ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..
posted on Aug 9, 2016 @ 12:52PM
పార్లమెంట్ ఉభయ సభల్లో కీలకమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ జీఎస్టీ బిల్లుపై మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అత్యావశ్యకంగా మారిందని.. చట్టంగా మారబోయే జీఎస్టీ వల్ల.. అమ్మకం పన్ను ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయని, తద్వారా మౌలిక వసతులు లేని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు క్షీణిస్తాయని చెప్పారు. నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతుంది. అందుకే రాష్ట్రాన్ని బతికించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని, ఆమేరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే.. ఏపీకి పెట్టుబడులు ధారాళంగా వస్తాయి.. పరిశ్రమలు పుట్టుకొస్తాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి' అని వైఎస్ జగన్ అన్నారు.