వైయస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదినాన్ని ప్రభుత్వం జరుపుతుందా ?
posted on Jul 7, 2012 @ 5:08PM
వైయస్ జన్మదినం ఆదివారం కావడంతో రాష్ట్రమంత్రి వర్గానికి ఏంచేయాలో పాలుపోవడం లేదు. జన్మదినాన్ని జరిపితే వైయస్సార్ అక్రమార్జన కేసులో కొడుకును సీబీఐ కేసుల్లో ఇరికించి జన్మదినం చేయటమేమిటని కాంగ్రెస్ నాయకులు నిలదీస్తారనేది నిజం. ఒకవేళ జరపకపోతే సానుభూతిని వైయస్సార్ కాంగ్రెస్‌లోకి జమఅవుతుందేమోనని భయం నాయకులను వేధిస్తుంది. అందువల్ల దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అయిన వైయస్ జన్మదినాన్ని ప్రభుత్వం జరుపాలా లేదా అనేది ఇంకా తేలలేదు. ఇంతకు ముందు ప్రభుత్వం తమ పార్టీనేతగానే గుర్తించి జన్మదిన వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడని విషయం ఏమంటే వైయస్సార్‌ని తమ నేతగా ప్రకటించి అభివృద్ది పధకాలగురించి వివరించి అవి కాంగ్రెస్‌విగా చెప్పుకోవాలా లేదా అవినీతిలో పాలు పంచుకొని అక్రమ సంపాదన కొడుక్కి ఇచ్చారని చెప్పాలా అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్ నుండి విడివడి వైయస్సార్ కాంగ్రెస్‌గా ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంటు సీటుతో విజయ దంధుభి మ్రోగించిన జగన్‌పై గరం గరంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతుంది.
జన్మదిన వేడుకలు జరుపకపోతే ప్రజల్లో ఇంకా చులకనౌతామని ఒకవైపు, జరిపితే జగన్ అది తన ఖాతాలో జమచేసుకుంటారని మరోబాధ మొత్తానికి ఎటూ తేల్చుకోలేని ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిఇలావుండగా వైసిపి పార్టీమాత్రం వైయస్ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరపాలని నిర్ణయించింది. వైయస్సార్ జన్మదినాన్ని వైసిపి కాంగ్రెస్ ఇంతకు ముందెన్నడు ప్రజలమద్య జరపలేదు. అదికుటుంబకార్యక్రమంగానే జరిపారు. అయితే ఉప ఎన్నికల్లో విజయం తర్యాత ప్రజల మద్య జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, నాయకులు ప్రజలమద్యకు వెళ్లే అవకాశంగా భావిస్తున్నారు. జిల్లాస్ధాయిలోనూ ,డివిజన్ స్దాయిలోనూ దీన్ని విజయవంతంగా జరపటానికి స్దానిక నాయకత్యం బాధ్యతలను నిర్వహిస్తుందని వైసిపి నాయకులు తెలిపారు. ఎప్పుడైనా స్ధానిక ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నందున కార్యకర్తలందరినీ సన్నధం చేయండని వైసిపి గౌరవాద్యక్షురాలిగా విజయమ్మ చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను జరుపుతున్నట్లు తెలుస్తుంది.