కృష్ణాలో వైసీపీ ఖాళీ అవుతుందా..?
posted on Jun 23, 2016 @ 10:03AM
ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి ఎంతో మంది నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ఇప్పుడు ఆపార్టీకి మరో భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. అది కూడా వైసీపీకి పట్టు ఉన్న జిల్లాగా పేరు పొందిన కృష్ణాజిల్లానుండి. అయితే వైసీపీ ఎమ్మెల్యలు టీడీపీ లో చేరుతున్నట్టు స్వయంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుచ్చల అర్జునుడు. వైసీపీ నుండి ముగ్గరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని.. అందులో నూజివీడు ఎమ్మెల్యే కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. మరి ఆయన చెప్పినట్టు వారు టీడీపీలో చేరుతారో లేదో చూడాలి.
కాగా రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో మొన్నటిదాకా వలసల పర్వం జరుగగా బలహీనపడిపోయిన వైసీపీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా పార్టీ ఫిరాయింపులు జరిగితే మరింత బలహీనపడే ప్రమాదం కనిపిస్తోంది. మరి జగన్ వారిని బుజ్జగించేందకు ప్రయత్నిస్తారా.. లేక పోతే పోని అని వదిలేస్తారా.. చూడాలి.