రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు
posted on Nov 12, 2025 @ 4:40PM
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ వైసీపీ 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరిట నిరసనలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
కోవూరులో ఈ ఉద్యమ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు జన సందోహంతో ఈ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రయివేటికరణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటికరణ అడ్డుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.