the duty of the government to implement it" . Then he said this is what he meant to be and he said  let me educate some of the semi-literate here. When they say, it’s not enforceable by the court it means i can not go to the court and say it’s my fundamental right to have uniform civil code(or beef ban) so you(people) can direct the gov. to implement it, that’s all but it’s also the duty of the gov. to implement it and more .……. That’s the exact word used in the constitution." With this we can easily say that swami is filled with ocean of knowledge and his mastery towards constitution You can view the incident here                                                          View of Karthik Kotamraju

That Incident Turned TN Politics

Tamil Nadu Chief Minister Jayalalithaa’s demise leaves not just Tamils, but also others in the country in tears. The actress turned politician who made her mark in Tamil politics had faced tough times during early stages of her political career. In fact, one incident had turned Tamil Nadu state politics and also Jayalalithaa’s life completely. In 1989, Jayalalithaa, the Leader of the Opposition, was abused in the Tamil Nadu Legislative Assembly. A mysterious person submitted Jayalalithaa's letter of resignation to the Speaker M Tamilkudimagan who accepted it against the rules. Further, the letter was leaked to the press. A week later, when Chief Minister Karunanidhi was about to present the budget the Opposition protested the way in which Jayalalithaa had been treated. The ruckus that followed the indictments in the Assembly went out of control. Though Jayalalithaa was making her way out of the House surrounded by members of the Opposition who'd formed a human shield around her, DMK Minister Durai Murugan rushed towards her to hit her. Though it was unknown whether Durai purposely pulled her saree or it was accidental, Jayalalithaa's saree was torn. Humiliated Jayalalithaa left the Assembly, vowing that she would come back as the Chief Minister. The incident acquired the respect of myth in the public mind. And the above dramatic photograph was published in the first page of The Indian Express, winning Jayalalithaa sympathy from the people of Tamil Nadu, especially the women voters who identified with her struggle in a male dominant, patriarchal society. The incident redefined Jayalalithaa: to herself and the public.

సూపర్ స్టార్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు

సూపర్ స్టార్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతికంగా చాలా మార్పులకు కారణమైన హీరో, డేరింగ్ అండ్ డాషింగ్ అన్న మాటకు నిర్వచనం చెప్పిన హీరో ఘట్టమనేని శివరామకృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బుర్రిపాలెం గ్రామంలో, వీరరాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు 1943 వ సంవత్సరం, 'మే' 31 వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మించారు. బి.యస్.సి. వరకూ చదువుకున్నారు కృష్ణ. చదువుకునే రోజుల్లోనే నటన మీద మక్కువతో అనేక నాటకాలాడారు కృష్ణ. అనతరం 1965 లో"తెనె మనసులు" చిత్రం ద్వారా తొలిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు వెండితెర మీద సూపర్ స్టార్ ప్రభంజనం మొదలయ్యింది. మామూలుగా కృష్ణ గారికి ధైర్యం చాలా ఎక్కువ. ఎవరూ ఊహించటానికి కూడా సాహసించని రోజుల్లో ఆయన "జెమ్స్ బాండ్" తరహా "గూఢచారి 116" వంటి గూఢచారి చిత్రాలకు శ్రీకారం చుట్టారు. అలాగే మనకు అసలు పరిచయం లేని "మోసగాళ్ళకు మోసగాడు" వంటి కౌబాయ్ చిత్రాలకు కూడా కృష్ణ గారే ఆద్యుడు. ఇక తొలి సినిమా స్కోప్ " అల్లూరి సీతారామరాజు" చిత్రాన్ని కూడా ఆయనే హీరోగా నటిస్తూ నిర్మించారు. "సింహాసనం' చిత్రంతో 70 m m ని కూడా ఆయనే తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టారు. ఒక టైంలో ఆయన సినిమాలు సంవత్సరానికి 17 విడుదలైతే వాటిలో 9 వందరోజులాడాయి...! ఇక విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావుగారితో ఢీ అంటే ఢీ అంటూ ఆయన "దానవీరశూరకర్ణ" చిత్రానికి పోటీగా "కురుక్షేత్రం" చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. రామారావు గారి తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయనకు వ్యతిరేకంగా "మండలాధీశుడు" అనే చిత్రాన్ని నిర్మించి రామారావు గారిని దారుణంగా విమర్శించారు. నిజానికి అప్పట్లో రామారావుగారిని ఎదుర్కోవటమంటే సామాన్యమైన విషయం కాదు. అయినా ఎదుర్కొన్నారు. కృష్ణ గారి గుండెధైర్యం అలాంటిది. ఇక నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కళాఖండం "దేవదాసు" చిత్రాన్ని తాను హీరోగా నటిస్తూ, తన భార్య విజయనిర్మల దర్శకత్వంలో మళ్ళీ నిర్మించారు. తన మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పగలిగిన వ్యక్తి తెలుగు సినీ పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ తొలి స్థానంలో ఉంటారు. తన సినిమానే కాదు ఎవరి సినిమా అయినా చూడగానే ఆయన జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇది సూపర్ హిట్ అంటే సూపర్ హిట్టే...ఆయన ఫ్లాపంటే ఫ్లాపే. దీనికి ఉదాహరణగా కృష్ణ గారు "పోకిరి" సినిమా చూసి "ఇది 40 కోట్లు వసూలు చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది" అని దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో అన్నారట. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ నవ్వుకున్నారట. కాని కృష్ణ గారు చెప్పిన మాటలు నిజమైన తర్వాత వాళ్ళిద్దరూ కృష్ణ గారి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరారట. 350 కి పైగా చలన చిత్రాల్లో నటించిన ఆయన 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తర్వాత తను సొంతంగా బ్యానర్ స్థాపించి అనేక చిత్రాలను నిర్మించారు. ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనితరసాథ్యం. అటువంటి కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలనివ్వాలని కోరుకుంటూ తెలుగువన్ ఆయన సమర్పిస్తున్న చిన్న జ్ఞాపిక ఈ వ్యాసం.

యన్.టి.ఆర్.89 జయంతి

తెలుగు వారందరికీ శ్రీ రాముడన్నా, శ్రీకృష్ణుడన్నా కళ్ళముందు కనపడే దివ్యమంగళ విగ్రహం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు గారు. ఒక నటుడి పర్సనాలిటీ, ముఖ వర్చస్సు కొన్ని పాత్రలకే పరిమితమవుతాయి. అన్ని పాత్రలకూ అందరూ సరిపోరు. కానీ రాజు నుండి పేద వరకూ, కృష్ణుడి నుండి దుర్యోధనుడి వరకూ, రాముడి నుండి రావణాసురుడి వరకూ, రైతు బిడ్డగా, రాజుగా ఇలా ఒకటనేమిటి...అన్ని పాత్ర్రలకూ రామారావు గారి ముఖం కానీ, పర్సనాలిటీ కానీ ఆయన వాచకం కానీ చక్కగా అతికినట్టు సరిపోతాయి. అది ఒక్క యన్.టి.ఆర్.కే సాధ్యమైంది. ఆయన తొలి చిత్రం "మనదేశం" నుండి ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన పాత్రల గురించి చెప్పాలంటే ఆయన నటించిన అన్ని చిత్రాల గురించీ చెప్పాలి. అది కష్టం కనుక ఆయన నటించిన అజరామరమైన కొన్ని పాత్రల గురించి తెలియజేస్తాను. పాతాళ భైరవి, లవకుశ, మయాబజార్, కన్యాశుల్కం, మల్లీశ్వరి, జయసింహ, భూకైలాస్, సారంగధర, రాజమకుటం, భట్టి విక్రమార్క, శ్రీ వేంకటేశ్వర మహత్యం, గుండమ్మ కథ, రాముడు-భీముడు, గుడిగంటలు, ఉమ్మడి కుటుంబం, చిరంజీవులు, బడిపంతులు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, పల్లెటూరి పిల్ల, పాండురంగమహత్యం, రాజు-పేద, భీష్మ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ పాండవీయం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, దానవీరశూరకర్ణ, దీపావళి, వేటగాడు, అడవి రాముడు, చండశాసనుడు, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చలన చిత్రాల్లో మహారాజుగా వెలుగుతూండగానే ఆయన రాజకీయాల్లోకి రావటం జరిగింది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్న నినాదంతో, తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు తారకరామారావు గారు. ఇది మరెవరికీ సాధ్యం కాని చరిత్ర...! ఒక్క నందమూరి తారక రాముడికి మాత్రమే సాధ్యమైన చరిత్ర. అధికారంలోకి రాగానే పేదలకు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. స్త్రీలకు ఆస్తిలో పురుషులతో పాటూ సమానంగా హక్కు కల్పించారు.మద్యానికి బానిసలైన పురుషుల వల్ల తెలుగింటి ఆడపడుచులు బాధ పడుతున్నారని తెలిసి, సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. తెలుగు ప్రజలకు ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన చిత్తశుద్ధితో అమలుపరిచారు...! ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినా, తన అసామాన్యమైన పట్టుదలతో, కృషితో, దీక్షతో చలనచిత్ర రంగంలో ఎదురులేని కథానాయకుడిగా, ప్రజాసంక్షేమం కోరే ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఆచంద్రతారార్కం నిలిచే ఉంటాయి. తెలుగువారికి ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా ఛాతీ నాలుగంగుళాలు విస్తీర్ణం పెరుగుతుంది. ఆ మహామహుని, ఆ మహనీయుని 89 వ జయంతి సందర్భంగా తెలుగువన్ ఆయనకు సమర్పిస్తున్న నివాళి...!

2012 లో రానున్న పెద్ద సినిమాలు

2012 లో రానున్న పెద్ద సినిమాలు ఏమిటంటే చాలానే ఉన్నాయి. రానున్న సంక్రాంతి రేస్ లో దాదాపు ఆరు సినిమాలున్నాయని ఇప్పటి వరకూ అనుకున్నాం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ "అధినాయకుడు", విక్టరీ వెంకటేష్ "బాడీగార్డ్", ప్రిన్స్ మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్", రవితేజ "నిప్పు", సునీల్ "పూలరంగడు", యువ రాకింగ్ స్టార్ ఆది "లవ్ లీ" సినిమాలు రేపు రాబోయే సంక్రాంతి పండుగకు విడుదలవుతాయని వినపడింది. కానీ వీటిలో "బాడీ గార్డ్, బిజినెస్ మ్యాన్, పూలరంగడు" మాత్రమే సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. " అధినాయకుడు, నిప్పు , లవ్ లీ" సినిమాలు ఫిబ్రవరికి వాయిదాపడ్డాయి. ఇవికాక ఇంకా రాబోయే పెద్ద సినిమాలు ఏమిటంటే కింగ్ అక్కినేని నాగార్జున "డమరుకం", పవర్ స్టార్ "గబ్బర్ సింగ్", యంగ్ టైగర్ యన్.టి.ఆర్. "దమ్ము", యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ "రెబెల్", మెగాపవర్ స్టార్ "రచ్చ", యువసామ్రాట్ "ఆటోనగర్ సూర్య" స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "హనీ" మార్చ్, ఏప్రెల్ నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. యువ హీరోలు యన్.టి.ఆర్., రామ్ చరణ్, వరస సినిమాలు చేస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో యన్.టి.ఆర్. హీరోగా నటించే సినిమా కూడా ఈ సంవత్సరంలోనే విడుదలవుతుంది. అలాగే రామ్ చరణ్ కూడా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒకటి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "ఎవడు" చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలవుతాయి. సో 2012 లో అందరు పెద్ద హీరోలూ బిజీ బిజీగా సినిమాల్లో నటిస్తూంటే మన సినీ పరిశ్రమ కళకళలాడుతుందనటంలో సందేహం అక్కర్లేదు. అలాగే ప్రేక్షకులకు కూడా విందు భోజనం లాంటి సినిమాలు కనువిందుచేయనున్నాయి.

వివాదాల వర్మ

మన దేశంలో నూటికి తొంభై మంది ఎలాగోలా ఏదో ఒక ఉద్యోగం చూసుకునో, వ్యాపారం చేసుకునో జీవితంలో ఏదో ఒక విధంగా సెటిలవ్వాలనుకుంటారు. కానీ మిగిలిన పదిశాతం మందిలో ఎనిమిది శాతం మంది విపరీతంగా ధనం సంపాదించాలనుకుంటారు. ఇక మిగిలిన రెండు శాతం మంది కీర్తి కోసం ప్రాకులాడేవారుంటారు. వీళ్ళ కోవలోకి వచ్చే వ్యక్తి ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల వర్మ. ఈయన ఆలోచనా విధానం మొదటి నుంచీ విభిన్నంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య అది మరీ వివాదాలకు దారి తీసేలా తయారయ్యింది. ఉదాహరణకు వస్తే మొన్న ఆయన రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన తీసిన "రక్తచరిత్ర" సినిమా రెండు భాగాలు చాలా వివాదాలను రేకెత్తించాయి. పరిటాల రవి, మద్దెల చెరువు సూరిల మధ్య జరిగిన హత్యారాజకీయాల, వర్గ పోరాటాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీశారు వర్మ. అదొక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ మీద విమర్శల వర్షం కురిపించారు వర్మ. ఈ చిత్రంలో ఏకంగ తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖ దర్శకులను ఘాటుగా ఒక పాటలో విమర్శించారాయన. అదృష్టవశాత్తూ అందరూ దానికి పెద్దగా స్పందించలేదు గాబట్టి అది సంచలనాన్ని సృష్టించలేకపోయింది. ఐదు రోజుల్లో సినిమా తీస్తానంటూ "దొంగల ముఠా" సినిమా తీశారు. అదీ ఆశించినంతగా సంచలనం సృష్టించలేదు. ప్రస్తుతం "బెజవాడ" అనే చిత్రం ఆయన ఆధ్వర్యంలో నిర్మించబడుతూంది. ఈ చిత్రం వల్లవిజయవాడలోని రెండు సామాజిక వర్గాల్లో అసహనం, అశాంతి నెలకొంది. కారణం ఈ రెండు సామాజిక వర్గాలకూ ఆధిపత్య పోరు జరిగింది. ఆ ఆధిపత్యపోరులో ఇరువర్గాల నుండీ అనేకమంది నాయకులూ, కార్యకర్తలూ హత్యలకు గురయ్యారు. ఈ చిత్రానికి ముందుగా "బెజవాడ రౌడీలు" అని ఆయన పెట్టిన పేరే వివాదాస్పదమయ్యింది. ముందు ఎవరేమనుకున్నా తాను ఆ చిత్రం పేరు మార్చనని వర్మ అన్నా, ఆ తర్వాత దాన్ని "బెజవాడ" గా మార్చటం జరిగింది. ఈ చిత్రం డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కానుంది. ఇది సినిమాల తాలూకు వర్మ పరిస్థితి. ఇక తన ట్విట్టర్ లో వర్మ రాసే వ్యాఖ్యలు చూస్తే మరింత వివాదాస్పదంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని తెలియజేస్తాను. "పుణ్యం చేసిన మగవారి కోసం స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక వంటి దేవ వేశ్యలుంటారని అంటారు. మరి అదే పుణ్యం చేసిన ఆడవారి కోసం అక్కడ ఎవరుంటారో" అని సందేహం వ్యక్తం చేశారు వర్మ. రజనీకాంత్ ఒక నిమిషం పాటు హీరోగా నటించిన "రావన్" చిత్రంలో షారూఖ్ ఖాన్ రెండు గంటల పాటు అతిథి పాత్రలో నటించాడు"అని షారూఖ్ ఖాన్ మీద సెటైర్ వేశారు వర్మ. ఇవన్నీ ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే రామ్ గోపాల వర్మ మనస్తత్వాన్ని, ఆలోచనా సరళిని తెలియజెప్పే ప్రయత్నం చేయటానికి. నిజానికి వర్మ దూషణ, భూషణ, తిరస్కారాల వంటి వాటికి అతీతుడని వర్మ అమ్మగారు "నా ఇష్టం" పుస్తకం ఆవిష్కరణ సభలో చెప్పారు. ఏది ఏమైనా సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువుగా నిలవటం వర్మ ముద్ర అనేది సుస్పష్టం. దయచేసి ఈ ఆర్టికల్ మీద మీ మీ అభిప్రాయాలను తెలియజెయ్యండి....!

తెలుగు పాటల పల్లకి శ్రీమతి యస్.జానకి

ఆ నటరాజు అనుగ్రహం, అలాగే వాగ్దేవి కరుణ మనపై ఉంటేనే కానీ మనలో కాళాకారులకు కావలసిన కనీస అర్హత ఉండదు. ఆ తర్వాత ఆ కళలో మనం రాణించాలన్నా కూడా వారి అనుగ్రహం ఉండితీరాలి. లేకపోతే ఏ వ్యక్తీ కళాకారులవ్వటం అసాధ్యం. కొంతమందికి కళాకారులవ్వటంలో ఆ భగవంతుడి కరుణాకటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా వారిపై ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో తెలుగింటి పాటల పల్లకి, తేనెలూరే గాత్ర మాధురి, ఆరు నుంచి అరవై యేళ్ళ వయసు వారి వరకూ భావాలను తన గాత్రంలో పలికించగలిగే నేర్పరి ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి యస్.జానకి.   1938లో ఏప్రెల్ 23 వ తేదీన, గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో జానకి జన్మించారు. పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. విధియిన్ విలయాట్టు అనే తమిళ చిత్రంలో టి.చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఎ.వి.యమ్.స్టుడియోలో ఆమె తొలి పాట పాడారు. 1956 "యమ్.యల్.ఎ." చిత్రంలో "నీ ఆశ అడియాశ" అనే పాటతో తెలుగు సినీ రంగంలోకి నేపథ్య గాయనిగా ప్రవేరశించారు యస్.జానకి. అప్పటి నుండి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, ఒరియా,సింహళి, తుళు, బెంగాలీ, సంస్కృతం, సౌరాష్ట్ర, కొంకణి, బడుగ, జపనీస్, జెర్మని వంటి మొత్తం 17 భాషల్లో శ్రీమతి యస్.జానకి గారు కొన్ని వేల పాటలు పాడారు. ఆమె గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తెనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా"అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు. ఆమె పాడిన పాటల గురించి చెప్పాలంటే ఏకంగా ఒక గ్రంధమే వ్రాయాలి. ఒకటా....? రెండా.....? కొన్ని వేల పాటల్లో ఆమె పాడిన కొన్ని పాటల గురించే చెప్పాలంటే ఎలా....? "మురిపించే మువ్వలు" చిత్రంలో "నీలీల పాడెద దేవా" పాట వింటే అద్భుతమైన నాదస్వరం కూడా భయపడే స్థాయిలో గమకాలను పలికించగల గాత్రం జానకి గారిదేనంటే అతిశయోక్తి కాదుకదా...?.   "బావామరదళ్ళు" చిత్రంలో "నీలి మేఘాలలో గాలి కెరటాలలో" అనే పాట వింటే గాలిలో తేలిపోని మనసుంటుందా...? "పూజాఫలం" చిత్రంలోని "పగలే వెన్నెల జగమే ఊయల" పాట వింటూంటే పగలే వెన్నెల కనపడదా...? జగమే ఊయల కాదా....? "నర్తనశాల" చిత్రంలో "జననీ శివకామినీ" పాటలో ఆ శివకామి మనకు దర్శనమీయదా...? అదే చిత్రంలోని "ఓ నరవరా ఓ కురువరా" అనే పాట వింటే తన్మయంలో తేలని తనువుంటుందా...? "పదహారేళ్ళ వయసు" చిత్రంలో "సిరిమల్లె పూవా" పాటలోని కమ్మదనం, "పంట చేలో పాలకంకి నవ్విందీ" పాట చివర్లో ఓ డబ్భై యేళ్ళ ముసలమ్మ నవ్వినట్లు నవ్వటం జానకమ్మకు తప్ప వెరెవ్వరికి సాధ్యం. "సప్తపది" చిత్రంలోని "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన" పాటలో పద్నాలుగేళ్ళ కుర్రాడికీ, నాలుగేళ్ళ పసిపాపడికీ కలిపి పాడిన జానకమ్మ గాత్రం శ్రోతలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అదే చిత్రంలో "నెమలికి నేర్పిన నడకలివే" పాటలో ఆమె గాత్రంలో పలికిన స్వర మాధుర్య గమకాలు మరవగలమా....?   జంధ్యాల గారి "శ్రీవారికి ప్రేమ లేఖ" చిత్రంలోని "తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు" పాటలో కన్నె పడుచులోని కలల కమ్మదనాన్ని ఎంత మధురంగానో పలికించారు జానకమ్మ. "రాక్షసుడు" చిత్రంలో దేవులపల్లి వారు వ్రాసిన అద్భుత దేశభక్తి గీతం "జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్య ధాత్రి- జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి" అనే పాట వింటే మన దేశం మీద దేశభక్తి పొంగిపొర్లుతుంది. ఇక "ప్రతిఘటన" చిత్రంలో "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో" అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పాటలోని "మర్మం స్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం" పదాన్ని జానకమ్మ పలికిన తీరు విన్నవారెవరైనా స్త్రీని గౌరవించకుండా ఉండగలరా.....?   ఇక్కడ అప్రస్తుతమైనా వేటూరి వారి కలం ఆ పాటను మనసున్న ప్రతి మనిషికీ ఆపాదమస్తకం కంపించేలా వ్రాయగా, జానకమ్మ అంత కంటే అద్భుతంగా ఆ బ్ఘావాన్ని తన గాత్రంలో పలికించారు. "సాగర సంగమం" చిత్రంలో "మౌనమేలనోయీ ఈ మరపురాని రేయి" పాటకానీ, "ఓం నమఃశివాయ చంద్ర కళాధర సహృదయా" అనే పాటలో జానకమ్మ గాత్రం మరింతగా తెలెలూరుతుంది. "ఓం నమఃశివాయ చంద్ర కళాధర సహృదయా" పాటకు ఒక ప్రత్యేకతుంది. అదేమిటంటే ఆ పాటలో నర్తించింది మరొక చక్కని ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి శైలజ. "జ్యోతి" చిత్రంలోని "సిరిమల్లెపూవల్లె నవ్వు- చిన్నారి పాపల్లె నవ్వూ" అనే పాటలో ఆమె స్వరంలో నవ్వటం అంటే ఏమిటో ఆ పాటలో పలికిస్తుంది మహా గాయని శ్రీ మతి యస్.జానకి.   ఇక్కడ ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇద్దరి గురించి ఒక మాట చెప్పాలి. ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మల కాంబినేషన్ లో వచ్చిన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షించాయి, ఆనందడోలికల్లో తెలేలా చేశాయి. జానకమ్మ గురించి బాలు స్వయంగా ఎ.వి.యమ్.స్టుడియో తన సన్నిహితుల వద్ద అన్నమాట ఇది "జానకి గారి గురించి ఏం చెపుతామయ్యా....ఆవిడ గాత్రం స్వరం మీద నవ్వుతుంది...స్వరం మీద ఏడుస్తుంది....స్వరం మీద నాట్యం చేస్తుంది. ఆవిడ గాత్రంగురించీ, ఆ గాత్రం లోని మధురిమ గురించి పొగిడేందుకు వేయి పడగలున్నఆ ఆదిశేషుడి తరం కూడా కాదయ్యా" అని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేం కావాలండీ. ఇంతకంటే రివార్డులేముంటాయి. అటువంటి జానకమ్మ నాలుగుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎన్నికయ్యారు. ఇక తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన "కళైమామణి" అవార్డులవంటివి అనేకం జానకమ్మను వరించి ధన్యత చెందాయి.   అయితే చాలా బాధాకరమైన సంగతి ఏమిటంటే ఈ రోజుల్లో అర్హతలేని చాలా మంది వెధవలకు "పద్మశ్రీ" అవార్డులనిచ్చే మన భారత ప్రభుత్వం అద్భుతమైన గాయని, భారత దేశం యావత్తూ గర్వించదగిన, విశేష ప్రతిభ కలిగిన మధుర గాయని యస్.జానకి గారికి మాత్రం "పద్మశ్రీ" బిరుదు ఇంకా ఇవ్వలేదు. ఇవ్వకపోవటమే మంచిది. అనవసరంగా ఆ బిరుదిచ్చి అడ్డమైన వెధవల సరసకు ఆమె పేరుని కూడా చేర్చి జానకమ్మను అవమానించటమే అవుతుంది. అందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అపురూపమైన స్వర నర్తకి జానకమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కలకాలం ఇలాగే తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు శ్రోతలకు అందించాలని ఆశిస్తూ తెలుగు వన్ ఆమెకివే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Tollywood Summer Heroes

Come this April, and you would witness Telugu Cinema industry gearing up to lock horns with a super hot Indian summer. Bemused? Hang on! We're talking about the Telugu movie releases coming up this summer and which hero would strike the box office and set new record. Lets get into the detaisl if who could be the Tollywood summer hero and which film can beat the summer heat   First in the race is NTR Shakti Telugu movie. Directed by Meher Ramesh and produced by Aswini Dutt under prestigious Vyjayanthi Movies banner, NTR Shakti release date is April 1st. After the success of Adhurs and Brindavanam movies, NTR is all game to strike hat trick in Telugu cinema industry. With gigantic expectations amongst surging fan base, NTR Shakti is under incredible pressure to deliver at the marque. NTR Shakti is the highest budget (appr. 45 crores) movie in both NTR and Vyjayanthi Movies career. Putting these beside, can NTR Shakti deliver at the box office? Find out the answer on April 1.     Mr.Perfect release date is scheduled on April 21. After his Darling Telugu movie success, Prabhas is now looking to build his youth image and therefore choosing youthful characters.Directed by Dasharath and produced by Dil Raju under Sri Venkateswara Creations, Prabhas Mr. Perfect movie also several expectations and many anticipate the movie to be on the lines of Darling. Made with hefty budget, Mr Perfect movie has Prabhas romancing with Taapsee and Kajal and also strong action sequences and the movie all other commercial ingredients as well. Is this good enough to bring Mr Perfect our of Jail? Watch out for the release.    Next in the race is Power Star Pawan Kalyan's Teenmaar! Arguably Teenmaar Telugu movie is billed to be the biggest movie this summer in terms of hero stardom and movie business. After Komaram Puli disaster, Pawan Kalyan is gearing up to power and take vengeance against Tollywood with Teenmaar movie. Directed by Jayanth C Paranji and produced Ganesh Babu under Parameswara Arts, Teenmaar is a Telugu remake of Bollywood movie Love Aaj Kal. Mind you, Love Aaj Kal is a hit film in Bollywood but can this remake movie repeat the magic in Telugu? Can Power Star rescue Teenmaar  with his stardom? Trisha and Kirti Kirbanda are playing female leads in this movie while Pawan Kalyan is playing dual role out of which in one role he plays a Telangana college student.     Nenu Naa Raakshasi is another action romance movie starring Rana Daggubatri and Ileana. After Leader success, Rana is making grounds to prove a point in Telugu movies about his commercial viability. Cut across to Nenu Na Raakshasi director Puri Jagannth, this movie is surely a litmus test for him since he's overdue for a hit in Telugu films after Chirutha in 2007. Once again, Puri Jagannth roped his lucky heroine Ileana to start beside Rana, but he can set the box office going like he earlier did with Pokiri movie? Produced by Nallamalapu Bujji under Lakshmi Narasimha Productions, Nenu Naa Raakshsi release has become a acid test for several.   April 29 also marks the release of 100% Love Telugu movie. Starring Naga Chaitanya and Tamanna Bhatia. 100% Love movie is touted to be a romantic entertainer directed by Sukumar and produced by Bunny Vasu under Geeta Arts. Naga Chaitanya, after his super hit Ye Maaya Chesave, selected another romantic script and not any action story. Already 100% love movie posters and stills have been released and got a super hot response. Can the movie sustain all the expectations of per-release hype? That's the challenge.   Stylish Star All Arjun is hoping for a better summer this time and looking to erase last year memories with his powerful movie Badrinath. Allu Arjun had a tough time last year with Varudu failing to do well at the box office last summer and Vedam just getting critical acclamation. Directed by powerful director V V Vinayak and produced by Allu Aravind under Geetha Arts, Allu Arjun has pinned down his hopes on Badrinath to make a strong comeback into Tollywood.   Veera movie is yet another big Telugu movie awaited this summer. Starring Ravi Teja, Taapsee and Kajal Agarwal Veera movie is action drama where Ravi Teja is playing dual role. Capitalizing on success of his previous movies like Don Seenu and Mirapakaya, Ravi Teja has earned the reputation of being one of the few dependable heroes in Telugu film industry to make business with. Directed by Ramesh Varma and produced by Ganesh Indukuri under Sanvi productions, let's hope Ravi Teja Veera will live up to the craze.     Balakrishna is also in the summer slipstream! Balakrishna, Paruchuri Murali is in the making and the movie is slated for June release. The movie is directed by Paruchuri Murali and produced by ML Kumar Chowdary under Sri Keerthi Combines. Balakrishna set new Tollywood record with Simha, but went down with Para Veera Chakra debacle and now looking to capitalize on the energy generated through Simha. Salani and Payal Ghosh are playing female leads in this movie, which is expected to be yet another action drama tentatively titled Adhinayakudu.  With several telugu cinema releases coming up, its gonna be rocking time for Tollywood and let;s hope the industry benefits from these films' successes.      

The Body And Soul: Bapu - Ramana

No one can deny the fact that it's only a friend with whom we can share anything   that can not be shared with parents, siblings or the relatives. A true friend doesn't care whether his counterpart is rich or poor, mighty or a weakling. Really, it's very fortunate to have at least one such friend in a lifetime. Very few people are blessed to be of that kind and one such pair of friends is Bapu and Ramana. So great is their friendship that, they can be called 'body and soul' of one another. Not only they kept each other's company in low and high times, but also strengthened the bond by becoming relatives. Mullapudi Venkataramana started writing short stories from the age of 14. Bapu and Ramana knew each other from the days they were studying fourth class in P.S. High School, Chennai. In fact, Bapu's original name is Satthiraju Laxminarayana and was born at Narasapuram in West Godawari district. He did his Law graduation from Madras University in 1955. Since he was an accomplished painter and cartoonist by then, he got a job in 'Andhrapatrika' magazine. Ramana entered film industry much before Bapu did. In 1962 he worked as writer for "Raktha Sambandham" movie. It's a wonder that, Ramana who is well known for his humor writing was equally successful in writing for a brother-sister sentiment film! Later he wrote story and dialogues for movies like Moogamanasulu, dagudumuthalu, Preminchi Chudu, Kanne Manasulu, Navaratri, Poola Rangadu, Prana Mithrulu etc.,.   With the confidence Ramana had on Bapu's abilities, Ramana proposed to make films together. And that led to the making of "Sakshi" movie in 1967. The movie didn't fare well at the box office, but Bapu and Ramana gained good name.     "Bangaru Pichuka" was the next movie and that too met with the same fate. Later with Akkineni Nageswara Rao playing dual roles, a movie "Buddhimanthudu" was made. This movie was well received by the audience and remains a classic even today. With this movie Bapu and Ramana became a household name in Andhra Pradesh and were able make Inti Gouravam, Balaraju Kadha like movies later.        Bapu and Ramana relied very much on each other's capabilities that they didn't hesitate in making "Sampurna Ramayanam" with Shobhan Babu as Lord Rama. It was certainly an adventure on part of the duo to cast Shobhan Babu in this film bypassing late N T Ramarao. But their collective intuition paid off and the movie registered a record break success.   Later in 1975, with "Muthyala Muggu" they were able to set a new trend in dialogue writing and its presentation. Actor Rao Gopala Rao and his dialogues in the film became so popular that thousands of its soundtrack cassettes were sold. The other successes of Bapu-Ramana combination - Bhakta Kannappa, Mana Vuri Pandavulu, Andala Ramudu, Sri Ramanjaneya Yuddham, Radha Kalyanam, Mantrigari Viyyankudu,   Pelli Pusthakam, Mr. Pellam, Srinadha Kavi Sarvabhoumudu, Seetha Kalyanam... the list is endless - much like their friendship. Teluguone congratulates the perennial bond of friendship between Bapu and Ramana and terms them as "The Body & Soul".     It’s very sad that one of the two ‘Millennium Friends’- Mullapudi Venkata Ramana died due to cardiac arrest today (24-02-2011) in  Chennai. It’s an irreparable loss not only for Bapu, but also for the innumerable fans of Budugu, Radha, Gopalam, Contractor, Apparao, Tutthi like characters created by Ramana.   Venkata Ramana's death is surely one of the biggest setbacks for the Telugu cinema industry. Teluguone extends its heartfelt condolences to the bereaved family and Bapu. May his soul rest in peace.

Chiranjeevi Active for Allu Arjun Marriage

Megastar Chiranjeevi would be busy in Allu Arjun Marriage celebrations, which start on March 4, 2011 at his residence. In fact, Chiranjeevi would take active part during Allu Arjun Sneha Reddy marriage. He graces the Bridegroom-making ceremony of Nephew Allu Arjun on March 4, 2011.   The marriage Muhurat is scheduled at 10:33 PM on March 6, 2011, but the celebrations will start couple of days early in Chiranjeevi residence. The preparations for Allu Arjun Sneha Reddy marriage is already in full swing. The wedding cards have already been distributed to all the close associates. Also, fans from mega camp are all elated on hearing the marriage news of Allu Arjun. As Allu Arjun’s marriage with Sneha Reddy is nearing, Badrinath movie is also getting into limelight. Allu Arjun marriage is perhaps the most sought after news this March, but mind you Allu Arjun wedding celebrations might not be too long since Badrinath movie factor would come into picture. Allu Arjun’s marriage with Sneha Reddy is on March at HITEX in Hyderabad. Also, Bollywood Perfectionist Aamir Khan, who worked with Allu Aravind’s Geetha Arts’ blockbuster Ghajini is attending Allu Arjun marriage. It seems that Aamir Khan shares great rapport with Allu Aravind and Allu Arjun.   It seems Aamir Khan would relax in Taj Krishna hotel and spend some leisure time in Hyderabad before dropping at Allu Arjun marriage function. Besides politicians, several top Indian film stars from Bollywood, Tollywood, Kollywood, etc are expected to attend Allu Arjun – Sneha Reddy wedding   All this would surely make Allu Arjun- Sneha Reddy marriage a grand affair and people are just waiting to see the kind of arrangements Allu Aravind makes for this marriage. Putting aside all these, one thing is for sure that Allu Arjun Sneha Reddy marriage would be an affair to remember for quite some time.  

నట సార్వభౌముడు యస్.వి.రంగారావు

ఇది సామాన్యమైన బిరుదు కాదు. దీన్ని పొందాలంటే నటనలో ఆద్యంతాలు తెలియాలి, నటనలో ఎంతో అనుభవం, ఆ అనుభవాన్ని సద్వినియోగం చేయగల సత్తా ఆ నటుడికి ఉండాలి. అయినా నటన అనేది పుట్టుకతో రావాలి. ఒక్క నటననేంటి ఏ కళ అయినా పుట్టుకతోనే రావాలి. లేకపోతే ఎవరైనా కళాకారుడిగా రాణించటం కష్టమే కాదు దాదాపు అసాధ్యం. అలాంటి వ్యక్తులు ఒకవేళ కళాకారులవ్వాలని ప్రయత్నించినా వారు ఎంత మాత్రం సఫలీకృతులు కాలేరు. ఉదాహరణకు తాళ జ్ఞానం లేని వ్యక్తికీ ఎంత పెద్ద కళాకారుడితో మృదంగం నేర్పించినా, ఎన్ని సంవత్సరాలు నేర్పించినా అతనికా విద్య ఒంటబట్టదు. స్వర, రాగ జ్ఞానంలేని వారికి ఎన్ని నాళ్ళు సంగీతం నేర్పించినా అది వారికి పట్టదు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే కళ భగవద్దత్తమని పెద్దలు చెపుతుంటారు ...   ఆ నటరాజు అనుగ్రహం లేకపోతే ఏ కళలోనైనా రాణించటం కష్టం. అలాంటి కళల్లో నటన చాలా గొప్పది. దీనిలో ఎదుటి మనిషిని ఆకట్టుకునే గొప్పదనం ఉంది ... నటిస్తున్న నటుడి అన్ని భావాలనూ ప్రేక్సకుడు అనుభవిస్తాడు ... అలా అనుభవించేలా చెయ్యగలిగితే ఆ నటుడు నటనలో పరిణితి సాధించినట్లే. అలాంటి మహా నటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బహు కొద్దిమందే ఉన్నారు. దేశ, విదేశాల్లో తమ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనుల్లో అగ్రగణ్యుల సరసన నటనా సార్వభౌమ శ్రీ యస్.వి. రంగారావు. చిత్ర రంగానికి హీరోగా వచ్చినా విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన నటన హిమాలయాలకంటే ఎత్తయింది. మహాసముద్రం కంటే గంభీరమైంది. వెన్నకన్నా, పూవుకన్నా, లేచిపురుకన్నా సున్నితమైంది, కరవాలం కన్నా పదునైంది, కోడెత్రాచుకన్నా చురుకైనది.   ఆయన నటన గురించీ, ఆయనలోని కళాకారుడి గురించీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్ర మాత్రమే కనపడేలా నటించటం ఆయన సొత్తు. నటుడు నీరులా ఉండాలి. ఎందుకంటే నీరు ఎలాగైతే ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని ఎలా పొందుతుందో నటుడు కూడా అలాగే ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలో మమేకమై తానుగా కాక ఆ పాత్రగా కనిపించాలి. అప్పుడే ఆ కళాకారుడి నటనకు పరిపూర్ణత, ఆ కళకు రససిద్దీ కలుగుతాయి. ఇది ఓ నటుడిగా, శ్రీ యస్.వి.రంగారావుగారి అభిప్రాయం. ఒక మనిషి యొక్క స్థాయి అతని ఆలోచనల్లో, అభిప్రాయాల్లో ప్రతిఫలిస్తుందనటానికి ఆయనే నిలువెత్తు తార్కాణం. ఆయనకు నటనపరంగా ఇలాంటి ఉన్నతమైన అభిప్రాయాలున్నాయ కాబట్టే ఆయన నటన ప్రేక్షకులను సమ్మోహపరిచేది ...   S.V. Ranga Rao acted movies పాతాళ భైరవి నేపాళ మాంత్రికుడు మాయా బజార్ ఘటోత్కచుడు భక్త ప్రహ్లాద హిరణ్య కశిపుడు గుండమ్మ కథ బాధ్యతా తెలిసిన పెద్దమనిషి పాపకోసం గ్రుడ్డివాడు పండంటి కాపురం పెద్దన్న పాండవ వనవాసం సుయోధన చక్రవర్తి భూ కైలాస్ మైరావణ దీపావళి నరకాసురుడు సంపూర్ణ రామాయణం రావన్ బ్రహ్మ యశోద కృష్ణ కంసుడు దసరా బుల్లోడు గయ్యాళి భార్యకు భయపడే భర్త సతీ సక్కుబాయి అమాయక భర్త సారంగధర సారంగాధరుడి తండ్రి బాల భారతం భీష్ముడు బాల నాగమ్మ మాయల ఫకీరు మిస్సమ్మ మతిమరుపు మనిషి అందరూ దొంగలే దొంగ, అమ్మాయిల పిచ్చోడు దేవుడు చేసిన మనుషులు కొడుకుని పోగొట్టుకున్న తండ్రి బంగారు బాబు పేద తండ్రి   ఇలా ఒకటా ...? రెండా ...? ఎన్ని పాత్రల గురించి చెప్పగలం ...? ఆయన నటించిన ప్రతి పాత్రకూ ఓ గుర్తింపు లభించేది ... దానికి కారణం ఆయన వాటిని మలచిన తీరే.   “పాతాళ భైరవి’’ చిత్రంలో ఆయన పోషించిన నేపాళ మాంత్రికుడు పాత్రను విశ్లేషిస్తే ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు. ఆ పాత్ర ఆహార్యం, భాష, మేనరిజమ్స్, ఇలా అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మామూలుగా రంగారావుగారు మంచి కండపుష్టి ఉన్న ఆరడుగుల ఆజానుబాహుడు. కానీ ఈ చిత్రంలో ఆయన ముఖంలో ఒకరరమైన మార్పుని తెచ్చారు. దానివల్ల ఆయన కొంచెం దవళ్ళు లోపలికి పోయినట్టుగా, ముఖం పీక్కుపోయినట్టుగా కనిపించే విధంగా మేకప్ చేశారు. గెడ్డం కూడా కొంచెం వెరైటీగా పెట్టారు. జుట్టు పొడవుగా మెడ మీద పడే విధంగా సహజంగా కనిపించే విగ్ పెట్టారు. ఇక కాస్ట్యూమ్స్ కొస్తే ఓ నల్లటి పొడవాటి లూజ్ గౌన్. ఇలాంటి ఆహార్యంతో ఆయన నిజమైన నేపాళ మాంత్రికుడిగా కనిపించారు.   ఆయన తెలుగు ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే, ఎంత వేగంగా చెప్పినా సరే దాన్లోని ప్రతి అక్షరం క్రిస్టల్ క్లియర్ అంత స్పష్టంగా వినపడేది. వాచకం విషయంలో ఆయన చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన డైలాగ్ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉండేది ... డైలాగుల్లో హెచ్చు తగ్గులు, విరుపులు వాటితో పాటు చక్కని భావప్రకటన అంటే ఆ పాత్ర స్వభావం ఆ డైలాగ్ చెప్పే విధానంలో కనపడేది. దానికి తోడు ఆయనది ధవళ గాత్రం. చాలా గంభీరంగా ఉంటుంది. ఆ పాత్రకు ఓ ప్రత్యేకమైన యాస వాడారు ... “సాహసం సాయరా డింభకా’’. “జనం సెప్పేది మనం సాయవలెనా మనం సేసేది జనం సూడవలెనా ...?’’, “జాయ్ పాతాళ భైరవీ’’ వంటి డైలాగులను గమనిస్తే ఆ యాసను ఆయన్ను ఆయన ఎలా వాడారో మనకర్థమౌతుంది. ఆ యాస ఎంత ప్రత్యేకమైనదంటే ఆ తర్వాత తెలుగు చలన చిత్రాల్లోని ప్రతి మాంత్రికుడు అదే యాసను వాడారు. అలా డైలాగుల్లో తన శైలిని ఆ పాత్రలో చూపించారు.   ఇక నటన విషయానికొస్తే ముఖంలో కాఠిన్యం, నాయవంచనం దుర్మార్గం, వెల్లివిరిసే క్రోధం లాంటి భావాలు చాలా చక్కగా వ్యక్తపరిచారు. తోట రాముడు అగ్నిగుండంలో దూకటానికి తటపటాయిస్తుంటే అతన్ని రెచ్చగొట్టి అందులోకి దూకించినప్పుడు. ఆ లోపలి తానూ తాడు సాయంతో దిగగానే అక్కడి పొగాకు తట్టుకోలేక చేయి అడ్డుపెట్టేటప్పుడు హావభావాలు అనితర సాధ్యం. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్క “పాతాళ భైరవి’’ చిత్రం గురించే ఎంతైనా చెప్పవచ్చు.   ఇక “భక్తప్రహ్లాద’’ చిత్రంలో ఆయన నటన పరాకాష్టకు చేరింది. తన కొడుకే తన శత్రువుని పూజించటం నచ్చక, ఆ కొడుకుని వదులుకోలేక, కొడుకుని చంపినా, ఆ పిల్లవాడు చావకపోవటం అర్టంకాక ఆ హిరణ్యకశిపుడు పడే మానసిక సంఘర్షణ చాలా అద్భుతంగా చూపించారు రంగారావు గారు. ఆ చిత్రం మొదట్లో దేవతలా మీది వైరంతో యుద్ధానికి బయలుదేరబోతూ, శుక్రాచార్యుడు చెప్పిన మాట ప్రకారం తపస్సుకెళ్ళినప్పుడూ, తిరిగివచ్చిన తర్వాత దేవతలను గెల్చి వారిని గెలిచేతప్పుడు చూపిన నటన చలనచిత్ర చరిత్రలో నభూతో నభవిష్యతి. చివరి సీన్లో నరసింహస్వామి ప్రత్యక్షం కాగానే ఆయన చెప్పే డైలాగులూ, చూపిన నటన గురించి ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం. ఇలాంటి పాత్ర పోషణలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఆయన బాడీ లాంగ్వేజీ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. నడకలో, మాటలో, ముఖంలో ఓ విధమైన నిర్లక్ష్యం, అహంకారం, ఓ రకమైన ధీమా మనల్ని ఆ పాత్ర ఇలాగే ఉంటుంది అనిపించేలా సమ్మోహనపరిచేవి.   “పాండవ వనవాసం’’ చిత్రంలో దుర్యోధనుడుగా ఆయన నటన నాకు స్ఫూర్తిగా నిలిచిందని మహా నటుడు కీర్తి శేషులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అన్నారంటే ఆ పాత్రలో రంగారావు గారు ఎంత బాగా నటించారో చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో జూదం సీన్లో పాండవులు తమ సర్వస్వం కోల్పోగా రారాజు ద్రౌపదికి తన ఊరువును చరుస్తూ సైగ చేసే సీన్లో యన్.టీ.ఆర్. తో డీ అంటే డీ అని నటించారు రంగారావు గారు. “ఛీ ... బానిస ... బానిసలకింత అహంభావమా ...?’’ ఈ ఒక్క డైలాగ్ తో రామారావు గారిని ఆ సీన్లో ఆయన డామినేట్ చేశారు .... ఈ విషయం ఆ చిత్రం చూసిన వారెవరికైనా గుర్తుండే వుంటుంది. ఆ సిను ఇద్దరు మహానటులతో 11 టేక్ లు, అదీ పౌరాణికాల మీద మంచి పట్టున్న దర్శకులు కీర్తి శేషులు శ్రీ కమలాకర కామేశ్వర రావుగారు తీశారంటే మనం అర్థంచేసుకోవచ్చు.   ఆ సీన్ పవర్ ఏంటో ... ఇద్దరూ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టులే మరి. రంగారావు గారి నటనకు మరో ఎస్సెట్ మాధవపెద్ది వారి గాత్రం. ఆయన రంగారావు గారికి పాడటానికే పుట్టారా అన్నంత సహజంగా రంగారావు గారికి సరిపోయేది ... రంగారావుగారి నటనకు మాధవపెద్ది పద్యం తోడైతే ఇక చెప్పేదేముంది. బంగారానికి తావి అబ్బినట్లే .... అదో అమోఘమైన కాంబినేషన్. పౌరాణిక చిత్రాల్లో రంగారావు గారి నటనకూ, జానపద చిత్రాల్లో, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లోని ఆయన నటనకూ తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అసలు ఒక పాత్రకూ మరో పాత్రకూ ఏ మాత్రం పోలిక లేకుండా ఏ పాత్రకాపాత్రే ప్రత్యేకంగా కనపడేలా నటించటం ఆయన ప్రత్యేకత.   “జగత్ కిలాడీలు’’ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగులు ఆ రోజుల్లో జనం నోళ్ళలో పలికాయంటే ఆయన ఆ డైలాగుల్ని చెప్పిన స్టైల్ అలాంటిది. “పులి అడవిలో ఉన్నా బోనులో ఉన్నా పులి పులేరా ఘూట్లే’’, “డోంగ్రే’’ ఇలాంటి డైలాగులు జనబాహుళ్యంలో చాలా రోజులు ప్రచారంలో ఉన్నాయి. ఆ పదాల ప్రయోగం ఓ విచిత్రం ఐతే వాటిని రంగారావు గారు చెప్పిన శైలి ఇంకా ప్రత్యేకంగా ఉండటం వల్లే వాటికంత ప్రజాదరణ లభించింది. ఒక్క డైలాగ్ మాడ్యులేషన్ మాత్రమె కాదు, ఆ మాటలకు తగ్గ బాడీ లాంగ్వేజ్, హావభావా ప్రకటన ఇవన్నీ కూడా ఆ పాత్రలను ప్రభావితం చేశాయనటంలో సందేహం లేదు.   “పండంటి కాపురం’’ చిత్రంలో ఆయన తమ్ముళ్ళ కోసం తపన పడే ఓ అన్నగా ఆయన చేసిన నటన ప్రక్షకుల్లో చెరగని ముద్రవేసిందంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో ముఖ్యంగా తమ్ముడి కొడుకు చనిపోయినప్పుడు ఆ పిల్లవాడిని మట్టిచేస్తూ ఆయన చెప్పిన డైలాగులు చూసిన ప్రతి ప్రేక్షకుడినీ కంటినీరు పెట్టించాయి.       “మిస్సమ్మ’’ చిత్రంలోని ఆయన పాత్ర మతిమరుపు పెద్దమనిషి. ఉత్తరీయం భుజం మీదే ఉన్నా దానికోసం వెతికే పాత్ర. ఆయనకు జోడీగా ఋష్యేంద్రమణి నటించారు. వీరి మధ్య నడిచే హాస్యం ఎంత హృద్యంగా ఉంటుందో ఆ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. అసలు ఆ చిత్రంలో నటించిన వారంతా మహానటులూ, మహానటీమణులు ... సాంఘిక చిత్రాల్లో అదొక మైలురాయిగా నిలిచిపోతుంది. ఏ.యన్.ఆర్. , యన్.టి.ఆర్.. యస్.వి.ఆర్., సావిత్రి, జమున, రేలంగి, అల్లురామలింగయ్య, రమణారెడ్డి, ఇలా ఆ చిత్రంలో హేమాహేమీలంతా పోటీపడి హాస్యాన్ని పండించారు. ఆ చిత్ర దర్శకులు కీర్తిశేషులు శ్రీ అక్కినేని, లక్ష్మీ వర ప్రసాదు (యల్.వి.ప్రసాద్) గారిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవటం మా కనీస ధర్మం.   ఇక మరో చక్కని చిత్రం “గుండమ్మ కథ’’. దీన్లో రంగారావుగారి నటన చాలా హుందాగా సాగుతుంది. యన్.టి.ఆర్., ఏ.యన్.ఆర్. ఇద్దరూ ఆయనకు కొడుకులుగా ఈ చిత్రంలో నటించారు. “దసరా బుల్లోడు’’ ఈ చిత్రం ఆ రోజుల్లో ఓ సంచలనమే సృష్టించింది. దీన్లో రంగారావుగారు తన గయ్యాళి భార్య నోటికి భయపడే భర్త పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పడే మానసిక సంఘర్షణ మనల్ని ఆకట్టుకుంటుంది.     ఇవన్నీ ఒక ఎత్తయితే “మాయాబజార్’’ చిత్రంలోని ఘటోత్కచుని పాత్ర ఒక ఎత్తు. ఆ పాత్ర పోషణ ఎవరికైనా కత్తిమీద సామే కావచ్చు. కానీ రంగారావు గారి లాంటి మహా నటునికి ఇది నల్లేరు మీద నడకే. పింగళి నాగేంద్రం గారిలాంటి మహాకవి రాసిన డైలాగుల్ని అంతకంటే అద్భుతంగా చెప్పి మెప్పించిన ఘనత మాత్రం యస్.వి.ఆర్. కె చెందుతుంది. ఆ పాత్ర ఓ రాక్షసుడి పాత్ర. దానిని పాజిటివ్ గా మలచి ఇంచుమించు ఆ చిత్రానికి ఆ పాత్రే హీరో అనిపించేలా ఆ పాత్రలో నటించారాయన. ఆ చిత్రంలోని “వివాహ భోజనంబు వింతైన వంటకంబు’’ పాట లేకుండా ఆ రోజుల్లో దాదాపు ఏ పెళ్ళీ జరిగేది కాదంటే అతిశయోక్తి కాదు. ఆ పాట సీన్లో ఆప్టికల్ వర్క్ తోనే అద్భుతాలు చేశారు. ఆయన శరీరం పెంచి పీటమీద కూర్చోగానే లడ్దూలన్నీ వాటంతట అవే ఆయన నోట్లోకి వెళ్ళటం, ఒక్క లడ్డూలేమిటి అన్ని ఆహార పదార్ధాలూ అలానే ఆయన నోట్లోకి వెళ్ళటం, ఇవన్నీ ఏ గ్రాఫిక్స్ లేకపోయినా, సాంకేతికంగా ఇప్పుడున్నంత అభివృద్ధి లేకపోయినా ఏంటో సహజంగా వాటిని చిత్రీకరించిన తీరు శతధా ప్రశంసనీయం.   ఆ చిత్రంలోనే కృష్ణుణ్ణి కలవటానికి వచ్చిన ఘటోత్కచుడు కొంచెం అహంకరించి, కృష్ణుని చేతిలో భంగాపడే సీన్లో కూడా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ ఆయనతో పాటు పోటా పోటీగా నటించిన ఒక మహానటీమణి గురించి కూడా మనం గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే ఘటోత్కచుడు అప్పుడప్పుడూ శశిరేఖగానూ, శశిరేఖ ఘటోత్కచునిగానూ కనపడతారు. ఈ సన్నివేశాల్లో మహానటి సావిత్రి, యస్.వి.ఆర్.ల మధ్య నటన పరంగా ఉన్న అవగాహన ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆ పాత్రలను చూసి ఆనందించాలే తప్ప వాటి గురించి వివరించటం అంత సులభం కాదు. చివరి సీన్లో కౌరవులనందర్నీ ఏడిపించేటప్పుడు ఆయన నటన చాలా గొప్పగా ఉంటుంది.   క్రియేటివ్ డైరెక్టర్ దిగ్రేట్ “బాపు’’ గారి దర్శకత్వంలో వచ్చిన అద్భుత పౌరాణిక చిత్రం “సంపూర్ణ రామాయణం’’ లో రంగారావు గారు తన నట విశ్వరూపాన్ని చూపారు. ఇందులో రామ, రావణ యుద్ధ సమయంలో తన వారంతా ఒక్కొక్కరుగా మరణిస్తుంటే రావణుడు పడే మానసిక వేదన, మానసిక సంఘర్షణ అమోఘం. ఒక రావణాసురునిలో నుండి పదిమంది రావణాసురులు ఒకరి తర్వాత మరొకరు బయటికి రావటం, ఆ వచ్చిన వారిలో సగంమంది మంచి చెప్పటం, సగంమంది రావణుడిలోని చెడుని, దుర్మార్గాన్ని రెచ్చగొట్టటం, వర్ణించేందుకు ఏ భాషకూ మాటలు చాలవు. ఆ శీను ఓ పదినిమిషాలసేపు ఉంటుంది .... ఒక్క రంగారావుగారు పదిమందిగా కనపడినా, మొత్తం స్క్రీన్ అంతా ఆయనే నిండి ఉన్నా ఎంత మాత్రం బోరు కొట్టకుండా, పైపెచ్చు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందా శీను. ఆ సీన్లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు.   ఆయన నట జీవితంలో మరో కలికితురాయి “నర్తన శాల’’ చిత్రంలోని కీచకుని పాత్ర. ఆ చిత్రంలో ఆయన కనిపించే పావుగంట సేపూ నిప్పులు చెరిగారు. ఈ చిత్రంలోని ఆయన నటనకు గాను జెకార్తా ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న తోలి తెలుగునటులు శ్రీ యస్.వి.రంగారావు. ఈ చిత్రంలోని తన బృహన్నల పాత్రకోసం శ్రీ రామారావు గారు భరతనాట్యం నేర్చుకుని మరీ నటించారు. ఇక్కడో విషయం మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు శ్రీ రామారావు గారికి హీరోగా మంచి ఇమేజ్ ఉంది. ఆయన శ్రేయోభిలాషులంతా బృహన్నల పాత్ర వేయొద్దని హితువు చెప్పినా, తను నమ్మిన దాని కోసం ఆయన పంతంపట్టి మరీ ఆ పాత్రను పోషించి మెప్పించిన తీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒకరిని మించి మరొకరు నటించి జనంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహానటులు వారంతా. అందుకే వారు ధన్యజీవులు ....   అసలు రంగారావు గారు సీన్లో ఉండగా మరో పాత్ర కనపడదు. దానికి ఆయన నటన, పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీ, హావ, భావ ప్రకటన అవతలి నటుని నటనకు తన రియాక్షన్ ఇలా అనేకానేక విషయాలు కారణాలుగా కనిపిస్తాయి. పాత్ర పోషణ కోసం ఆనాటి నటులు తపన పడేవారు. అందుకు ఎంతగానో కృషి చేసేవారు. అందుకే వారి కీర్తి తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుంది. ఆయన నటించిన “తాత మనవడు’’ చిత్రం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు గారి తొలిచిత్రం కావటం విశేషం. ఈ చిత్రంలో ఆయన తాతగా, మనసున్న మంచి మనిషి కీర్తి శేషులు శ్రీ రాజబాబు గారు మావడుగా నటించారు. “అనుబంధం ఆత్మీయత అంటా ఒక బూటకం’’ పాటలో రంగారావుగారి నటన హృదయాలను కదిలిస్తుంది. ప్రేక్షకుల్ని కంట తడి పెట్టిస్తుంది.   రంగారావు గారు పోషించిన మరో అత్యద్భుతమైన పాత్ర “కంసుడు’’. “యశోద కృష్ణ’’ చిత్రంలో ఆయన కంసుడిగా చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో బాల కృష్ణుడిగా నేటి నటీమణి శ్రీదేవి చాలా చక్కగా నటించింది. ఈ చిత్రం ఆయన నటించిన చివరి పౌరాణిక చిత్రం. చలన చిత్ర చరిత్రలో తెలుగు వారి కీర్తిని పదికాలాల పాటు కాపాడిన నవరస నటనా సార్వభౌమ శ్రీ యస్.వి.రంగారావు ధన్య జీవి. అంతటి మహా నటుడికి నట వారసులు లేకపోవటానికి కారణం ఆయనకు అందరూ ఆడపిల్లలు కావటమే. మళ్ళీ ఆయనే పుట్టి తన పాత్రలను మళ్ళీ మరొకోణంలో చూపించాలే తప్ప మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయటం అసంభవం. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ .... D.M.K.

ప్రముఖ దర్శక,నిర్మాత ఇ.వి.వి.సత్యనారాయణకు నివాళి

తెలుగు సినీ పరిశ్రమలో హాస్యచిత్రాలకు దర్శకత్వం వహించాలంటే హాస్యబ్రహ్మ జంధ్యాల తర్వాత అంత పేరున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యన్నారాయణ.ఆయన గత కొంత కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.ఈ నెల 19 వ తేదీన ఆయన హైదరాబాద్ ఫిలిం నగర్ లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.ఇవివి అసలు పేరు ఈదర వీర వెంకట సత్యన్నారాయణ. ఆయన జన్మస్థలం కోరుమామిడి. ఆయన 1956 జూన్ 10 వ తేదీన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన జనవరి 21 రాత్రి పది గంటలకు మృతి చెందారు.               చనిపోయే నాటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం"కత్తి కాంతారావు". ఆయన జంధ్యాల వద్ద 40 చిత్రాల వరకూ సహాయ దర్శకులుగా పనిచేసి,"చెవిలోపువ్వు" చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవటంతో, డి.రామానాయుడు నిర్మించిన "ప్రేమఖైదీ" చిత్రం ఘనవిజయం సాధించటంతో ఇ.వి.వి.కి దర్శకుడిగా మంచి బ్రేక్ లభించింది. ఆయన 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు సినీ పరిశ్రమలోని అందరు పెద్ద హీరోల చిత్రాలకూ దర్శకత్వం వహించారు.     మెగాస్టార్ తో "అల్లుడా మజాకా", నాగార్జునతో "హలోబ్రదర్", వెంకటేష్ తో"ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు", నటభూషణ్ శోభన్ బాబుతో "ఏమండీ ఆవిడొచ్చింది", రాజేంద్రప్రసాద్ తో "ఆ ఒక్కటీ అడక్కు", "అప్పుల అప్పారావు", సీనియర్ నరేష్ తో "జంబలకిడిపంబ", శ్రీకాంత్ తో కన్యాదానం", "ఆమె"వంటి చిత్రాలకు ఇ.వి.వి. దర్శకత్వం వహించారు. ఆయన హిందీలో దర్శకత్వం వహించిన ఒకే ఒక్క చిత్రం"సూర్యవంశ్"చిత్రంలో ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించారు.     "చాలా బాగుంది" చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా కూడా మారారు. "తొట్టిగ్యాంగ్, అమ్మో ఒకటో తారీఖు, కితకితలు"వంటి అనేక చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చిన్న కుమారుడు అల్లరి నరేష్ కామెడీ యువ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయనకు భార్య సరస్వతి, ఆర్యన్ రాజేష్, నరేష్ ఇద్దరు సంతానం. ఆయన అంత్య క్రియలు జనవరి 22 సాయంత్రం హైదరాబాద్ లోని మణికొండలో జరుగుతాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగు వన్ ఆ భగవంతుని ప్రార్థిస్తోంది.