ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆసక్తి రేపుతున్న ఢిల్లీ పయనం
posted on Dec 14, 2020 @ 7:33PM
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిందో లేదో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్న ఆయన..సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు ఏపీ సీఎం. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే కేంద్రానికి లేఖరాసిన సీఎం జగన్.. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాను కలవబోతున్నారు. రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ముగిసే వెంటనే.. ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.