వైసిపికి మరో ఎదురుదెబ్బ
posted on Jun 24, 2013 @ 10:00AM
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వాళ్ల నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి కి బెయిల్ రాక, ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు ఈసీ నిర్ణయం మరో దెబ్బ పడింది.
రాజీనామ చేసి వైసిపి తరుపున గెలిచి జనాల్లో తమ పార్టీకున్న ఇమేజ్‌తో పాటు, అసెంబ్లీలో తమ బలం పెంచుకోవాలనుకున్న నాయకులకు నిరాశే మిగిలింది.. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేనందున ఇప్పట్లో ఇక ఉప ఎన్నికలు నిర్వహించేది లేదంటూ ప్రకటించారు ఈసి సంపత్..
గత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది, టిడిపి నుంచి ఆరుగురు ఎమ్మేల్యేలు పార్టీ విప్‌ను దిక్కరించి ఓటు వేశారు.. దీంతో ఆ పార్టీలు విప్ దిక్కరించిన సభ్యులపై వేటు వేయాలని కోరాగ ఇటీవలే వారిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు..
దీంతో కాలీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ సదరు సభ్యులు చాలా రోజులుగా కోరుతుండగా ఈసి నిర్ణయంతో వారంతా కంగుతిన్నారు..