మహా ప్రస్తానానికి రాళ్ళేసిన కుర్రాళ్ళేవ్వరు ?

 

 

ముందే అనుకోనట్లుగానే తెలంగాణాలో షర్మిల పాదయాత్ర ఇబ్బందుల్లో పడింది. అసలే తన ‘గద్వాల్ సవాల్’ తో కాకమీదున్న తే.రా.స.కి మరింత పొగబెడుతున్నట్లు రోజా చేసిన కామెంట్స్ కొత్త తల నొప్పులు తెచ్చి పెట్టాయి. పిల్లిని చంకన పెట్టుకు పెళ్లికి వెళ్ళినట్లు, కాస్త నోటితీట ఉన్న రోజాని వెంటబెట్టుకువెళ్ళిన జగన్ సోదరి షర్మిలకి, మొన్న ఆమె మెహబూబ్ నగర్ లో చేసిన ఉపన్యాసంతో ముందు  నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారయింది షర్మిలాకి ఇప్పుడు.


మొన్న షర్మిలమ్మ పాదయాత్రలో కాలుకలిపిన యాంకరమ్మ రోజా తమకు నిరసనలు తెలియ జేస్తున్న ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రజలకి నచ్చినవాడు, మెచ్చినవాడే అసలయిన నాయకుడు అవుతాడు తప్ప ఏవో మాయమాటలు చెప్పినవాడు కాలేడు. నిజం చెప్పాలంటే, మన షర్మిల పాదయాత్రలకి తెలంగాణా ప్రజలు నీరాజనంపట్టడం చూస్తున్న తే.రా.స. నాయకులకి అప్పుడే బెంగ పట్టుకొంది. అందుకే ఇలాగ అమాయకులయిన ప్రజలని రెచ్చగొట్టి మమల్ని అడ్డుకోవాలని చూస్తునారు. గాని, తెలంగాణా ప్రజలు వై.యస్.ఆర్. కాంగ్రేసుకి బ్రహ్మరధం పడుతున్నారు,” అని చెప్పుకొచ్చింది అందాల యాంకరమ్మ మన రోజమ్మ.



శల్య సారద్యం చేస్తున్న ఆమెని వారించలేక సమర్దించను లేక షర్మిలమ్మ పాపం ఎంత బాధ పడిందో ఎవరికీ తెలీదు. ఈ రోజు పాలమూరు వద్ద కొందరు తెలంగాణా విద్యార్దులు ఆమెపైకి రాళ్ళు విసిరి ఆమె మహాప్రస్తానానికి గండికొట్టాలని చూసారు. గాని, సమయానికి పోలీసులు అడ్డు పడటంతో  అప్పటికి గడ్డం గట్టెకింది. ‘ఇన్ ఫ్రంట్ దేరీస్ క్రోకడైల్ ఫెస్టివల్ సుమీ!’ అని షర్మిల మనసులో
 గొణుకొంటూ మళ్లీ జర్మనీ బూట్లతో నడక మొదలు పెట్టింది.