వైయస్ఆర్ కాంగ్రెస్ నాదే: భాషా
posted on Apr 15, 2011 @ 3:39PM
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పైన అభిమానంతో తాము వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని స్థాపించుకున్నామని ఆ పేరుతో జగన్ ప్రచారం చేసుకోవడం సరికాదని ఆ పార్టీని తానే స్థాపించానని చెబుతున్న మహబూబ్ బాషా అన్నారు. వైయస్ఆర్ పార్టీని తాను స్థాపించానని బాషా అన్నారు. ఆ పేరుతో జగన్ ప్రచారం చేసుకోడాన్ని ఖండిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీని నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ వద్ద నుండి తీసుకున్నారని అలాంటప్పుడు వారు అలాగే ప్రచారం చేసుకోవాలని వైయస్ఆర్ పార్టీ పేరున ప్రచారం చేసుకోవద్దని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ పేరు తనది అని శివకుమార్ అనడంపై తాను కోర్టులో కేసు వేశానని చెప్పారు. కోర్టులో ఉన్న పార్టీ పేరును ఉపయోగించకుండా చూడాలని కోరారు.