దేశంలోనే రిచ్చెస్ట్ ఎంపీ..

  రాజకీయాల్లోకి వచ్చి  కావాల్సినంత సంపాదించుకోవచ్చు అని ఎన్ని సినిమాల్లో డైలాగులు వినలేదు. ఒక్కసారి పదవులు వచ్చాయంటే చాలు ఆస్తులు ఆమాంత పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ ఉపోద్ఝాతం అంతా ఎందుకంటారా..? అలా సంపాందించే ఓ ఎంపీ గారు ఏకంగా దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా అవతరించారు. ఆయన ఎవరో కాదు... బీహార్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ అలియాస్ కింగ్ మహేంద్ర. ఈయన ఆస్తి విలువ అక్షరాల 4వేల కోట్లు.  బీహార్‌ రాష్ట్రంలో రాజ్యసభకు ఆయన జేడీ(యూ) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడం ఆయనకిది మూడోసారి కావడం గమనార్హం. ఏడోసారి పార్లమెంటులో ప్రవేశించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. కింగ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో చరాస్తులు రూ.4010.21 కోట్లుగా, స్థిరాస్తులు రూ.29.1 కోట్లుగా చూపించారు.   కింగ్ మహేంద్ర తనకున్న రెండు ఫార్మా కంపెనీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో టర్మ్ డిపాజిట్లు రూ.2239 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే రూ.41 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే ఇంత సంపన్న ఎంపీ అయిన మహేంద్ర పేరుపై వాహనాలు గానీ బీమా పాలసీలు గానీ లేకపోవడం గమనార్హం. అంతేకాదు ఆయనకు ఇంకో రికార్డ్ కూడా ఉంది. అత్యధిక దేశాలు పర్యటించిన ఎంపీగా ఈయనకు పేరుంది. ఏప్రిల్ 9, 2002 నుంచి ఏప్రిల్ 8, 2003 మధ్యకాలంలో ఆయన ఏకంగా 84 దేశాల్లో పర్యటించడం విశేషం. మొత్తం 211 దేశాలను ఆయన చుట్టారు.

మృత్యువునే ఓడించాడు... కాలజ్ఞాని స్టీఫెన్‌ హాకింగ్‌ గురించి ఆసక్తిర విషయాలు..

  విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు, కాలజ్ఞాని స్టీఫెన్‌ హాకింగ్‌ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లుదా నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ దశాబ్ధాలుగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన ఈ ఉదయం కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు స్టీఫెన్‌ కుటుంబ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘మా నాన్న ఈ రోజు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఇది అత్యంత బాధాకరం’ అని స్టీఫెన్‌ పిల్లలు లూసీ, రాబర్ట్‌, టిమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.   స్టీఫెన్ హాకింగ్ గురించిన ఆసక్తికర విషయాలు..   స్టీఫెన్‌ పూర్తి పేరు స్టీఫెన్‌ విలియమ్‌ హాకింగ్‌. 1942 జనవరి 8న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన స్టీఫెన్‌.. భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌కు ఉత్పత్తి చేస్తాయని ధ్రువీకరించారు. దీన్నే హాకింగ్‌ రేడియేషన్ అని కూడా పిలుస్తారు. 1963లో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం.. ఓరోజు మెట్ల మీద నుంచి పడిపోవడంతో కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించారు. అప్పుడే  స్టీఫెన్‌ మోటార్ న్యూరాన్ వ్యాధికి గురైనట్టు డాక్టర్లు గుర్తించారు. దీని వల్ల శరీరం నెమ్మదిగా పక్షవాతానికి గురవుతుందని....రెండేళ్ల కంటే ఎక్కువ బ్రతకడని డాక్టర్లు చెప్పారు. ఆ వ్యాధి వల్ల ఆయన కేవలం కుర్చీకే పరిమితమవ్వాల్సి వచ్చింది. కానీ స్టీఫెన్ ఆత్మస్థైర్యం ముందు మృత్యువు కూడా ఓడిపోయింది. విధిని ఎదిరించి చక్రాల కుర్చీ నుంచే కదలలేని స్థితిలో ఉన్నా కూడా తన పరిశోధనలు, అధ్యయనాలను కొనసాగించారు. అయితే ఒకానొక స్థితిలో మాట్లాడటం కూడా కష్టమైపోయంది స్టీఫెన్‌ కు. దానికోసం ఓ కమ్యూనికేషన్ డివైజ్ ను కూడా రూపొందించారు. దీంతో ఆయన చేయితో సంజ్ఞలు చేస్తే.. డివైజ్‌ ద్వారా ఆయన సంజ్ఞలు అక్షర రూపంలోకి మారేవి. ఇంకా దురదృష్టం ఏంటంటే.. కొన్ని రోజులకు ఆ చేయి కూడా పక్షవాతానికి గురైంది. అయినా స్టీఫెన్‌ మాత్రం పట్టు వదలకుండా.. 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్‌ డివైజ్‌ను కంట్రోల్‌ చేశారు. ఇక స్టీఫెన్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య జానే విల్డే.  కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రోజుల్లో జానే విల్డే అనే అమ్మాయితో స్టీఫెన్‌కు పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆతరువాత కొన్ని కారణాల వల్ల 1995లో విడిపోయారు. అదే సంవత్సరం స్టీఫెన్ తనకు నర్స్‌గా పనిచేసిన మాసన్‌ ను పెళ్లి చేసుకున్నారు. అయితే 2006లో మాసన్‌తో కూడా విడిపోయారు.   ఐన్‌స్టీన్‌ తర్వాత అంతటి శాస్త్రవేత్త.. భౌతికశాస్త్రంలో ఐన్‌స్టీన్‌ తర్వాత అంత గొప్ప శాస్త్రవేత్తగా హాకింగ్‌ పేరుగాంచారు. కృష్ణబిలాలు, బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతంపై ఆయన చేసిన అద్భుత పరిశోధనలు నేటి తరం శాస్త్రవేత్తలకు మార్గదర్శనం చేస్తాయి. గ్రహాంతర వాసుల ఉనికిపై చేపట్టే పరిశోధనలు మానవాళికి ముప్పుగా పరిణమిస్తాయని పలుసార్లు హెచ్చరించారు కూడా. ఖగోళ శాస్త్రంలో ఆయన చేపట్టిన పరిశోధనలు పెను విప్లవం సృష్టించాయి. ఆయన రచించిన ‘బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ బ్రిటిష్‌ సండే టైమ్స్‌లో 237 వారాలపాటు బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. ఆయన రచించిన ఓ పుస్తకం కాలం కథ పేరుతో తెలుగులో కూడా వెలువడింది.

సునంద పుష్కర్ ది హత్యే.. బయటకొచ్చిన సీక్రెట్ రిపోర్ట్..

  కాంగ్రెస్ నేత - మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా. ఆమెది ఆత్మహత్య కాదని.. హత్యే అని..శశి థరూరే ఆమె మృతికి కారణమని వార్తలు కూడా వచ్చాయి. ఆ తరువాత ఆ విషయం గురించి అందరూ మరిచిపోయారు. ఆమెది హత్యా...? లేక ఆత్మహత్యా..? అన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె మృతికి సంబంధించి  డీఎన్ఏ పత్రిక  ఓ సీక్రెట్ రిపోర్ట్ ను సంపాదించింది. ఆ రిపోర్ట్ ఆమెది హత్యే అని చెబుతోంది.   డీఎన్ ఏ కథనం ప్రకారం... పుష్కర్  కేసులో తొలి రిపోర్ట్ ఇచ్చిన అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బీఎస్ జైస్వాల్.. సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని తేల్చి చెప్పారు. ఈ ఘటన జరిగిన లీలా హోటల్ లోని రూమ్ ను వసంత్ విహార్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ పరిశీలించి అతి ఆత్మహత్య కాదని చెప్పినట్లు ఆ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లోనూ ఆమెకు విషమిచ్చిన కారణంగానే చనిపోయిందని చెప్పడంతో సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ దీనిని హత్య కేసుగానే విచారణ చేపట్టాలని సరోజిని నగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఒంటిపై మొత్తం 15 గాయాలు ఉన్నాయి. అందులో పదో నంబర్ గాయం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏర్పడినది. 12వ నంబర్ గాయం చూస్తే ఎవరో కొరికినట్లుగా ఉంది. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లుగా ఒంటిపై గాయాలు ఉన్నాయి` అని ఆ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. ఇక ఈ రిపోర్ట్ ను హోంమంత్రిత్వ శాఖకు కూడా అప్పగించినా....ఆమె మృతికి కారణం తెలిసిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ రహస్య నివేదికలో పోస్ట్ మార్టమ్ - కెమికల్ - బయోలాజికల్ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఇది హత్యేనని తేల్చినా.. పోలీసులు మాత్రం కేసు పెట్టలేదు. అంతేకాదు ఆమె శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించారా లేక నోటి ద్వారానా అన్నదానిపై విచారణ జరపాలని కూడా ఈ రిపోర్ట్ స్పష్టంచేసింది. మరి ఇది హత్యే అని తెలిసినా దీని వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి. మరి ఈ రిపోర్ట్ బయటకు వచ్చినా.. వారిపై చర్యలు తీసుకునేది ఏం ఉండదు.. ఏదో రెండు రోజులు మాట్లాడుకుంటారు.. ఆ తరువాత మళ్లీ మర్చిపోతారు..

ఫ్లోలో మోడీని తిట్టిన సోము.. తప్పు పట్టిన టీడీపీ..

  బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో టీడీపీ నేతలపై తరుచూ విమర్శలు గుప్పిస్తూ ఫేమస్ అయిపోయారు. అయితే రెండు మూడు రోజుల నుండి సైలెంట్ గా  ఉన్న వీర్రాజు కు మీడియా ముందు కనిపించకపోవడంతో నిద్రపట్టినట్టు లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చారు. ఇక మీడియా ముందు కనిపిస్తే చాలు తన నోరు కంట్రోల్ లో ఉండదని తెలుసు కదా. మీడియా ముందు కనిపించాలన్న ఆత్రం... ఏదో ఒక రకంగా ఎవరో ఒకర్ని నిందించి ఫేమస్ అయిపోవాలన్న తొందర. అదే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఎప్పటిలాగే విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల గురించి ప్రస్తావించారు. ఇక టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఆ కోపంలోనే ప్రధాని మోడీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గానికి చెందిన ప్రధాని, నీచ కులానికి, గాండ్ల కులానికి చెందిన మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని.. ఆయనపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం బాధాకరమని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే వీర్రాజు గారు దొరికిపోయారు. ఒక కులాన్ని నీచ కులమని ఎలా సంబోధిస్తారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్  నిలదీశారు. దానికి రాజుగారు మోడీని నీచకులమని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారని దానినే గుర్తు చేశానని ఏదో కవరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే అవన్నీ వర్కవుట్ అవ్వవని.. అధిష్టానం వరకూ మ్యాటర్ వెళితే పార్టీలో ఉంచడం కష్టమని భావించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. టీడీపీ ఎమ్యేల్యేలు ఫ్లెక్సీలు పెడితే... మణిశంకల్ అయ్యర్ ను గుర్తుచేయడం ఏంటో రాజుగారికే తెలియాలి.   మరి గతంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను మోడీ గుజరాత్ ప్రచారంలో ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక కొత్తగా రాజ్యసభకు వెళ్లిన ఏపీకి చెందిన జివిఎల్ నరసింహరావు అయితే ఏకంగా పెద్ద డ్రామానే చేశారు. దేశ ప్రధానిని ఇలా అనడం చాలా బాధాకరమైన విషయం అని.. అందుకు తాను చాలా వ్యథ చెందుతున్నట్టు తెలిపారు. కాసేపు మౌనం కూడా పాటించారు. ఇంత డ్రామా చేసిన ఆయన.. ఇప్పుడు రాజు గారి మాటలకు ఏం చేస్తారో చూద్దాం.. మరి దీని ఎఫెక్ట్ రాజుగారిపై పడుతుందో.. లేదా మన పార్టీవాడే కదా అని లైట్ తీసుకుంటారేమో చూద్దాం..

తాగుబోతు ఎమ్మెల్యేలకు చెక్..

  తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెల్ నేతలు చేసిన రభస మాయని మరకగా నిలిపోయింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన పనికి పార్టీ మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్న సమయంలో..అక్కడే ఉన్న కోమటిరెడ్డి హెడ్ సెట్ ను తీసి పోడియం వైపు విసిరాడు. అది కాస్త వెళ్లి కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌట్ కంటికి తగలి గాయమైంది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక కాంగ్రెస్ నేతలు చేసిన ఈ పనికి టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ పక్కనున్న సభాపతిని గాయపర్చడమంటే.. అది గవర్నర్ మీద దాడి జరిగినట్టే అని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే పెద్ద న్యూస్ అనుకుంటుంటే.. మరో ఆసక్తికరమైన విషయం ఒకటి తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలోకి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాగి తూలుతూ వస్తున్నారని, ఒక ఎమ్మెల్యే ఏకంగా సీఎల్పీ లీడర్ జానారెడ్డి మీద పడిపోయారని చెప్పుకొచ్చారు తెరాస లెజిస్లేటివ్ కౌన్సిల్ విప్ పల్లా రాజేశ్వర్. గవర్నర్ ప్రసంగ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘ఆన్’లో వున్నారన్న పల్లా వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారాన్ని రేపాయి. పల్లా వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి”దమ్ముంటే నేను తాగి సభకొచ్చానని ప్రూవ్ చేయండి.. నేను కాదు మీరూ, మీ సీఎం పక్కా తాగుబోతులు… ప్రగతిభవన్లో ప్రతిరోజూ మద్యం ఏరులై పారుతున్న విషయం ఎవరికీ తెలీదనుకుంటున్నారా?’ అంటూ కోమటిరెడ్డి రంకెలేశారు. దీంతో ఒకరి మీద తాగుబోతులంటూ విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో అసెంబ్లీలో మరో కొత్త రూల్ వచ్చేలా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకలు. అదేంటంటే... బ్రెత్ ఎనలైజింగ్. సభకొచ్చే ప్రతీ సభ్యుడు.. బ్రెత్ ఎనలైజర్ తో ఊదించుకుని వచ్చేలా కొత్త నిబంధన అమల్లోకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆఖరికి అసెంబ్లీల్లో కూడా బ్రెత్ ఎనలైజింగ్ అంటే ఎంతు దుస్థితి ఏర్పడిందో అర్ధంచేసుకోవచ్చు..

జగన్ రాజీనామా వెనుక ఇంత ప్లానా...?

  జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పేదొకటి... చేసేదొకటి. తన పనులకు ఆటంకం రాకుండా ఏవో కుంటిసాకులు వెతుక్కుంటూ..ఏవో చెబుతుంటాడు. తన పాదయాత్ర కోసం అలాంటి సాకే చెప్పాడు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేస్తేనే కానీ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదని చెప్పాడు. అయితే ఆ తరువాత పాదయాత్ర కోసమే జగన్ ఈ ప్లాన్ వేశాడులే అని అందరికీ అర్దమైపోయింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి ఓ ప్లానే వేయడానికి రెడీ అయ్యాడు. అదేంటంటే... ప్రత్యేక హోదా కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడట. వినడానికి కాస్త కామెడీగా ఉంది కదా. కామెడీగా ఉన్నా జగన్ వేసిన ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. అసలు జగన్ ఉన్నట్టుండి రాజీనామా పల్లవి ఎందుకు అందుకున్నాడబ్బా అని ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. అదేంటంటే.. గత డిసెంబర్ లో సుప్రీంకోర్టు.. ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టులకు కొన్ని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్చి నుంచే పని ప్రారంభించాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే...  తెలుగురాష్ట్రాలు, కేరళలో వంద మందిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరగనుంది. ఇక లిస్టులో పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు కూడా ఉన్నారు.   కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులన్నీ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి... ఆయన ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఎమ్మెల్యే కాబట్టి.. సీరియస్ కేసులు కాబట్టే విచారణ జరగడం ఖాయం. ఇక దీన్ని నుంచి తప్పించుకునేందుకు జగన్ రాజీనామా అంటూ కొత్త పాట అందుకున్నాడని రాజకీయ విశ్లేషకలు చర్చించుకుంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రారంభమై… కేసుల బదిలీ జరిగే లోపు.. తాను ఎమ్మెల్యేను కాదు.. ప్రజాప్రతినిధిని కాదని నిరూపించాలని జగన్ డిసైడయ్యాడట. అందుకే జగన్ ఏ క్షణమైనా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్ బాగానే ప్లాన్ వేశాడు కానీ.. అది వర్కవుట్ కావాలి కదా. తాను ఆవేశపడి రాజీనామా చేసినా... దాన్ని స్పీకర్ ఆమోదించాలి కదా. జగన్ ఆలోచన ఏంటో తెలుసు కాబట్టి.. ఆమోదించకపోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే జగన్ జాతకం ఏంటో ఎన్నికలలోపే తేలిపోయేటట్టే కనిపిస్తోంది.

ఫిక్సయిపోండి... కేటీఆర్ సీఎం!‌

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే లెవల్లో సూపర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో ఆయన చెప్పకుండానే చెప్పేశారు. ముసుగులో గుద్దులాట లేకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి మరెవరో కాదు... కేటీఆర్. 2019 ఎన్నికల తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా వుండరు. అంటే అర్థం అయన ఎన్నికలలో ఓడిపోతారు అని కాదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం కోసం ఢిల్లీకి వెళ్తారు... అదన్నమాట.  2019 ఎన్నికలలో తెరాస అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరు అవుతారు? ఇంకెవరూ కేటీఆరే. ఈ విషయాన్ని కెసిఆర్ చెప్పకనే చెప్పారు. అయన చెప్పిన దాని ప్రకారం 2019 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఫుల్లుగా డెవలప్ చేస్తారు. ప్రధాని మోడీ ఎలాగైతే గుజరాత్ రాష్ట్రాన్ని డెవలప్ చేసి డిల్లీ వెళ్ళారో. అదే టైపులో కెసిఆర్ కూడా తెలంగాణాని 2019 లోపు డెవలప్ చేసేసి ఢిల్లీకి వెళ్లారుట. తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు ఇక్కడున్న సమర్థుడికి అప్పగిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో నాలుగైదు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి దూసుకు వెళ్తున్న కేటీఆర్ కి మించిన సమర్థుడు ఇంకెవరు వున్నారు చెప్పండి. కెసిఆర్ ఢిల్లీ వెళ్ళడం అంటే ఏంటి? ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించడం అని అర్థం చేసుకోవాలి. కెసిఆర్ ప్రధాని, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి... అబ్బ.. చూడటానికి రెండు కళ్లూ చాలవు. 2019 సంవత్సరం త్వరగా వస్తే బాగుండు.

జగన్ పై పవన్ పంచ్ లు... జగన్ ను మోడీ డైరెక్ట్ చేస్తున్నారా..?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై ఓ రేంజ్ లో పంచ్ డైలాగ్స్ విసిరారు. మంగళగిరిలో తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు పవన్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన్ని పలువురు పలు ప్రశ్నలు అడగగా.. ఆయన వాటికి సమాధానం చెప్పారు. అయితే ఆ సమయంలోనే జనసేన పార్టీ వెనుక కథా, స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబే ఉన్నారని జగన్ చాలా సందర్భాల్లో అన్నారు.. దానికి మీ సమాధానం ఏంటని సాక్షి  విలేకరి గుచ్చి గుచ్చి అడుగగా... దానికి పవన్ చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చారు. నా వెనుక చంద్రబాబు ఉంటే.. జగన్ వెనుక నరేంద్ర మోడీ ఉన్నారా.. ఆయనకు మోడీ గారు దర్శకత్వం వహిస్తున్నారా..? జగన్ ను మోడీ నడిపిస్తున్నారా..? అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు.. ఇంకా మీరు టీడీపీ తో సంబంధాలు లేవని స్ఫష్టంగా చెప్పడం లేదు కదా.. అని అడుగగా.. నేనెలా ఆలోచిస్తానో బయటకు ఎందుకు చెప్తాను.. వాళ్లు చెబుతున్నారా.. అని అన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తరువాత చెప్పాలి అని మళ్లీ అడుగగా... ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతాను కానీ.. నేను ఇలా ఆలోచిస్తున్నానండి.. నా ఉనికి ఇదండీ అని చెప్పాలా.. వాళ్లు చెబుతున్నారా అని గట్టిగానే సమాధానం చెప్పారు. అంతేకాదు  మీరు అర్దం చేసుకోవాల్సి న విషయం ఏంటంటే.. మానాన్నేం సీఎం కాదు... నా దగ్గర దోచుకున్న డబ్బులు లేవు..పార్టీని వెంటనే నడిపించడం అంత తేలిక కాదు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాం.. ఒక్కొక్కటి ఏర్పరుచుకుంటున్నాం...అన్ని తట్టుకొని ప్రజల నమ్మకాన్ని సాధించి ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టం.. దానికి చాలా సహనం, ఓపిక కావాలి.. నాకు చాలా సహనం, ఓపిక ఉన్నాయి అని ముగించారు. కెలికి మరీ తిట్టించుకోవడం అంటే దీన్నే అంటారు..

అమరావతిలో ఇల్లు అందుకే...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి సమీపంలో కాజా వద్ద  తన సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తన భార్య అన్నా లెజినోవా, ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చిన ఆయన వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజ జరిపించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...   మానాన్న పనిచేసిన ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయండ చాలా సంతోషంగా ఉంది...ఇంటితో పాటు పార్టీ కార్యాలయం నిర్మించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అంతేకాదు ఇక్కడే ఎందుకు ఇల్లు కట్టుకోవాలని భావించారో కూడా వివరించారు. మంగళగిరి రాజకీయ కేంద్రంగా మారింది...నా రాజకీయ ప్రయాణంలో కీలక సమయం ఆసన్నమైంది.. ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకన్నానని చెప్పారు.అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. ఏవైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రజలు తన వద్దకు రావాలన్నా ఇక్కడ ఉంటేనే సులభమవుతుందని చెప్పారు.   ఇంకా పవన్ ఇల్లు ప్రత్యేకతల విషయానికి వస్తే... రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక హంగులతో ఈ భవంతి నిర్మాణం ఉండబోతుంది. చుట్టూ ఎనిమిది అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణగా ఉండే ఈ భవంతిలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచిపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తం మూడు అంతస్థుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పనివారి నివాసానికి గదులు ఉంటాయని సమాచారం. తరువాతి ఫ్లోర్ లో మరో చిన్న మీటింగ్ హాల్ తో పాటు కిచన్, డైనింగ్ హాల్, బెడ్ రూములు తదితరాలు ఉంటాయని, ఆపై అంతస్థులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి, మిగతాదంతా ఖాళీగానే ఉంచనున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రాల నిధుల్ని గుజరాత్‌కి తరలిస్తున్న మోడీ

ఉత్తరాది పెద్దలు దక్షిణాదిని చిన్న చూపు చూడడం అనాదిగా వస్తున్న వ్యవహారం. నిధుల కేటాయింపుల దగ్గరి నుండి, మంత్రుల్ని నియమించడం, కొత్త ప్రాజెక్ట్ లకు ఆర్ధిక సహాయం వంటి విషయాల్లో ఎప్పుడు మొండి చేయి ఇస్తూ వస్తుంది. అసలు దక్షిణాది రాష్ట్రాలు అంటే పరాయి దేశంలా వ్యవహరిస్తుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాట ఇచ్చి, దాటిన మోడీ ప్రభుత్వం మరో తప్పు చేసి పార్లమెంట్ సాక్షిగా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ప్రతిసారి రాష్ట్రాలకి 45 శాతం నిధులు కేటాయిస్తున్నామని చెప్పే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఏయే రాష్ట్రాలకు ఎంత కేటాయించారో లెక్కలు చెప్పారు. దాంతో పది శాతం కోత పెడుతున్న విషయం బహిర్గతమైంది. ఇంతకీ, ఇలా కోత పెడుతున్న డబ్బులన్నీ ఏం చేస్తున్నట్టు? ఈ మిగులు నిధులన్నీ మోడీ సొంత రాష్ట్రమయిన గుజరాత్ కి తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రతి సారి, గుజరాత్ కి వరాలు అందిస్తూ గుజరాత్ కి మాత్రమే ప్రధాన మంత్రి గా వ్యవహరిస్తున్న మోడీ, ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలని విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే, మోడీ ప్రభుత్వం ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒంటెద్దు పోకడలా వ్యవహరిస్తున్న మోడీ, చరిత్ర హీనుడిగా మిగిలి పోవాల్సి వస్తుంది.

పోతేపోండి.. మాకు వైసీపీ ఉంది...!

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఇచ్చేంత వరకూ పోరాటం ఆగేది లేదని... అవసరమైతే తమతో తెగదెంపులు చేసుకుంటామని టీడీపీ చెబుతుంది. అయితే మొదట ఈ విషయంలో కాస్త వెనుకడుగు వేసిన ఇప్పుడు మాత్రం కాస్త భిన్నంగానే వ్యవహరిస్తుంది. ఆందోళనలు ఎంత ఉదృతం చేసినా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. అస్సలు చూసినట్టుగానే వ్యవహిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులు రాజీనామానలు చేసిన ఏం లై తీసుకున్నారు. రాష్ట్రపతికి పంపించారు. ఇక ఆయన కూడా ఆమోదించారు. అయితే అసలు బీజేపీ ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటబ్బా అని అందరూ అనుకుంటుండగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.   కావాలనే బీజేపీ అలా వ్యవహరిస్తుందోని... టీడీపీతో కటీఫ్ కే చూస్తుందోని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ. టీడీపీ పోతే పోయింది.. వైసీపీ ఉందిలే అని అనుకుంటున్నారట. అంతేకాదు.... నిధులు, గుజరాత్ కి, మహారాష్ట్రకి ఇచ్చుకుంటాం.. మీకివ్వం.. అలాగని విడిపోతారా.. విడిపోండి.. మాకు వైసీపీ మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉంది.. మాతో చేతులు కలపాలని చూస్తుంది.. టీడీపీని వదిలేయమని.. మనిద్దరం కలిసి పనిచేద్దామని ఎప్పటినుండో రాయబారాలు పంపుతోంది అని ఓ బీజేపీ కీలక వ్యాఖ్యానించినట్టు రాజకీయ వర్గాల టాక్. దానికి తోడు..  వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు కనుక ఎక్కువ సీట్లు వస్తే ఎన్నికల అనంతరం బీజేపీకి వద్దతిచ్చి ప్రత్యేక  హోదా సాధిస్తామని చెప్పుకొస్తున్నారు. అంటే రెండు పార్టీలు పొత్తుకు సిద్దంగా ఉన్నాము.... మీరు పోతే పోండి అని చెప్పకనే చెబుతుంది. ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.   అంతేకాదు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జగన్ పై పెట్టిన కేసుల్లో క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు, సీబీఐ చర్యల నిలుపుదల, జగన్ రాజకీయంగా ఎదిగేందుకు సహకరించడం వంటి ప్రయోజనాలను ఎన్డీయే సర్కారు అందిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన 34.6 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జప్తు విషయంలో ఈడీ అపిలేట్ అథారిటీ క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ అంటే తన మీద ఉన్న కేసుల నేపథ్యంలో బీజీపీతో పొత్తు సిద్దమయ్యాడు. మరి బీజేపీ వైసీపీలో ఏం చూసి పొత్తుకు రెడీ అయ్యిందో. అంటే తమ చెప్పు చేతల్లో ఉంటారని మోడీ చాలా దూరం ఆలోచించి ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు ఉన్నారు. అలా చేయాలంటే అసలు వైసీపీ అధికారంలోకి రావాలి కదా. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వైసీపీ పరిస్థితి ఏపీలో ఏంటో తెలిసు.. అలాంటి వైసీపీ ని పక్కన పెట్టుకొని మోడీ గారు ఏం చేద్దామనో.. పాపం మోడీ ఇలానే మూర్ఖత్వంతో వ్యవహరిస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

వీళ్ల యాక్టింగ్ కు ఆస్కార్ ఇవ్వొచ్చు...

ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పెద్ద డ్రామానే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ డ్రామాలో ఎవరి పాత్రల్లో వాళ్లు మాత్రం నటించడం కంటే.. జీవిస్తున్నారు అని చెప్పొచ్చు. అలా ఉంది ఒక్కొక్కరి ఫెర్మార్మెన్స్. ఎవరెవరి పెర్ఫర్మెన్స్ ఎలా ఉందో చూద్దాం.. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడయ్యా బాబు అంటూ నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా... నిమ్మకు నిరెత్తన్నట్టు వ్యవహరిస్తుంది కేంద్రం. అంతేకాదు పాడిందే పాటరా... అన్నసామెత ప్రకారం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు... అన్ని రాష్ట్రాల్లాగే ఏపీ కూడా.. సెంటి మెంట్ తో ఏం చేయలేం అని తెగేసి చెబుతుంది. మళ్లీ ఏపీకి అండగా ఉంటాం అని కబుర్లు చెబుతుంది. సరే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పింది..మరి టీడీపీ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటుందా అంటే ఆ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వరు. ఇదిగో విడిపోతారు... అదిగో విడిపోతారు.. ఇక విడిపోవడం ఒక్కటే మిగిలింది అన్న వార్తలు వస్తాయి తప్పా...ప్రత్యేక హోదా ఇవ్వనందుకు టీడీపీ గట్టిగి మీతో విడిపోతున్నాం అని చెప్పనూ లేదు. ఇక ఇప్పుడు రాజీనామాల డ్రామా తెరపైకి తెచ్చారు. నిజానికి చంద్రబాబుకే ఏపీకి ఏం కావాలో తేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. మొదట స్పెషల్ స్టేటస్ అన్నారు.. తరువాత కేంద్రం ఏం మాయ మాటలు చెప్పిందో ఏమో కానీ స్పెషల్ ప్యాకేజీకి మొగ్గు చూపారు. పోనీ అదీ సరిగ్గా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు చంద్రబాబు. అప్పుడు అసలు ప్యాకేజీకి ఒప్పుకోకపోతే ఇప్పుడు ఈ సమస్యే ఉండేది కాదు. కేంద్రానికి ఇప్పుడు అదే లూప్ హోల్ దొరికింది. అప్పుడు చంద్రబాబుకి చెప్పాము మేము ఆయన ఒప్పుకున్నారు అని. ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు.. రాజీనామాలు, పోరాటాలు, అసెంబ్లీలో ఆందోళనలు అంటూ హడావుడి చేస్తున్నారు.   ఇక జగన్ మోహన్ రెడ్డిగారి తీరు చెప్పనక్కర్లేదు. ఎంతసేపు చంద్రబాబు పై విమర్శలు గుప్పించడమే జగన్ గారి టార్గెట్. కానీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన కేంద్రంపై.. మోడీ పై ఒక్క మాట కూడా మాట్లాడరు. విమర్శించరు. ఎందుకంటే టీడీపీ విడిపోతే వెంటనే బీజేపీ తో దోస్తీ కట్టాలని చూస్తున్నారు కదా. ప్రత్యేక హోదా కోసం మేం రాజీనామాలు చేస్తాం.. మీరు రాజీనామాలు చేస్తారా అంటూ.. అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నీ లెక్కలు, కాలిక్యూలేషన్స్ వేసుకొని తను సేఫ్టీ జోన్ లో ఉండేలా ప్లాన్లు వేస్తారు. మరోసారి మోడీ పై విశ్వాసం ఉంది ప్రత్యేక హోదా ఇస్తారని అంటాడు. అంత నమ్మకం ఉంటే... ఒక్కసారి వెళ్లి జగన్ మాట్లాడితే ఇన్నీ సమస్యలు ఉండవు కదా..   ఇవన్నీ ఒకటైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రూటు సేపరేటు. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్పుడప్పుడు కొన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి మాత్రం ఎందుకో రాలేకపోతున్నారు ఆయన ఇంకా. ఇక ప్రత్యేక హోదా విషయంలో ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా..కేంద్రం అబద్దం చెబుతుందా అని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద తలకాయలతో కలిసి ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక వారు అన్ని లెక్కలు చూసి.. ఓ నివేదిక తయారు చేసి అందులో కేంద్రం ఏపీకి ఇచ్చింది ఏం లేదని తెలిపింది. వాళ్లు అంత కష్టపడి నిజాన్ని చెప్పినా పట్టించుకునే గతి లేదు. ఇక రెండు రోజులు హడావుడి చేశారు.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మళ్లీ గుర్తొచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తారు.   ఇక కాంగ్రెస్ ది ఒక గోల.. రాష్ట్రాన్ని విడగొట్టి చేసుకున్న పాపానికి ఇప్పటికీ ఫలితం అనుభవిస్తుంది.. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతిస్తున్నాం.. అని మేం అధికారంలోకి వస్తే మొదట చేసే పని ప్రత్యేక హోదా ఇవ్వడమేనని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. మొత్తానికి అటు కేంద్ర నాయకులు... ఇటు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి జనాల్ని పిచ్చేళ్లని చేస్తున్నారన్న విషయం మాత్రం అర్ధమైపోయింది. వాళ్లకి కావల్సినప్పుడు, అన్నీ చూసుకొని, రాజకీయ ప్రయోజనాలను లెక్కేసుకొనే ఏ స్టెప్ అయినా తీసుకుంటారు. అప్పటి వరకూ వీళ్ల ఆస్కార్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ లు చూడాల్సిందే.

తొడగొట్టి ఛాలెంజ్ విసిరిన జేసీ..

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది హైలెట్ అవ్వాల్సిందే. తన మాటలతో, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి హైలెట్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జైట్లీ నిన్న ప్రెస్ మీట్లో మళ్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడంతో... ఈరోజు ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. అంతేకాదు రాజీనామాలకు సైతం సిద్దమయ్యారు. దీనిలో భాగంగానే అందరూ పార్లమెంట్ బయటనే ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలకు దిగారు. ఇక ఈ సందర్బంగా జేసీ.. అక్కడే ఉన్న వైసీపీ ఎంపీలకు ఓ సవాల్ విసిరారు. ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డి టిడిపి మంత్రులు రాజీనామా చేస్తారనడం.. అవన్నీ డ్రామాలు అని విమర్శించిన నేపథ్యంలో దానిపై స్పందించిన జేసీ.. అక్కడే ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేస్తోన్న వైకాపా ఎంపీల వద్దకు వెళ్లి... ఏమయ్యా..మేము డ్రామాలు ఆడుతున్నామా...? మీరేం చేస్తున్నారు...? ఇక్కడ నిలబడి...ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు..? ఇదేనా మీరు చేసే ధర్నా..అంటూ..వారిని ప్రశ్నించారు. అంతేకాదు.. తాము ఇప్పుడే రాజీనామాలు చేస్తామని...మీకు దమ్ముంటే...ఇప్పుడే..రాజీనామాలు చేయాలని మీసం తప్పి..తొడకొట్టి సవాల్‌ చేశారు. దానికి వైసీపీ నేతలు మేము 21న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని ఏప్రిల్‌6న రాజీనామాలు చేస్తున్నామని చెప్పడంతో.. ఆగ్రహానికి గురైన జేసీ మీరు డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి గమనించిన పార్లమెంట్‌ సిబ్బంది గొడవ జరుగుతుందేమో అని భయపడి జేసీ వారించి పార్లమెంట్ లోపలకి పంపించేశారు. ఏది ఏమైనా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అందరూ కలిసి పెద్ద డ్రామానే నడిపిస్తున్నారు. ఎవరి తగ్గ పాత్రల్లో వాళ్లు నటిస్తున్నారు... ఆఖరికి ఏం జరుగుతుందో చూద్దాం...

వీళ్ళకి ఏడుపొక్కటే తక్కువ!

  ఏడవలేక నవ్వే ముఖాలు ఎలా వుంటాయో తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్ళా్ల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుల ముఖాలు చూస్తే చాలు. బీజేపీతో స్నేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కటీఫ్ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరికీ మంత్రిపదవులకు రాజీనామాలు చేయక తప్పలేదు. నాలుగేళ్ళుగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా మంత్రి పదవులు వెలగబెట్టిన వీళ్ళిద్దరూ లబోదిబోమంటూనే మంత్రిపదవులు వదిలేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే చంద్రబాబు తన మంత్రివర్గంలో పని సరిగా చేయలేకుండా వున్న మంత్రులకు నిరంతరం క్లాసులు తీసుకుంటూ వుంటారు. కొంతమంది మంత్రులను గతంలో బాధ్యతల నుంచి తప్పించిన సందర్భాలు కూడా వున్నాయి. చంద్రబాబుకు భయపడి మంత్రులు తమ బాధ్యతలలో నిరంతరం నిమగ్నమై వుండేవారు. అయితే కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు మాత్రం ఎలాంటి భయం, ఇబ్బంది, చంద్రబాబు చేత క్లాసుల సీను లేకుండా మంత్రి పదవులను ఎంజాయ్ చేశారు. మిత్రపక్షం నుంచి మంత్రులుగా వున్న సౌలభ్యాన్ని పూర్తిగా అనుభవించారు. తమ పార్టీకి చెందిన నాయకులు టీడీపీని దారుణంగా విమర్శిస్తున్నప్పటికీ వాటిని ఖండించకుండా మౌనం వహించారు. ఎలాంటి టార్గెట్స్, ర్యాంకుల ఇబ్బంది లేకుండా నాలుగేళ్ళు మంత్రులుగా ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తమ పదవులను వదిలిపెట్టాల్సి రావడంతో వీళ్ళకి ఏడుపు ఒక్కటే తక్కువయింది.   టీడీపీ ప్రభుత్వంలో వున్న ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు సరే... ఇంకా రాజీనామాలు చేయాల్సిన వాళ్ళ లిస్టు బాగానేవుంది. టీడీపీ సహకారంతో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్ సాంకేతికంగా రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీ నాయకులు చాలామంది టీటీడీలో బోర్డు సభ్యులుగా పదవులు పొందారు. ఇంకా 137 మంది టెంపుల్ కమిటీ మెంబర్లుగా వున్నారు. పలు కార్పొరేషన్లకు బీజేపీ నాయకులు కూడా ఛైర్మన్లుగా వున్నారు... ప్రభుత్వ పదవులు పొందిన అనేకమంది బీజేపీ నాయకులు వున్నారు.. ఇప్పుడు వాళ్ళందరూ రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోవడం అంటే ఇదే.. ఎప్పుడో ఎన్నికల్లో గెలుస్తామని ఇప్పుడున్న పదవులు మొత్తం పోగొట్టుకున్నారు.

ఇక మా సత్తా చూపిస్తాం...

  ఇంతకాలం గొలుసులతో కట్టేసినట్టుగా కదల్లేకుండా వున్న టీడీపీ క్యాడర్ ఇక రెచ్చిపోబోతోంది.. ఇంతకాలం తమను సూటిపోటి మాటలతో హింసించిన బీజేపీ నాయకుల చెవుల్లో తుప్పు వదిలిపోయేలా చేయడానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధమవుతున్నారు. మాటకు మాట చెప్పడానికి, వాళ్ళ స్థాయి ఏమిటో వాళ్ళకి అర్థం అయ్యేలా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకాలం భరించిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆకలిగొన్న సింహాల్లా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కటీఫ్ చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం సరైన సమయంతో తీసుకున్న సరైన నిర్ణయంగా టీడీపీ కేడర్ భావిస్తోంది. కాస్కోండి బీజేపీ నాయకుల్లారా... టీడీపీ సింహాలు వేటకు దిగబోతున్నాయి.   నాలుగేళ్ళ క్రితం టీడీపీ, బీజేపీ మధ్య స్నేహం కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌ని అడ్డదిడ్డంగా విభజించడానికి ఒక కారణమైనప్పటికీ బీజేపీతో స్నేహం చేయడానికి ముందుకు వచ్చింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తే బాగానే వుండేది. అయితే మధ్యలో బీజేపీకి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలన్న అత్యాశ మొదలైంది. అసలు ఏపీలో బీజేపీ ముఖం చూసేవాళ్ళే లేరు. అయినప్పటికీ టీడీపీతో స్నేహం చేసినందుకు జనం ఓట్లేశారు. ఆ వాస్తవాన్ని తెలుసుకోలేని బీజేపీ నాయకులు వాపునే బలుపని అనుకుంటూ, తమకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సత్తా వుందని భ్రమపడింది. అప్పటి నుంచి టీడీపీ మీద బీజేపీ నాయకులు బాహాటంగా విమర్శలు చేస్తూ వచ్చారు. వాళ్ళ విమర్శలకు హద్దూపొద్దూ లేకుండా పోయింది. బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు పరిధిని దాటుతున్నాయని టీడీపీ క్యాడర్ బాధపడింది. వారిమీద ఎదురుదాడిచేసే అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ అధినేత చంద్రబాబును గత కొంతకాలంగా కోరుతూ వస్తున్నారు. అయితే ఓర్పు వహిస్తున్న చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకుల మీద విమర్శలకు దిగవద్దని క్యాడర్ని వారిస్తూ వస్తున్నారు. ఇక బీజేపీకి చంద్రబాబు నాయుడు గుడ్ బై చెప్పడంతో టీడీపీ క్యాడర్ ఇక రెచ్చిపోబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వున్న బలమైన టీడీపీ కేడర్ని ఎదురొడ్డి నిలిచే సత్తా బీజేపీకి లేదు. ఇక వారు కూడా గతంలో మాదిరిగా నోటికొచ్చినట్టు మాట్లాడి నెగ్గే పరిస్థితి లేదు.

మీ ఛానెళ్లను రావొద్దన్నా... ఎందుకొచ్చారు...

  సాధారణంగా రాజకీయాలకు, మీడియాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. నిజానికి ఒక్కో పార్టీకి ఒక్కో ఛానెల్ ఉంటుంది...వీటి పని పక్క పార్టీలను తిట్టడం... తమ పార్టీలకు ఫేవర్ గా ఉండటం.. భజన చేయడమే. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా..? వైసీపీ అధినేత జగన్ వల్ల చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ జగన్ ఏం చేశాడనుకుంటున్నారా..?   జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంతరావూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక మీడియా సమావేశం కాబట్టి అందరూ ఛానెల్స్ వాళ్లు వస్తారు. అలాగే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రతినిధులు కూడా వెళ్లారు. ఇక మీడియా సమావేశానికి వచ్చిన జగన్ అక్కడ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే.. ఆంధ్రజ్యోతి నుంచి ప్రసాద్, ఏబీఎన్ చానల్ నుంచి సురేష్ ఈ సమావేశానికి వచ్చారు. ఇక వారిని అన్నా అని సంబోధించిన జగన్... తన మీడియా సమావేశాలకు రావద్దని ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు ఎప్పుడో చెప్పాను.. కానీ మీ ఇద్దరూ రావడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ, లెట్స్ గో దిస్ మూమెంట్..  సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా, ఇన్టెన్షనల్ గా మీరు రాతలు రాశారు... దానిపై కోర్టులో కేసు జరుగుతూనే ఉంది ఇంకా... కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ ను, ఏబీఎన్ అనే చానల్ ను వైఎస్ఆర్ సీపీ ఎప్పుడో బాయ్ కాట్ చేసింది. వారి పేపర్ లో రాసే రాతలు, టీవీలో చూపే వార్తలను నమ్మవద్దని ఎన్నోసార్లు చెప్పాను. సో మీరు ఇక్కడికి రావడం కరెక్ట్ కాజు... ఎలాగూ వచ్చారు కాబట్టి కేక్ తిని పొండి" అని అన్నారు. మొత్తానికి జగన్ కు ఆ ఛానెళ్ల మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మరోసారి బయట పడింది.

డైరెక్ట్ గా మోడీనే టార్గెట్... మనిషిగా మారుద్దాం..

  ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర మంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీకి తాము అనుకూలంగా ఉన్నామంటూనే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పాడిన పాటే పాడుతుంది. దీంతో మోడీ పేరు ఎత్తితేనే ప్రస్తుతం ఏపీ ప్రజలు ఆవేశంతో ఊగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ.. చిన్నచూపు చూస్తుందన్నది ప్రతి ఒక్కరి వాదన. ఇప్పటికి చాలా మంది నేతలే మోడీపై ఈ విషయంలో విమర్శలు గుప్పించారు. తెలుగు వారంటే ఎందుకంత చులకన అని పలువురు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో ఓ సినిమా డైరెక్టర్ కూడా చేరిపోయారు. ఆయనెవరో కాదు... దర్శకుడు కొరటాల శివ. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం తీరుపై స్పందిస్తూ.. ఓ పోస్ట్ చేశాడు.  అది కూడా డైరెక్టుగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ. ఇంతకీ  శివ పెట్టిన ట్వీట్ ఏంటంటే... "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి, ఆయన్ను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్?" అని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సరైన సమయంలో సరైన పోస్టును పెట్టారంటూ ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితం తన కొత్త చిత్రం ‘భరత్ అను నేను’ టీజర్‌ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్సే వచ్చింది.

ఆ ఒక్క విషయం మాత్రం అడగను..!

  ఏపీ ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇంత పోరాటం చేస్తున్నా... కేంద్రం మాత్రం మరోసారి ఏపీకి షాకిచ్చింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం.. ఎన్ని ఉద్యమాలు చేసినా హోదా సాద్యం కాదంటూ తేల్చి చెప్పేశారు. గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని మొండిచెయ్యే చూపించింది. దీంతో రెండు పార్టీలు ఏ క్షణంలో అయినా విడిపోవచ్చు అనే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ రోజు అసెంబ్లీలో విభజన హామీలపై మాట్లాడిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురుడు పోసి తల్లిని చంపేశారని అప్పట్లో మోడీ అన్నారు..ఆ విషయమే ఇప్పుడు అడిగాను.. కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిందే.. ఎలాంటి రాజీ లేదు అని అన్నారు. అంతేకాదు...  రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన భాజపా ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.  14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు భాజపా అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.   అయితే ఒక్క విషయాన్ని మాత్రం నేను అడగదలుచుకోలదని అన్నారు. ఇంతకీ ఆ ఒక్క విషయం ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. అసెంబ్లీ సీట్ల పెంపు.. దీనిపై కూడా చంద్రబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ సీట్లు పెంచమని విభజన చట్టంలో ఉందని... కాని ఈ విషయాన్ని తాను అడగదల్చుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు... ఇలా అడిగితే మళ్ళీ రాజకీయం చేస్తున్నా అంటారు... అన్ని విషయాలు వదిలేసి, ఇదే అడుగుతున్నా అంటారు... ఇది ఇవ్వకపోయినా పరవాలేదు, మిగతా అన్ని విభిజన హామీలు నెరవేర్చండి అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసారు.. నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. అందరినీ కలిశాను. పదేపదే విజ్ఞప్తి చేశానన్నారు. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్లీ మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనేనని ప్రకటనలు చేసే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మరి కేంద్రం అయితే ఇవ్వమని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు చంద్రబాబు మాటలకు మారిపోతారా..?