తెలంగాణవాదులకు చంద్రబాబు వెన్నుపోటు
posted on Sep 8, 2013 @ 11:52AM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణవాదులకు వెన్నుపోటు పొడిచి సమైక్యాంధ్రులను మోసం చేసేందుకు సీమాంధ్రలో ఆత్మగౌరవయాత్ర చేపట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఆమె సమైక్య శంఖారావం కడప జిల్లాలో సాగింది. చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
లోకేష్‌ను అందలం ఎక్కించుకునేందు కు హరికృష్ణ కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని షర్మిలా ఆరోపించారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పటికీ అవే రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ను ఏంచేశారో అందరికీ తెలుసన్నారు. చార్మినార్ ఏమైనా కట్టించారా? వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను బినామీలకు అప్పగించారని ఆరోపించారు.
సోనియాగాంధీ రాహుల్‌ను ప్రధానమంత్రిని చేసేందుకే తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆరోపించారు.