రైతుల సమస్యలపై పవార్‌తో జగన్ భేటీ
posted on Dec 21, 2011 7:53AM
న్యూఢిల్లీ: రైతు సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.రైతు నేతలు, పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలతో కలిసి అయన శరద్ పవార్‌ను కలిశారు.రాష్ట్రంలోని రైతు సమస్యలపై జగన్ పవార్‌కు ఓ నివేదికును అందించారు. మూడు పేజీలవ నివేదికలో ఏడు అంశాలను అయన పొందుపరిచారు. రైతులను ఆదుకుంటామని పవార్ హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం జగన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రాష్ట్రంలో ఎఫ్‌సిఐ గోదాముల కొరతను ఆయన పవార్ దృష్టికి తెచ్చారు. ప్రజా పంపణీ శాఖ మంత్రి థామస్ సమక్షంలో రేపు బుధవారం ఎఫ్‌సిఐ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పవార్ జగన్‌ను ఆహ్వానించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పవార్ జగన్‌కు హామీ ఇచ్చారు. దీంతో వైయస్ జగన్ రేపు కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. నిజానికి ఆయన రేపు హైదరాబాదులో ఉండాలని అనుకున్నారు. తన జన్మదినాన్ని జగన్ ఢిల్లీలోనే జరుపుకుంటారని అంటున్నారు.