ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ రాజీనామా?
posted on Oct 24, 2015 @ 11:53AM
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకూ ఎన్నో నిరసనలు, దీక్షలు చేశారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటి వరకూ చేసిన దీక్షలకు ఎలాంటి ఫలితం రాలేదు.. అఖరికి నిరాహార దీక్ష చేసిన కూడా పెద్దగా ఎవరూ పట్టించుకున్న పాపాన లేదు. అయితే ఇప్పుడు జగన్ కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. తను రాజీనామా చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోడీ ఏపీకి ఎటువంటి వరాలు ప్రకటించలేదని చెప్పి కాంగ్రెస్, సీపీఐ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఆ పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి, వైకాపా పార్టీకి మధ్య కేవీపీ రాయబారాలు కూడా నడుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ జగన్ కనుక రాజీనామా చేస్తే అతని వెంట ఎంతమంది వస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. వైకాపా పార్టీ నుండి 67 మంది ఎమ్మెల్యేలు.. ఆరుగురు ఎంపీలు గెలవగా వారు అందరూ కూడా రాజీనామా చేస్తారా? చేయరా అన్నది ప్రశ్న.. ఒకవేళ చేస్తే అది స్పీకర్ ఆమోదిస్తే మొత్తానికే మోసం వస్తుంది. దీంతో ఏ చేయాలనేదానిపై జగన్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారట. మరి జగన్ ఎంత వరకూ రాజీనామా చేస్తారో చూడాలి.