వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి వేడుకలు
posted on Jul 8, 2012 @ 9:58AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఆయనకు నివాళులర్పిస్తాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఉద్వేగానికి లోనయిన విజయమ్మ, షర్మిల కంటతడిపెట్టారు. ప్రార్థనల్లో మహానేత వైఎస్‌ఆర్ సేవల్ని స్మరించుకున్నారు. రాజశేఖరరెడ్డి చెరగని చిరునవ్వును గుర్తు చేసుకున్నారు. సమాధి స్థలి దగ్గర ప్రార్థనల తర్వాత కుటుంబ సభ్యులంతా ఘాట్ ప్రాంగణంలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహాన్ని సందర్శించారు. విగ్రహానికి పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ విజయమ్మ, షర్మిల బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ భారతి, వైఎస్ పురుషోత్తంరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కమలమ్మ, విమలమ్మ తదితరులు వైఎస్సార్ కు నివాళులర్పించారు.