జగన్ కు అక్కడ కూడా షాకులే..
posted on Aug 10, 2016 @ 10:38AM
ఇప్పటికే పార్టీ వలసలతో అందరూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకిస్తుంటే మరోపక్క ఢిల్లీ పర్యటనలో కూడా జగన్ కు షాకులు మీద షాకులు తగులుతున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవ్వగా.. జగన్ ముందే ప్రణబ్ ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును పొగిడేశారట. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైసిపి నేతలతో చంద్రబాబు బాగానే పని చేస్తున్నారని రాష్ట్రపతి స్వయంగా అభిప్రాయపడ్డారట. అంతేకాదు ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలు జగన్‌కు షాకిచ్చారు. వీరిద్దరితో భేటీ కోసం జగన్ అపాయింటుమెంట్ అడిగారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. అసలు.. జగన్‌తో భేటీకి వారు నిరాకరించినట్లుగా కూడా చెబుతున్నారు.
ఇక ఆతరువాత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని జగన్ కలిశారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక హోదా గురించి ఆయనతో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో తాము వెనకాడబోమన్నారు. తమ పోరాటాన్ని విడవబోమన్నారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.