జగన్ కేసులో తుది చార్జీషీట్
posted on Sep 6, 2013 7:32AM
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మీద తుది చార్జీషీటు రెడీ అయింది. అక్రమాస్తుల కేసులో దాదాపు 15 నెలలుగా జైళ్ళో ఉంటున్న జగన్ కేసు దర్యాప్తు దాదాపుగా పూర్తి అయింది. ఈ చార్జీషీట్‌ను శుక్రవారం కోర్టుకు సమర్పించనున్నట్టుగా సమాచారం.
ఇప్పటికే చార్జీషీట్‌లోని కీలక అంశాలను సీబిఐ డైరెక్టర్‌కు వివరించిన ఇక్కడి ఇన్‌చార్జ్ జేడి వెంకటేశ్వర్ కోర్టులో సమర్పించడానికి ఆమోదం పొందారు. ఎంతమందిని విచారించారు, ఎవరిని నిందుతులుగా చేర్చారు అన్న అంశాలతో పాటు సేకరించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించనున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఐదు చార్జీషీట్లను సమర్పించిన కోర్టు మరికొన్ని అనుబంధ చార్జీషీట్లను కూడా వేసింది. గతంలో జగన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కేసు దర్యాప్తును సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలన్న కోర్టు వ్యాఖ్యలతో ఈ శుక్రవారం సిబిఐ తుది చార్జీషీట్ దాఖలు చేయనుంది.