ధర్మాన విషయంలో సిఎం మౌనంపై మంత్రుల ఆగ్రహం!
posted on Aug 22, 2012 @ 4:06PM
రాష్ట్రరెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా విషయంలో ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో కిరణ్‌సర్కారులోని మంత్రులందరూ కళంకితులుగా ప్రతిపక్షాల ద్వారా గుర్తింపును పొందుతున్నారు. ఈ విషయం తెలిసినా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మౌనాన్ని వీడలేదు. ఈ మౌనం చూసి ప్రతిపక్షాలు గట్టిగానే గొంతువిప్పుతున్నాయి.
తాజాగా సిఎంతో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, ఏరాసు ప్రతాపరెడ్డి, దానం నాగేందర్, గల్లా అరుణకుమారి, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, డికె అరుణ సమావేశమయ్యారు. వీరంతా తాము కళంకిత మంత్రులమంటూ నిందలు మోస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం మౌనం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గుర్తు చేశారు.
దీన్ని నివారించాలని కోరారు. ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ట కూడా దిగజారుతోందన్నారు. క్యాబినేట్ సమిష్టినిర్ణయాలకు కొందరినే బాధ్యులను చేయటం తగదని హితవుపలికారు. 22మంది మంత్రులు ఈసమావేశానికి హాజరయ్యారు. అయితే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నగరంలో ఉన్నా సమావేశానికి గైర్హాజరు అయ్యారు. తాను త్వరలో ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొంటానని ఈ సందర్భంగా సిఎం కిరణ్‌కమార్‌రెడ్డి ప్రకటించారు.